ఏడు దేశాల్లో సంచలనం సృష్టిస్తున్న ధురంధర్ డైరెక్టర్ భార్య టాలీవుడ్ హీరోయిన్ అని తెలుసా?

గత కొంతకాలంగా సరైన కలెక్షన్లు లేక బోసిపోయిన బాలీవుడ్ సినీ పరిశ్రమకు గట్టి ఊపిరినిచ్చింది రణ్ వీర్ సింగ్ ధురంధర్ సినిమా.;

Update: 2026-02-06 06:30 GMT

గత కొంతకాలంగా సరైన కలెక్షన్లు లేక బోసిపోయిన బాలీవుడ్ సినీ పరిశ్రమకు గట్టి ఊపిరినిచ్చింది రణ్ వీర్ సింగ్ ధురంధర్ సినిమా. బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ హీరోగా, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్.మాధవన్, అర్జున్ రాంపాల్ తదితరులు కీలకపాత్రల్లో నటించిన చిత్రమిది. ప్రముఖ చైల్డ్ ఆర్టిస్ట్ సారా అర్జున్ ఈ సినిమాతో హీరోయిన్ అవతరించి ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్గా పేరు దక్కించుకుంది. ఇకపోతే ఈ చిత్రానికి ఆదిత్యధర్ దర్శకత్వం వహించి, నిర్మించారు. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్ కి పట్టిన బూజును దులిపేస్తూ ఏకంగా ఏడో దేశాలలో నంబర్ వన్ స్థానంలో ట్రేడింగ్ లో నిలుస్తూ దూసుకుపోతోంది.

బాలీవుడ్ బూజు దులిపిన ధురంధర్..

ఇప్పటివరకు రూ.1350 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది ఈ సినిమా. 2025 డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ కూడా అక్కడక్కడ కొన్ని చోట్ల థియేటర్లలో రన్ అవుతూ మంచి ఆదాయాన్ని దక్కించుకుంటుంది. ఇదిలా ఉండగా ఒకవైపు ఈ సినిమా వరుస కలెక్షన్లతో దూసుకుపోతున్న నేపథ్యంలో.. మరోవైపు ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకుడి గురించిన పలు విషయాలు వైరల్ గా మారుతున్నాయి.

ఈ చిత్ర దర్శకుడి భార్య ఓ టాలీవుడ్ హీరోయిన్..

అందులో భాగంగానే ఈ ధురంధర్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఆదిత్యధర్ భార్య ఒక టాలీవుడ్ హీరోయిన్ అని మీకు తెలుసా..? ఇప్పటికే ఆమె పలువురు టాలీవుడ్ హీరోలతో సినిమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకుంది. మరి ఆమె ఎవరు? ఆమె నటించిన చిత్రాలేంటి? అనే విషయం ఇప్పుడు చూద్దాం.

టీవీ సీరియల్స్ తో వెలుగులోకి వచ్చిన బ్యూటీ..

ఆమె ఎవరో కాదు యామి గౌతమ్. పంజాబ్ లోని చండీగఢ్ లో 1988 నవంబర్ 28న జన్మించిన ఈమె.. మొదట హిందీ టీవీ సీరియల్స్ తో కెరియర్ ను మొదలుపెట్టింది. ఇక 2017లో వచ్చిన కన్నడ చిత్రం 'ఉల్లాస ఉత్సాహ' సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది. 2012లో విక్కీ డోనర్ లో నటించి హిందీ రంగప్రవేశం కూడా చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే వీర్య దానంపై నిర్మించబడిన ఈ సినిమా అప్పట్లో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అటు యామి గౌతమ్ కి కూడా మంచి ఇమేజ్ లభించింది.

విజయ్ దేవరకొండ సరసన తొలి అవకాశం..

ఇకపోతే ఈమె తెలుగులో తొలిసారి 'నువ్విలా' అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. రవి బాబు రచనా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో యామి గౌతమ్, విజయ్ దేవరకొండ, సరయు, హవీష్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. అలా ఈ చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన యామి గౌతమ్.. ఆ తర్వాత అల్లు శిరీష్ హీరోగా నటించిన 'గౌరవం' సినిమాతో వెలుగులోకి వచ్చింది. ఇందులో తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఆ తర్వాత యుద్ధం, నితిన్ తో కొరియర్ బాయ్ కళ్యాణ్ వంటి చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించిన యామి గౌతమ్..

హిందీలోనే వరుస సినిమాలు చేస్తూ బిజీ..

ప్రస్తుతం హిందీ లోనే సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ఒకవైపు సినిమాలు మరొకవైపు టీవీ సీరియల్స్ తో బిజీగా మారిన యామి గౌతమ్ భర్తే ఈ ఆదిత్యధర్ అని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏది ఏమైనా ఒక్క సినిమాతో సంచలనం సృష్టించిన ఈ డైరెక్టర్ మన టాలీవుడ్ హీరోయిన్ ని భార్యగా చేసుకున్నారు అని తెలిసి అభిమానులు కూడా తెగ సంబరపడిపోతున్నారు.

Tags:    

Similar News