అమర ప్రేమ గీతాల వెనుక నిశ్శబ్ద వాస్తవికత!

భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో ఆనంద్ బక్షీ ఓ సంచలనం. మూడు వేలకు పైగా పాటలతో కోట్ల మంది హృదయాలను గెలుచుకున్న దిగ్గజ గీత రచయిత.

Update: 2026-07-27 02:30 GMT

భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో ఆనంద్ బక్షీ ఓ సంచలనం. మూడు వేలకు పైగా పాటలతో కోట్ల మంది హృదయాలను గెలుచుకున్న దిగ్గజ గీత రచయిత. ఆనంద్ అందించిన రొమాంటిక్ గీతాలు ఎప్పటికీ నిలిచిపోయే అమర ప్రేమ కావ్యాలు. ప్రేమికుల భావోద్వేగాలను, విరహ వేదనను, శృంగార మాధుర్యాన్ని తన కలంతో అక్షర రూపం దాల్చిన ఆనంద్ బక్షీ తెరవెనుక వ్యక్తిగత జీవితం మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నంగా సాగింది.

ప్రేమ పాటలు రాయడంలో ఆనంద్ ది అందెవేసిన చేయి అయినా? నిజ జీవితంలో మాత్రం అత్యంత క్రమశిక్షణ, కఠినమైన మనస్తత్వం కలిగిన వ్యక్తిగా పేరుగాంచారు. ఒక సైనికుడిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించిన ఆనంద్ చివరి వరకు అదే మిలిటరీ డిసిప్లిన్‌ను వ్యక్తిగత జీవితంలోనూ, పనితీరులోనూ పాటించారు. భావోద్వేగాల ఊసులు రాసే కవి హృదయం ఒకవైపు ఉంటే.. ప్రతి నిమిషాన్ని లెక్కలేసుకునే పకడ్బందీ మనస్తత్వం మరోవైపు ఆనంద్ సొంతం.

తెరపై నటీనటులు పాడుకునే శృంగార గీతాలను సృష్టించే సమయంలో ఆనంద్ పూర్తి వృత్తిధర్మాన్ని ప్రదర్శించేవారే తప్ప వ్యక్తిగత భావోద్వేగాలను వాటికి అపాదించేవారు కాదు. ఆనంద్ దృష్టిలో గీత రచన అనేది బాధ్యతాయుతమైన పని. దర్శకులు కోరుకున్న మూడ్‌కు తగినట్లుగా పదాలను కూర్చడంలో ఆనంద్ నిపుణుడు. అందుకే ఎన్నో శృంగార భరితమైన పాటలు రాసినా? ఆనంద్ ఇళ్లలో వాతావరణం మాత్రం ఆర్మీ బ్యారెక్స్‌లా అత్యంత క్రమశిక్షణతో కూడినదై ఉండేదని సన్నిహితులు చెబుతుంటారు.

కళాకారులు సాధారణంగా అత్యంత భావోద్వేగ జీవులుగా ఉంటారనే అభిప్రాయానికి ఆనంద్ బక్షీ జీవితం పూర్తి వ్యతిరేకం. ఆయన కుటుంబ జీవితంలో ఎప్పుడూ క్రమపద్ధతిని అనుసరించేవారు. సమయపాలన, నిబద్ధత, మాట మీద నిలబడటం ఆనంద్ నైజం. ప్రేమ పాటల రచయితగా ఆయనకున్న ఇమేజ్‌కు రియల్ లైఫ్ పర్సనాలిటీకి మధ్య ఏమాత్రం పొంతన ఉండేది కాదు. అయినా? ఈ రెండు భిన్న ధృవాలను ఆనంద్ జీవితంలో సమ ర్థవంతంగా బ్యాలెన్స్ చేయగలిగారు.

వ్యక్తిగత జీవితంలో కఠినంగా, ఖచ్చితంగా ఉన్నప్పటికీ ఆనంద్ రాసిన పాటల్లో మాత్రం అమితమైన మాధుర్యం, మానవ సంబంధాల లోతు కనిపిస్తాయి. దీనికి కారణం ఆనంద్ కు ఉన్న‌ అద్భుతమైన పరిశీలనా శక్తి , ప్రజల మనస్తత్వాలను ఇట్టే అర్ధం చేసుకోగల నేర్పు. ఆనంద్ మనసులోని కఠినత్వాన్ని బయటకు రానివ్వకుండా, శ్రోతల హృదయాలను తాకే మృదువైన పదాలను సృష్టించగలిగారు. అందుకే ఆనంద్ బ‌క్షి పాటలు కాలంతో పాటు ప్రయాణించి ఇప్పటికీ నిత్యనూతనంగా నిలుస్తున్నాయి.

వెండితెరపై ఎన్నో అద్భుతమైన ప్రేమ గీతాలను రాల్చిన ఆనంద్ బక్షీ ప్రయాణం కళాకారుల వ్యక్తిగత స్వభావానికి, వారి సృజనాత్మకతకు మధ్య ఉండే సంక్లిష్టమైన సంబంధాన్ని తెలియజేస్తుంది. కఠినమైన సైనిక నేపథ్యం నుంచి వచ్చి కోట్లాది మంది ప్రేమికుల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న ఆనంద్ ప్రయాణం భావి తరాల గీత రచయితలకు ఎప్పటికీ పాఠం లాంటిదే.

Tags:    

Similar News