నందన్ మణిరత్నం ఇలా అయితే ఎలా?
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సుహాసిని - మణిరత్నంల జోడీ క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు.ఒకరు అగ్ర దర్శకుడిగా, మరొకరు అద్భుతమైన నటిగా, రచయిత్రిగా దశాబ్దాలుగా సినీ ప్రపంచాన్ని ఏలుతున్నారు.
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సుహాసిని - మణిరత్నంల జోడీ క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు.ఒకరు అగ్ర దర్శకుడిగా, మరొకరు అద్భుతమైన నటిగా, రచయిత్రిగా దశాబ్దాలుగా సినీ ప్రపంచాన్ని ఏలుతున్నారు. వారు సంపాదిం చుకున్న కీర్తి ప్రతిష్టలు, సినీ నేపథ్యం గురించి చూస్తే ఆ కుటుంబం నుంచి వచ్చే వారసులు కూడా అదే రంగాన్ని ఎంచుకుంటారనుకుంటాం. కానీ దిగ్గజ దంపతుల ఏకైక కుమారుడు నందన్ మణిరత్నం మాత్రం సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. సెలబ్రిటీ హోదాకు, చిత్ర పరిశ్రమ లైమ్‌లైట్‌కు చాలా దూరంగా ఉంటూ తనకంటూ ప్రత్యేకమైన వృత్తిపరమైన మార్గాన్ని ఎంచుకున్నారు. తల్లిదండ్రుల బాటలో కెమెరా ముందుకు రావడానికో .. దర్శకత్వం వైపు అడుగులు వేయడానికో ఆయన ఎప్పుడూ ఆసక్తి చూపకపోవడం గమనార్హం.
సినిమా రంగానికి దూరంగా ఉన్నప్పటికీ నందన్ విద్య ..వృత్తిపరమైన రంగాలలో అద్భుతమైన ప్రతిభను కనబరుస్తున్నారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వంటి ప్రపంచ ప్రఖ్యాత విద్యాసంస్థల్లో ఉన్నత విద్యను అభ్యసించిన నందన్ ప్రస్తుతం కార్పొరేట్ .. బిజినెస్ రంగాలలో రాణిస్తున్నారు. వ్యాపార ప్రపంచంలో తనకంటూ బలమైన గుర్తింపును తెచ్చుకోవడానికి ఎంచుకున్న మార్గం చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. చాలా మంది స్టార్ కిడ్స్ తమ కుటుంబ నేపథ్యాన్ని ఉపయోగించుకుని సులభంగా సినిమాల్లోకి ప్రవేశిస్తుంటారు. అయితే నందన్ మాత్రం ఆ ట్రెండ్‌కు పూర్తిగా భిన్నంగా తన సొంత కాళ్లపై నిలబడాలని నిశ్చయించుకున్నారు. వ్యాపార రంగంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ పారిశ్రామిక వేత్తగా సత్తా చాటుతున్నారు. సినిమా గ్లామర్ ప్రపంచానికి దూరంగా ప్రశాంతమైన .. బాధ్యతాయుతమైన కార్పొరేట్ జీవితాన్ని ఇష్టపడుతున్నారు.
కొడుకు సినిమా రంగంలోకి రావాలని ఏ తల్లిదండ్రులైనా కోరుకోవడం సహజం. కానీ మణిరత్నం, సుహాసిని దంపతులు తమ కుమారుడి ఇష్టానికి పూర్తి స్వేచ్ఛ నిచ్చారు. ఏ రంగంలో రాణించాలనే దానిపై ఆయన తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తూ ప్రోత్సహించారు. తమ ప్రొఫెషనల్ లైఫ్‌ను, కుటుంబ జీవితాన్ని చాలా స్పష్టంగా వేరుగా ఉంచడంలో ఈ దంపతులు ఎప్పుడూ ముందుంటారు. మొత్తానికి వెండితెరపై మాయాజాలం సృష్టించే దిగ్గజాల ఇంట్లో పుట్టినా? రంగుల ప్రపంచానికి దూరంగా వ్యాపార సామ్రాజ్యంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదిం చుకుంటున్న నందన్ మణిరత్నం ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం.
వారసత్వం అనేది కేవలం సినిమాలకే పరిమితం కాదని.. ఏ రంగంలోనైనా స్వయంకృషితో రాణించవచ్చు నిరూపిస్తున్నారు. అయితే నందన్ లో వీటన్నింటికి మించి మరో గొప్ప ట్యాలెంట్ ఉంది. నందన్ కమ్యూనిజం భావజాలం ఉన్నవారు. అందుకు చిన్న వయసులోనే బీజం పడింది. 15 ఏళ్ల వయసులోనే పార్లమెంట్ సమావేశాలు వినేవారు. అతడికి సీపీఎం పార్టీలో సభ్యత్వం కూడా ఉంది. రచన అన్నా మంచి ఆసక్తి చూపిస్తారు. మరి అదే ఆసక్తితో డాడ్ వారసత్వాన్ని అందుకోవాలని కోరుకుంటోన్న అభిమానులు లేకపోలేదు.