బిబి4 : ఈవారం ఎవరు బయటకు వెళ్లడం లేదా?

Update: 2020-10-04 16:32 GMT
తెలుగు బిగ్‌ బాస్‌ నాల్గవ వారం పూర్తి చేసుకుంది. మొదటి మూడు వారాల్లో వారానికి ఒకరు చొప్పున సూర్య కిరణ్‌.. కరాటే కళ్యాణి.. టీవీ9 దేవిలు ఎలిమినేట్‌ అయ్యారు. ఈ వారం ఎలిమినేషన్‌ అంటూ స్వాతి దీక్షిత్‌ ను బిగ్‌ బాస్‌ బయటకు పంపించాడు. అయితే ఆమెది ఫేక్‌ ఎలిమినేషన్‌ అంటూ అంతా బలంగా నమ్ముతున్నారు. ఆమె వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇచ్చి అంతో ఇంతో పులిహోర కలిపేందుకు ఉపయోగపడుతుంది. కనుక ఆమె కంటిన్యూ అయితేనే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

ఆమెను వారం లేదా కొన్ని రోజుల పాటు సీక్రెట్‌ రూంలో ఉంచడం వల్ల ఆమెకు స్పెషల్‌ పవర్‌ ఇచ్చి మళ్లీ ఇంట్లోకి పంపించే అవకాశం ఉందంటున్నారు. ఇక నేటి ఎపిసోడ్‌ లో కూడా ఎలిమినేషన్‌ పక్రియ ఉంటుందని ప్రోమోలో చూపిస్తున్నారు. నేడు కూడా అందరు సేవ్‌ అవ్వబోతున్నారట. అంటే ఈ వారం అస్సలు ఎవరు కూడా ఎలిమినేట్‌ అవ్వడం లేదు. ఈ విషయమై మరికాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

బిగ్‌ బాస్‌ లో ఏమైనా జరగవచ్చు. రెండు ఎలిమినేషన్‌ లు ఉండవచ్చు ఒక్కో సారి ఒక్క ఎలిమినేషన్‌ కూడా ఉండవచ్చు. ఇలాంటివి గతంలో జరిగాయి. ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేందుకు ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఐపీఎల్ తో పోటీ పడేందుకు ఇలాంటి ట్రిక్కులు పన్నుతున్నారు. మరి ఎంత వరకు వర్కౌట్ అవుతుంది అనేది చూడాలి.


Tags:    

Similar News