పాల్ గ‌జిబిజి క‌విత‌ల‌ వెన‌క కార‌ణం క‌నిపెడ‌తారా?

Update: 2021-04-03 03:30 GMT
సౌతిండ‌స్ట్రీ డ్యాషింగ్ గాళ్ గా అమ‌లాపాల్ కి ఉన్న క్రేజు అంతా ఇంతా కాదు. తెలుగు- తమిళం- మలయాళ చిత్రాలలో న‌టించి సౌత్ లో అగ్ర నాయిక‌గా రాణించిన అమ‌లాపాల్  కెరీర్ జ‌ర్నీ ఆస‌క్తిక‌రం. ఈ భామ  మైనా చిత్రంలో టైటిల్ రోల్ పోషించిన తర్వాత సౌత్ అంత‌టా పాపుల‌ర‌య్యారు. ఈ చిత్రం ఇరుగు పొరుగు భాష‌ల్లోనూ రిలీజైంది. మైనా స‌క్సెస‌య్యాక‌ అమలా  టాప్ స్టార్ గా పేరు తెచ్చుకుంది. తరువాత స్టార్ హీరోల స‌ర‌స‌న భారీ ప్రాజెక్టులకు సంతకాలు చేసింది.

కెరీర్ స్టార్ డ‌మ్ ప‌రంగానే కాదు.. బ్రె‌యిన్ విత్ బ్యూటీగా అమలాకు గుర్తింపు ద‌క్కింది.  తన అభిమానులను రకరకాల వైవిధ్యమైన పాత్ర‌ల‌తో ఎల్లప్పుడూ ఆశ్చర్యపరుస్తుంది. రెడ్ కార్పెట్ వేడుక అయినా.. పెద్ద‌ తెరపై లేదా రోజువారీ వేష‌ధార‌ణ‌ల‌తోనూ అమ‌లాపాల్ హాట్ టాపిక్ గా మారుతుంటారు. త‌న‌ ముఖం మీద ఎప్పుడూ అందమైన చిరునవ్వు ఆత్మ‌ విశ్వాసం ఆక‌ట్టుకుంటాయి.

ఇటీవ‌ల అమ‌లాపాల్ .. లులు ఫ్యాషన్ వీక్ అండ్ అవార్డుల కార్య‌క్ర‌మంలో రెడ్ కార్పెట్ మెరుపులు మెరిపించిన సంగ‌తి తెలిసిందే. పాల్ అద్భుతమైన రూపాన్ని ఆమె అభిమానులు  అనుచరులు ప్రశంసించారు. తాజాగా అమ‌లాపాల్ మ‌రో కాన్సెప్ట్ ఫోటోషూట్ అంతే వేడి పెంచుతోంది. ఈ ఫోటోలో బ్యాక్ గ్రౌండ్ గోడ‌పై క్లాసిక్ డేస్ ఫోటోలు ద‌ర్శ‌న‌మిస్తుండ‌గా.. అమ‌లాపాల్ త‌న టాప్ ని చేత్తో ప‌ట్టుకుని క‌నిపించింది.

నాలో సగం గుండెలు ద్ర‌వించే పదాలతో నిండి ఉంది. నాలో సగం బాధాకరంగా సిగ్గుపడుతోంది. నేను ఏకాంతాన్ని కోరుకుంటాను. ఇంకా ప్రజలను కోరుకుంటాను. నేను ప్రతిదానికీ ప్రేమను పోయాలనుకుంటున్నాను. ఇంకా నా స్వీయ సంరక్షణను పెంపొందించుకుంటాను. శాంతంగా వెళ‌తాను. నేను ఒక‌సారి హడావిడిలో జీవించాలనుకుంటున్నాను. ఇంకా కూర్చుని ఆలోచించాలనుకుంటున్నాను... అంటూ అమ‌లాపాల్ ఆస‌క్తిక‌ర‌మైన క‌విత‌ను అల్లారు.

ఇది జీవితం లో గజిబిజి అని వ్యాఖ్యానించ‌డం మ‌రో ట్విస్టు.  మనమందరం ఎన్నో ఉద్యోగాలు చేస్తాం. అందుకే షిఫ్టుల్లో ప‌ని చేయాలి. మ‌నం సంక్లిష్టమైన జీవులం.. అయితే జీవితంలో ఆటుపోట్ల‌ను అధిగ‌మించేందుకు ప్ర‌తిసారీ ప్ర‌య‌త్నిస్తాం.. అని అమ‌లాపాల్ త‌న వ్యాఖ్యానంలో ఎమోష‌న్ అయ్యారు. ఇటీవ‌లి కాలంలో అమ‌లాపాల్ లో ఆధ్యాత్మ‌క భావాలు అభిమానుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాయి.

ఆమె చిత్రం లో న‌గ్నంగా న‌టించిన అమ‌లాపాల్ ప్ర‌స్తుతం వ‌రుస‌గా ప్ర‌యోగాత్మ‌క క‌థాంశాల్లో న‌టిస్తున్నారు. ఇటీవ‌లే ల‌స్ట్ స్టోరీస్ రీమేక్ పిట్ట‌క‌థ‌లు లోనూ అమ‌లాపాల్ న‌టించారు. మ‌ల‌యాళంలో ఆడుజీవితం .. ప‌ర‌న్ను ప‌ర‌న్ను ప‌ర‌న్ను అనే మ‌రో చిత్రంలోనూ న‌టిస్తున్నారు. అదో అంధ ప‌ర‌వై పోలా ... క‌డ‌వ‌ర్ అనే త‌మిళ చిత్రాల్లోనూ న‌టిస్తున్నారు.

Full View
Tags:    

Similar News