రిలీజ్ ఫైట్‌..'టాక్సిక్' టీమ్‌లో అస‌హ‌నం?

రెండు సంచ‌ల‌న చిత్రాలు ఒకే రోజు బ‌రిలోకి దిగితే అది ప్రేక్ష‌కుల‌కు ఓ ఫెస్టివెల్‌లా ఉంటుంది కానీ మేక‌ర్స్‌కి మాత్రం చాలా ఇబ్బందిక‌రంగా ఉంటుంది.;

Update: 2026-02-17 08:08 GMT

రెండు సంచ‌ల‌న చిత్రాలు ఒకే రోజు బ‌రిలోకి దిగితే అది ప్రేక్ష‌కుల‌కు ఓ ఫెస్టివెల్‌లా ఉంటుంది కానీ మేక‌ర్స్‌కి మాత్రం చాలా ఇబ్బందిక‌రంగా ఉంటుంది. ఇప్పుడు ఇదే ప‌రిస్థితిని య‌ష్ 'టాక్సిక్‌' టీమ్ ఎదుర్కొంటోంది. బాలీవుడ్ క్రేజీ హీరో ర‌ణ్‌వీర్‌సింగ్ క‌థానాయకుడిగా న‌టిస్తున్న హైలీ టాక్ట్ స్పై యాక్ష‌న్ డ్రామా `ధురంధ‌ర్ 2 ది రివేంజ్‌`. గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో విడుద‌లై సంచ‌ల‌నం సృష్టించిన 'ధురంధ‌ర్‌' మూవీకిది సీక్వెల్‌. రాకంటెంట్‌తో విడుద‌లై ప్ర‌పంచ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారి బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది.

దీంతో దీనికి సీక్వెల్‌గా రూపొందుతున్న 'ధురంధ‌ర్ 2: ది రివేంజ్‌'పై అంచ‌నాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఈ మూవీని మార్చి 19న బారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తున్నారు. ఇదే రోజున రాకింగ్ స్టార్ య‌ష్ న‌టించిన 'టాక్సిక్' రిలీజ్ అవుతోంది. ఉత్త‌రాదిలో గుడిప‌డ్వా, ద‌క్షిణాదిలో ఉగాది సెల‌వులు ఉండంటంతో ఈ రెండు సినిమాల‌కు బాగా క‌లిసి వ‌స్తుంద‌ని భావించి రెండు సినిమాల మేక‌ర్స్ మార్చి 19ని ఫైన‌ల్ చేసుకున్నారు. ఇదే డేట్‌కు అడివి శేస్ `డెకాయిట్`ని రిలీజ్ చేయాల‌నుకున్నారు. అయితే అదే స‌మ‌యంలో 'ధురంధ‌ర్ 2' రిలీజ్ అవుతోంద‌ని తెలిసి దాన్ని పోస్ట్ పోన్ చేశారు.

ఈ నేప‌థ్యంలోనే య‌ష్ న‌టిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ 'టాక్సిక్‌' రిలీజ్ కూడా వాయిదా ప‌డుతుంద‌నే వాద‌న‌లు వినిపించాయి. అయితే టీమ్ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌డానికి, త‌మ సినిమా విడుద‌ల‌ని వాయిదా వేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌టం లేదు. అనుకున్న ప్ర‌కారయే 'ధురంధ‌ర్ 2' వ‌చ్చానా 'టాక్సిక్‌'ని రిలీజ్ చేయాల‌ని ఫిక్స్ అయ్యారు. 'ధురంధ‌ర్ 2' పోటీ కార‌ణంగా, దానిపై ఉండే క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని టాక్సిక్ రిలీజ్‌ని య‌ష్ వాయిదా వేస్తాడ‌ని అంతా అనుకున్నారు కానీ ఇందుకు య‌ష్ ఏమాత్రం సిద్ధంగా లేడని ఇన్ సైడ్ టాక్‌.

'టాక్సిక్‌' రిలీజ్ డేట్‌ని మేక‌ర్స్ డిసెంబ‌ర్‌లోనే ప్ర‌క‌టించారు. అయితే అదే డేట్‌ని 'ధురంధ‌ర్ 2' కూడా లాక్ చేయ‌డంతో అడివి శేష్ త‌ర‌హాలో య‌ష్ కూడా వెన‌క్కి త‌గ్గుతాడ‌ని, పోటీ నుంచి త‌ప్పుకుంటాడ‌ని అంతా అనుకున్నారు కానీ అది జ‌ర‌గ‌ద‌ని తెలుస్తోంది. కారణం 'కేజీఎఫ్‌' రిలీజ్  త‌రువాత య‌ష్ సినిమా కోసం అభిమానులు, సినీ ల‌వ‌ర్స్ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో `ధురంధ‌ర్ 2` కోసం రిలీజ్ డేట్‌ని మార్చ‌డం వారిని తీవ్ర ఆగ్ర‌హానికి గురి చేస్తుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి.

సంప్ర‌దించ‌కుండానే `ధురంధ‌ర్ 2` రిలీజ్ డేట్‌ని బాలీవుడ్ మేక‌ర్స్ ప్ర‌క‌టించ‌డం `టాక్సిక్‌` ప్రొడ్యూస‌ర్స్‌ని తీవ్ర అస‌హ‌నానికి గురి చేసిన‌ట్టుగా తెలుస్తోంది. ముందుగా రిలీజ్ డేట్‌ల‌పై రెండు సినిమాల‌కు సంబంధించిన మేక‌ర్స్ చ‌ర్చించుకుని ఉంటే ఈ స‌మ‌స్య వ‌చ్చి ఉండేది కాద‌ని కొంత మంది అంటున్నారు. అయితే ద‌క్షిణాదిలో ఓ స్టార్ సినిమా రిలీజ్ అవుతోందంటే అదే స‌మ‌యంలో మ‌రో స్టార్ సినిమా రిలీజ్ కాదు. ఇద్ద‌రి సినిమాలు క్లాష్ కాకుండా ముందు కూర్చుని స‌మ‌న్వ‌యం చేసుకుంటారు. కానీ ఇలాంటి వాతావ‌ర‌ణం బాలీవుడ్‌లో లేదు. అందు వ‌ల్లే `టాక్సిక్‌`ని లెక్క‌లోకి తీసుకోకుండా `ధురంధ‌ర్ 2` మేక‌ర్స్ రిలీజ్ డేట్‌ని ప్ర‌క‌టించార‌ని కొంత మంది వాదిస్తున్నారు. ఓవ‌రాల్‌గా `ధురంధ‌ర్ 2` మార్చి 19న రిలీజ్ అవుతూ త‌మ సినిమాకు పోటీప‌డ‌నుండ‌టం `టాక్సిక్‌` మేక‌ర్స్‌ని ఇరిటేట్ చేస్తోంద‌ని ఇన్ సైడ్ టాక్‌.

Tags:    

Similar News