థియేటర్లు తెరిస్తే రిలీజ్ ధైర్యం చేసే ఒకే ఒక్కడు
దేశవ్యాప్తంగా థియేటర్లు తెరుచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చేస్తున్నాయ్ అన్న వార్తతో ఎగ్జిబిటర్లు సంబరాలు చేసుకున్నారా? అంటే సీన్ ఎలా ఉందో సినీవర్గాలకు తెలిసిందే. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల థియేటర్ యజమానుల ముఖాల్లో కళ ఉన్నట్టు కనిపించడం లేదు. ఎందుకంటే థియేటర్ రన్ చేయడం అంటే అంత ఆషామాషీ కాదు.
ఎలాంటి మహమ్మారీ లేని రోజుల్లోనే థియేటర్లలో జనం లేక ఈగలు తోలిన రోజులున్నాయి. అసలు తొలి వీకెండ్ తర్వాత థియేటర్లకు వచ్చే ఆడియెనే లేకుండా పోయారు. ఇప్పుడు కరోనా కష్ట కాలంలో పరిస్థితి ఎలా ఉంటుందో ఆమాత్రం ఊహించలేరా? అది కూడా సగం కుర్చీలనే నింపాలి అనే ప్రభుత్వ నియమం పాటిస్తే ఇక రెంటు కరెంటు టాయ్ లెట్ మెయింటెనెన్స్ ఎలా అన్నది పెద్ద సందిగ్ధం. ఇప్పుడు వీటన్నిటికీ అదనంగా ప్రతి షోకి మధ్యలో కుర్చీలన్నీ శానిటైజ్ చేయాలి. బాత్ రూమ్ లు కడగాలి. టాయ్ లెట్ మెయింటెనెన్స్ క్యాంటీన్ మెయింటెనెన్స్ అలాగే సైకిల్ స్కూటర్ కార్ స్టాండ్ భజన ఎలానూ ఉండనే ఉంటుంది. అందుకే థియేటర్లు ఓపెన్ చేసేందుకు అనుమతులొచ్చేస్తున్నాయ్! అన్న వార్త వచ్చినా ఎగ్జిబిటర్ ముఖం వెలగడం లేదు.
థియేటర్స్ ఓపెన్ చేస్తున్నారు అని ప్రభుత్వం హింట్ ఇచ్చినా అసలు జనాలు చూసే సినిమాలొస్తాయా? అంటే మీడియం రేంజ్ నుంచి పెద్ద సినిమాలు రిలీజ్ చేసే దమ్మున్న నిర్మాతలు ఏరీ..! కరోనా భయం తో జనాలు థియేటర్లకు రారు అనే పెద్ద భయంతో నిర్మాతల్లో దాదాపు అందరు తమ సినిమాలు విడుదలకి ముందుకు వచ్చే పరిస్థితి లేదు. ఇది పక్కన పెడితే ఫుల్ ఆక్యుపెన్సీ ఇస్తే తప్ప థియేటర్స్ తెరిచినా ఎవరికీ ఉపయోగం ఉండదు..! టాయిలెట్స్ దగ్గర నుంచి ఇతర విషయాల్లో కూడా చాలా చాలా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకవేళ థియేటర్స్ తెరిస్తే సాహసించేందుకు ఎవరైనా రెడీగా ఉన్నారా? అంటే.. ఫిలింనగర్ గుసగుసల ప్రకారం.. రాజ్ తరుణ్ ఒరేయ్ బుజ్జిగా సినిమా వేస్తారేమో అనే టాక్ నడుస్తోంది. మరి యువహీరో అనుమతి తీసుకుని నిర్మాత రిలీజ్ కి రెడీ చేస్తున్నారా? అన్నది చూడాలి.