బైకర్ ప్రీమియర్స్ బాక్సాఫీస్.. ఓవర్సీస్ రెస్పాన్స్ ఎలా ఉంది?

ఈ ఏడాది సంక్రాంతికి మంచి విజయాన్ని అందుకున్న శర్వానంద్, ఈ పక్కా స్పోర్ట్స్ డ్రామాతో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.;

Update: 2026-04-03 05:03 GMT

శర్వానంద్ నటించిన ‘బైకర్’ చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో యువీ క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమా, ఇండియన్ స్క్రీన్ పై ముందెన్నడూ చూడని మోటో క్రాస్, బైక్ రేసింగ్ నేపథ్యంతో రూపొందింది. సాధారణంగా మన దగ్గర క్రికెట్ లేదా ఫుట్ బాల్ సినిమాలే ఎక్కువగా వస్తుంటాయి. కానీ, పూర్తి స్థాయి బైక్ రేసింగ్ నేపథ్యాన్ని ఎంచుకోవడం ద్వారా చిత్ర బృందం ఒక సాహసమే చేసింది.




 


ఈ ఏడాది సంక్రాంతికి మంచి విజయాన్ని అందుకున్న శర్వానంద్, ఈ పక్కా స్పోర్ట్స్ డ్రామాతో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కథలో కొత్తదనం పెద్దగా లేకపోయినా, రేసింగ్ సన్నివేశాలను చిత్రీకరించిన తీరు సాంకేతిక అంశాలు సినిమాకు బలంగా నిలిచాయని అంటున్నారు. స్పోర్ట్స్ డ్రామాలను ఇష్టపడే వారికి ఈ సినిమా ఒక కొత్త అనుభూతిని ఇస్తుందనే కామెంట్స్ వస్తున్నాయి. అసలు విషయానికి వస్తే, ఓవర్సీస్ లో ఈ చిత్రానికి మంచి ఆరంభం లభించినట్లు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

సినిమా విడుదలైన మొదటి రోజునే ఓవర్సీస్ ప్రీమియర్స్ ద్వారా $50K+ గ్రాస్ వసూలు చేసినట్లు అధికారికంగా పోస్టర్ విడుదల చేశారు. శర్వానంద్ కు అమెరికా వంటి దేశాల్లో మంచి మార్కెట్ ఉంది కాబట్టి, రాబోయే రోజుల్లో ఈ నెంబర్ మరింత పెరిగే అవకాశం ఉందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. రొటీన్ సినిమాలకు భిన్నంగా ఉండటంతో అక్కడి ప్రేక్షకులు దీనిపై ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

నటీనటుల విషయానికి వస్తే శర్వానంద్ తన పాత్ర కోసం చాలా కష్టపడ్డారని కామెంట్స్ వస్తున్నాయి. ఒక ప్రొఫెషనల్ బైకర్ లా కనిపించడానికి తీసుకున్న జాగ్రత్తలు, బాడీ లాంగ్వేజ్ ఆకట్టుకున్నాయని అంటున్నారు. అలాగే రాజశేఖర్ తన సెకండ్ ఇన్నింగ్స్ లో తండ్రి కమ్ కోచ్ పాత్రలో సీరియస్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. వీరిద్దరి మధ్య వచ్చే ఎమోషనల్ సీన్లు కథలో కీలకంగా నిలిచాయని, మాళవిక నాయర్ తన పరిధి మేరకు రాణించగా, సహాయ నటులు బ్రహ్మాజీ, తులసి మెప్పించారని అంటున్నారు.

ఇక యువరాజ్ సినిమాటోగ్రఫీ బైక్ రేసింగ్ సన్నివేశాలను అద్భుతంగా చూపించినట్లు చెబుతున్నారు. జిబ్రాన్ అందించిన నేపథ్య సంగీతం రేసింగ్ ట్రాక్ లో వచ్చే వేగానికి తగ్గట్లుగా సాగిందని, యువీ క్రియేషన్స్ ఎప్పటిలాగే నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచాయనే కామెంట్స్ వస్తున్నాయు. కేవలం కమర్షియల్ హంగామా మాత్రమే కాకుండా, కథకు అవసరమైన క్వాలిటీని ఇవ్వడంలో మేకర్స్ ఎక్కడా వెనకాడలేదని తెలుస్తోంది. క్లైమాక్స్ రేస్ ఎపిసోడ్ సినిమా మొత్తానికి హైలైట్ గా నిలిచిందని ప్రేక్షకుల టాక్. ఇక బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా నిలబడాలంటే వీకెండ్ వసూళ్లు చాలా ముఖ్యం. మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News