థియేటర్స్ ఓపెన్ చేస్తారట.. కానీ ఫస్ట్ వాటిని మాత్రమే తెరుస్తారట...!
కరోనా మహమ్మారి కారణంగా సినీ ఇండస్ట్రీ అతలాకుతలం అయింది. ఇప్పటి వరకు ఇండస్ట్రీ ఎన్నో సంక్షోభాలను విపత్తులను ఎదుర్కొన్నప్పటికీ ఇంతటి రేంజ్ లో ఎప్పుడు నష్టం చవి చూడలేదు. గత రెండున్నర నెలలుగా సినిమా షూటింగ్స్ బంద్ అయ్యాయి. థియేటర్స్ మల్టిప్లెక్సెస్ మూతపడ్డాయి. దీంతో ఇప్పటికే విడుదల కావాల్సిన సినిమాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. అయితే ఈ మధ్య ప్రభుత్వాలు నిబంధనలు సడలిస్తూ కొన్ని షరతులతో షూటింగ్స్ కి అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరికొన్ని రోజుల్లో థియేటర్స్ కూడా రీ ఓపెన్ అయ్యే అవకాశాలున్నాయి. కాగా ముంబై లోని ప్రముఖ పీఆర్ ఎజెన్సీ వారు ఇచ్చిన సమాచారం ప్రకారం త్వరలోనే థియేటర్స్ ఓపెన్ అవబోతున్నాయి.. కాకపోతే మొదటగా మల్టీప్లెక్సులు మాత్రమే ఓపెన్ చేయబోతున్నారట.
అంతేకాకుండా మాల్స్ లో ఉన్న మల్టీప్లెక్సులు మాత్రమే ముందుగా తెరుస్తారట. ఆ తరువాత మిగతా మల్టీ ప్లెక్సులు.. ఏ సెంటర్ థియేటర్స్.. చివర్లో బి, సి సెంటర్స్ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ తెరుస్తారని సమాచారం. థియేటర్స్ ఇలా ఒక సిస్టమాటిక్ గా తెరుస్తారు బాగానే ఉంది. కానీ దీని వలన బి, సి సెంటర్స్ అధికంగా ఉండే సౌత్ సినీ ఇండస్ట్రీకి పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. నిజానికి ఇలాంటి పద్ధతి ఫాలో అయితే ఒక్క బాలీవుడ్ కి తప్ప దేశంలో ఉన్న మితగా ఇండస్ట్రీలకు ఏ మాత్రం ఉపయోగపడుదని ట్రేడ్ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. మరో రాబోయో రోజుల్లో థియేటర్స్ రీ ఓపెన్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో చూడాలి.
ఈ నేపథ్యం లో సీటింగ్ మరియు అనేక విషయాలలో కూడా గవర్నమెంట్ కొత్త సూచనలు షరతులు చేసే అవకాశముంది. అందుకే ఇప్పటికే కొన్ని థియేటర్ యాజమాన్యాలు దీనిపై దృష్టి సారించాయి. రానున్న రోజులలో సోషల్ డిస్టెన్స్ ప్రాధాన్యం మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక థియేటర్స్ లో సైతం సోషల్ డిస్టెన్స్ పాటించాల్సిన పరిస్థితి. దీనికి అనుగుణం గా థియేటర్స్ సీట్ల నిర్మాణం కూడా ఉండేలా థియేటర్ యాజమాన్యాలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ప్రేక్షకులు కూర్చుండే సీట్స్ మధ్య కనీసం మూడు అడుగుల గ్యాప్ తో సీట్స్ ఏర్పాటు చేసే ఛాన్స్ ఉంది. ఇప్పటికే మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ మరియు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు తాము పాటించబోతున్న విధి, విధానాలను మరియు తీసుకోబోతున్న జాగ్రత్తలకు సంబంధించిన ప్లాన్ ను సిద్ధం చేసి పంపిన సంగతి తెలిసిందే.