ట్రైల‌ర్ టాక్: అమెరికా కోడ‌లు యాక్సిడెంట్ క‌థేమి?

Update: 2020-12-22 07:50 GMT
ప్రియాంక చోప్రా జోనాస్ న‌టించిన త‌దుప‌రి చిత్రం `ది వైట్ టైగర్`  ట్రైలర్ విడుద‌లైంది. అభిమానుల్లో ఈ ట్రైల‌ర్ వైర‌ల్ గా దూసుకెళుతుండ‌గా.. పీసీ బావ గారు.. తాను సినిమా కోసం ఎదురు చూస్తున్నానని ఆస‌క్తిని వ్య‌క్త‌ప‌రిచారు. ది వైట్ టైగర్ ట్రైలర్ పై పాపా జోనాస్ తన తీర్పును చెప్పారు. ప్రియాంక చోప్రా జోనాస్ తండ్రి ది వైట్ టైగర్ ట్రైలర్ పై అభిప్రాయాన్ని పంచుకుంటూ.. నా కుమార్తె ను చూస్తే గర్వంగా ఉంది అంటూ వ్యాఖ్యానించారు.

ఇంత‌కీ ఈ ట్రైల‌ర్ ఎలా ఉంది? అంటే.. వాస్త‌విక‌త‌ను జోడిస్తూ ఫిక్ష‌న‌ల్ క‌థాంశంతో థ్రిల్ల‌ర్ ని జోడించిన విధానం మెప్పిస్తుంద‌నే సంకేతం అందింది. నెట్‌ఫ్లిక్స్ చిత్రంలో ప్రియాంక చోప్రా జోనాస్ ‌తో పాటు రాజ్ ‌కుమార్ రావు- ఆదర్ష్ గౌరవ్ ప్రధాన పాత్రలో నటించారు. య‌జ‌మానికి (రాజ్ కుమార్ రావ్) త‌న డ్రైవ‌ర్ (ఆద‌ర్శ్‌) కి మ‌ధ్య సంఘ‌ర్ష‌ణ నేప‌థ్యంలో ఆ భార్యామ‌ణి(పీసీ) ఏం చేసింద‌న్న‌ది ట్రైల‌ర్ లో ఆస‌క్తిక‌రంగా క‌నిపిస్తోంది. ఒక యాక్సిడెంట్ చేశాక త‌న డ్రైవ‌ర్ ని ఇరికించేవాడిగా రాజ్ కుమార్ రావు న‌ట‌న .. వారించే స‌తీమ‌ణిగా పీసీ పెర్ఫామెన్స్.. ప్ర‌తీకారంతో ర‌గిలిపోయేవాడిగా ఆద‌ర్శ్ న‌ట‌ప్ర‌ద‌ర్శ‌న‌ ఇంట్రెస్టింగ్.

ట్రైలర్ విషయానికొస్తే.. ప్రియాంక -రాజ్ కుమార్ రావు రిచ్ పెయిర్ గా క‌నిపించ‌గా.. ఆదర్ష్ వారి డ్రైవర్ బలరామ్ హల్వాయి పాత్రలో నటించారు. అతను తన యజమానుల పట్ల విస్మయంతో ఉన్న క్ర‌మంలోనే రోడ్డు ప్రమాదం జ‌రుగుతుంది. తరువాత బల‌రామ్ ని అందులో ఇరికిస్తారు.  డ్రైవర్ ‌పై నిందలు వేస్తారు. తన తెలివి మోసపూరిత విధానంతో అతను పరిస్థితి నుండి విముక్తి పొందడమే కాకుండా విజయవంతమైన కార్ రెంట‌ల్ వ్యవస్థాపకుడిగా ఎదుగుతాడు. ఈ చిత్రంలో మహేష్ మంజ్రేకర్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఇక ఈ ట్రైల‌ర్ వీక్షించాక ప్రియాంక బావ గారు నిక్ సోద‌రుడు గర్వపడుతున్నారని అన్నారు. ఈ సినిమా చూసి చాలా సంతోషిస్తాన‌ని అన్నారు. వీడియోలో డబుల్ ట్యాప్ చేయడం ద్వారా నిక్ తన మద్దతునిచ్చాడు. ప్రియాంక ఇస్ నాట్ ఇట్ రొమాంటిక్ సహనటులు ఆడమ్ డెవిన్ .. రెబెల్ విల్సన్ కూడా ఈ చిత్రం పై తమ‌ ఉత్సాహాన్ని చూపించారు. ``అయ్యో... ఇది చాలా బాగుంది ప్రి!`` అని ఆడమ్ అన్నాడు. ``ఇది అద్భుతంగా ఉంది !!`` అంటూ రెబెల్ వ్యాఖ్యానించారు.Full View
Tags:    

Similar News