స్కామ్ స్ట‌ర్ ని స‌మ‌ర్థించిన స్టార్ హీరో

Update: 2021-03-29 02:30 GMT
లైఫ్ లో ఎక్క‌డా ఆగ‌డం లేదు. ఎన్నో పాత్ర‌ల్లో న‌టిస్తున్నాం. కాలంతో పాటే ముందుకు సాగుతున్నాం.. ఒక‌దానితో ఒక‌టి సంబంధం లేదు! అని అన్నారు స్మాల్ బి అభిషేక్ బ‌చ్చ‌న్. అత‌డు న‌టించిన `ది బిగ్ బుల్` చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. ఈ సంద‌ర్భంగా తాజా ఇంట‌ర్వ్యూలో చాలా ఆస‌క్తిక‌ర విష‌యాల్ని ముచ్చ‌టించారు.

ది బిగ్ బుల్ - బంటీ ఔర్ బ‌బ్లీ- యువ‌-గురు-బ్ల‌ఫ్ మాస్ట‌ర్- ధూమ్ వంటి అనేక విభిన్న సినిమాల్లో న‌టించిన అభిషేక్ కి ది బిగ్ బుల్ లో తాను పోషించిన పాత్ర ఎంతో ప్ర‌త్యేక‌మైన‌ద‌ని అన్నారు. ఇటీవ‌ల న‌టుడిగా బిజీగా ఉన్నానని.. కూచుని తీరిగ్గా ఉండేంత టైమ్ కూడా ఉండ‌డం లేద‌ని అన్నారు.

మనమందరం జీవితంలో చాలా కావాల‌నుకుంటాం.  సాధించాలనుకుంటాం. మన కలలను నెరవేర్చుకోవాల‌ని కోరుకుంటాం. హేమంత్ షా (అతని పాత్ర) అందుకు భిన్నంగా లేడు. అత‌డి ధృఢ నిశ్చ‌యం అనుకున్న‌ది సాధించేందుకు ధైర్యం అత‌డి ప్ర‌త్యేక‌త‌లు. నేను అలాంటివాడినా కానా అనేది ముఖ్యం కాదు. హేమంత్ అలానే ఉండాలని నేను నమ్ముతున్నాను.. అని అన్నారు.

కూకీ గులాటి దర్శకత్వం వహించగా.. అజయ్ దేవ్ గన్ నిర్మించిన ఈ చిత్రం దేశ ఆర్థిక రంగాన్ని ఓ కుదుపు కుదిపేసిన 90ల నాటి స్టాక్ మార్కెట్ స్కామ్ నేప‌థ్యంలోని సినిమా. జరిగిన నిజ‌ సంఘటనల నుండి ప్రేరణ పొందింది. 1992 సెక్యూరిటీల కుంభకోణానికి కార‌కుడై అపఖ్యాతి పాలైన స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా జీవితం నుండి ఈ చిత్రం ప్రేరణ పొందింది. కొన్ని నిజ జీవిత సంఘటనలు వ్యక్తుల నుండి ప్రేరణ పొంది హేమంత్ షా పాత్ర తీర్చిదిద్దినా కొంత‌ కల్పితమని బచ్చన్ చెప్పాడు.

అయితే హన్సాల్ మెహతా దర్శకత్వం వహించిన స్కామ్ 1992: ది హర్షద్ మెహతా (ప్రతిక్ గాంధీ నటించారు) స్టోరీని చూశారట‌. దానిని పూర్తిగా ఆస్వాధించాన‌ని తెలిపారు. తాము కూడా ఆస్వాధిస్తూ సినిమాలో న‌టించామ‌ని వెల్ల‌డించారు. కరోనావైరస్ మహమ్మారి కారణంగా థియేట్రికల్ విహారయాత్రను దాటవేస్తూ ఈ చిత్రం ఏప్రిల్ 8 న డిస్నీ ప్ల‌స్ హాట్ ‌స్టార్ విఐపిలో విడుదల కానుంది. ది బిగ్ బుల్ లో ఇలియానా డి క్రజ్-నికితా దత్తా- సోహం షా- రామ్ కపూర్,- సుప్రియా పాథక్ త‌దిత‌రులు న‌టించా‌రు.
Tags:    

Similar News