'వృషకర్మ' మైండ్ బ్లోయింగ్ బిజినెస్.. నాగచైతన్య కెరీర్‌లోనే బిగ్ డీల్!

నాగచైతన్య ఈసారి నెవ్వర్ బిఫోర్ అనే కంటెంట్ తో రాబోతున్న విషయం తెలిసిందే.;

Update: 2026-03-10 16:30 GMT

నాగచైతన్య ఈసారి నెవ్వర్ బిఫోర్ అనే కంటెంట్ తో రాబోతున్న విషయం తెలిసిందే. లవ్ స్టొరీ, తండేల్ సినిమాలతో బిగ్ హిట్స్ అందుకున్న ఈ అక్కినేని హీరో ఈసారి కంప్లీట్ గా జోనర్ మార్చాడు. కార్తీక్ దండు దర్శకత్వంలో 'వృషకర్మ' సినిమా రోజురోజుకు మంచి హైప్ క్రియేట్ చేసుకుంటోంది. ఇప్పటివరకు వచ్చిన కంటెంట్ అన్ని వర్గాల ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేసింది.

దర్శకుడు కార్తీక్ తన మొదటి సినిమా విరుపాక్షతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు అంతకుమించి నాగచైతన్యతో ఒక డిఫరెంట్ థ్రిల్లర్ ను చూపించబోతున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించి రైట్స్ కోసం ప్రముఖ డిస్ట్రిబ్యూటర్స్ పోటీ పడ్డారు. ఇప్పటికే నాన్ థియేట్రికల్ గా మంచి డీల్స్ సెట్టయినట్లు తెలుస్తోంది.

ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కర్ణాటక థియేట్రికల్ హక్కుల కోసం కూడా భారీ ఆఫర్లు వచ్చాయి. అయితే ఆ మూడు రాష్ట్రాల హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత నాగవంశీ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ. 45 కోట్లకు దక్కించుకున్నట్లు అంచనా. మరో హైలెట్ ఏమిటంటే నాగచైతన్య కెరీర్‌లోనే ఇది అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ అని తెలుస్తోంది.

తండేల్ వంటి భారీ విజయం తర్వాత చైతన్య నటిస్తున్న చిత్రం కావడంతో డిస్ట్రిబ్యూషన్ వర్గాల్లో ఈ స్థాయిలో పోటీ నెలకొంది.

ఇటీవల విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించడమే కాకుండా, పరిశ్రమ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. విరూపాక్ష వంటి బ్లాక్ బస్టర్ తర్వాత కార్తీక్ దండు తెరకెక్కిస్తున్న మిస్టికల్ థ్రిల్లర్ కావడంతో విజువల్స్ టెక్నికల్ వాల్యూస్ చాలా రిచ్‌గా ఉన్నాయి.

అతీంద్రియ శక్తులు, మిస్టరీ అంశాలతో కూడిన ఈ కథలో చైతన్య మునుపెన్నడూ చూడని విధంగా ఒక సాహసోపేతమైన పాత్రలో కనిపిస్తున్నారు. ఈ సినిమా కోసం తన లుక్‌ను కూడా పూర్తిగా మార్చుకోవడం విశేషం. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణపు చివరి దశలో ఉంది. ఎస్వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్టును బాపినీడు సమర్పిస్తున్నారు. నాగచైతన్య గత చిత్రాల కంటే భిన్నమైన జోనర్‌లో వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కేవలం గ్లింప్స్ చూసి ఇంతటి భారీ మొత్తాన్ని వెచ్చించి హక్కులు కొనుగోలు చేశారంటే, ఈ చిత్రంపై ఉన్న నమ్మకం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.

సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా, అజనీష్ లోక్‌నాథ్ అందిస్తున్న నేపథ్య సంగీతం గ్లింప్స్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. గబ్బిలాలు, గుహల్లో అన్వేషణ వంటి సీన్లు ఒక అడ్వెంచరస్ థ్రిల్లర్ ఫీలింగ్‌ను కలిగించాయి. ఇక ఈ స్థాయిలో బిజినెస్ జరగడం వల్ల నాగచైతన్య మార్కెట్ రేంజ్ కూడా పెరిగినట్లయింది. 'వృషకర్మ' విడుదల ముందే రికార్డులు సృష్టిస్తూ హాట్ టాపిక్‌గా మారింది. సృష్టి ధర్మం అతీంద్రియ శక్తుల చుట్టూ తిరిగే ఈ కథ యువతను, థ్రిల్లర్ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటుందని మేకర్స్ ధీమాగా ఉన్నారు. మరి థియేటర్లలో ఈ సినిమా ఎటువంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

Tags:    

Similar News