మెహందీ వేడుకల్లో మెరిసిన విరోష్ జంట.. ఆకట్టుకుంటున్న ఫోటోలు!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో లవ్లీ జంటగా గుర్తింపు సొంతం చేసుకున్నారు విజయ్ దేవరకొండ , రష్మిక మందన్న.;
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో లవ్లీ జంటగా గుర్తింపు సొంతం చేసుకున్నారు విజయ్ దేవరకొండ , రష్మిక మందన్న. ఎట్టకేలకు ఫిబ్రవరి 26 2026న వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. హిందూ , కొడవ సాంప్రదాయ పద్ధతుల్లో ఒక్కటైన ఈ జంట.. తమ పెళ్లి ఫోటోలతో కూడా అందరి దృష్టిని ఆకట్టుకున్నారు..తమ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో విడుదల చేసిన 12 గంటల్లోనే.. రెండున్నర కోటికి పైగా లైక్స్ సాధించి రికార్డు సృష్టించారు. పెళ్లితో పాన్ ఇండియా క్రేజ్ దక్కించుకున్న విరోష్ జంట.. తమ పెళ్లి నగలతో , దుస్తులతో మరింత స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఒక ప్రముఖ జ్యూవెలరీ సంస్థ దాదాపుగా 10 నెలలపాటు కష్టపడి అత్యంత ప్రత్యేకంగా ఆ జ్యూవెలరీని డిజైన్ చేశారు. అటు విజయ్ దేవరకొండ అరకిలోకి పైగా ఆభరణాలు ధరించగా.. రష్మిక మందన్న రెండు కిలోల బరువుతో సమానమైన 11 రకాల ఆభరణాలను ధరించి అందరి దృష్టిని ఆకర్షించింది.
అలా తమ పెళ్లి ఫోటోలతో సందడి చేసిన ఈ జంట.. పెళ్లికి ముందు జరిగిన కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలను రోజుకొకటి చొప్పున రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మొన్నటికి మొన్న సంగీత్ వేడుకకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసి అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈ జంట.. ఇప్పుడు తాజాగా మెహందీ, ప్రధానం వేడుకలకు సంబంధించిన ఫోటోలను ఎక్స్ ద్వారా పంచుకున్నారు. ఇకపోతే రష్మిక మందన్న మెహందీ పెట్టించుకుంటున్న ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేస్తూ.." ఇవి మా ప్రధానం, మెహందీ వేడుకలకు సంబంధించిన ఫోటోలు.. ఫిబ్రవరి 25 2026న జరిగిన ఈ సాయంత్రం చాలా పరిపూర్ణంగా మారింది. కానీ చాలా త్వరగా అయిపోయింది. ఇంత అద్భుతమైన సాయంత్రాన్ని సృష్టించిన ప్రతి ఒక్కరికి మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు" అంటూ రాసుకొచ్చింది రష్మిక మందన్న . ప్రస్తుతం రష్మిక షేర్ చేసిన ఈ మెహందీ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఇకపోతే విజయ్ దేవరకొండ , రష్మిక మందన్న వివాహం జరిగి నెల కూడా పూర్తికాకుండానే.. అప్పుడే తమ సినిమా షూటింగ్లో బిజీ కావడానికి సిద్ధం అయిపోయారు. ప్రముఖ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో రణబాలి సినిమా చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం మార్చి 12వ తేదీ నుండి షూటింగ్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా షూటింగ్లో ఈ జంట అప్పుడే పాల్గొనబోతున్నారని తెలిసి అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు. పెళ్లయి నెల రోజులు కూడా గడవకముందే అప్పుడే సినిమా షూటింగ్లో అడుగుపెట్టడం ఏంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు.. ఈ సినిమాను సెప్టెంబర్ నెలలో విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో గీతాగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలో వచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు. మరి హ్యాట్రిక్ గా రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.