'వార‌ణాసి'తో శ్రీ‌రాముడి క‌నెక్ష‌న్-'రామాయ‌ణం' ఫిక్షన్ ఎపిసోడ్? జ‌క్క‌న్న ఈ జాగ్ర‌త్త తీసుకున్నారా?

ఈ సస్పెన్స్ అడ్వెంచర్‌లో భారతీయ ఇతిహాసాల కనెక్షన్లను రాజమౌళి అత్యంత తెలివిగా జోడించినట్లు తెలుస్తోంది.

Update: 2026-08-08 13:30 GMT

ద‌ర్శ‌క‌దిగ్గ‌జం ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్‌స్టార్ మహేష్ బాబు కలయికలో తెర‌కెక్కుతున్న భారీ గ్లోబల్ ప్రాజెక్ట్ (SSMB29) చుట్టూ ఇండస్ట్రీ వర్గాల్లోనూ... నెట్టింటా ఊహించని స్థాయిలో ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ `రామాయణ్` కథను యథాతథంగా పౌరాణికంగా తెరకెక్కిస్తుంటే.. మన జక్కన్న మాత్రం అదే రామాయణ నేపథ్యాన్ని, పురాణాలను సైన్స్ ఫిక్షన్ గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్‌గా మలిచి మైండ్ బ్లాకింగ్ ప్లాన్ చేశారని వార్తలు వస్తున్నాయి. `వారణాసి` టైటిల్ కాన్సెప్ట్‌తో ప్రచారంలో ఉన్న ఈ కథలో రాజమౌళి తెలివితేటలు -స్క్రీన్‌ప్లే ఐడియాలు వేరే లెవెల్‌లో ఉన్నాయని స‌న్నిహిత వ‌ర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఈ సినిమా కథాంశం ఒక విశ్వవ్యాప్త విపత్తు చుట్టూ తిరుగుతుందని సమాచారం. `శాంభవి` అనే వినాశకరమైన గ్రహశకలం (ఆస్ట్రాయిడ్) వేగంగా వచ్చి భూమిని ఢీకొట్టే ప్రమాదం ఏర్పడగా.. దానివల్ల జరిగే ప్రపంచ వినాశనాన్ని అడ్డుకునే బాధ్యతను `రుద్ర` అనే సాహసికుడు తీసుకుంటాడు. మహేష్ బాబు పోషిస్తున్న ఈ రుద్ర క్యారెక్టర్, ఆపదను నివారించడానికి అవసరమైన పురాతన రహస్యాల కోసం వివిధ ఖండాలు సంచరిస్తూ ఎలాంటి అద్భుతాలు చేశాడనేదే ప్రధాన కథాంశం. ఈ క్రమంలో అతనికి తోడుగా ఉండే `మందాకిణి` (ప్రియాంక చోప్రా) పాత్ర ... వీరిని అంతం చేయడానికి ప్రయత్నించే క్రూరమైన దుష్టశక్తిగా మలయాళ వర్సటైల్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రల మధ్య జరిగే ఘర్షణ సినిమాకు ప్రధాన ఆకర్షణ కానుంది.

ఈ సస్పెన్స్ అడ్వెంచర్‌లో భారతీయ ఇతిహాసాల కనెక్షన్లను రాజమౌళి అత్యంత తెలివిగా జోడించినట్లు తెలుస్తోంది. ద్వారక నగరం సముద్రంలో మునిగిపోవడం.. శ్రీరాముడి రామాయణ ఘట్టాలను ఒక ఫిక్షన్ ఎపిసోడ్‌లా ఈ మిషన్ లోకి తీసుకువచ్చిన తీరు ప్రేక్షకులను అశ్చర్యపరుస్తుందని క‌థ‌నాలొస్తున్నాయి. మహేష్ బాబు పాత్రలో `హనుమంతుడి` శక్తి, చురుకుదనం.. సమయస్ఫూర్తి అంతర్లీనంగా ప్రతిబింబిస్తాయని... పురాణాల్లోని అస్త్రాలు లేదా రహస్యాలను ఆధునిక ఆస్టరాయిడ్ విపత్తుకు ముడిపెట్టడం జక్కన్న విజన్‌కు నిదర్శనమని చెబుతున్నారు.

స్కైబ్లూ సినిమాటిక్స్ స‌హా ప‌లు మీడియా కథనాల ప్రకారం.. ఈ కథ మూలాలు ఆధ్యాత్మిక క్షేత్రమైన వారణాసి (కాశీ)లోనే ప్రారంభమవుతాయి. కాశీ నగరంలోని నిధి అన్వేషణ లేదా ప్రాచీన రహస్యాల అన్వేషణతో మొదలయ్యే ఈ ప్రయాణం...ఆ తర్వాత ఆఫ్రికా దట్టమైన అడవులతో పాటు ప్రపంచంలోని పలు దేశాలకు విస్తరిస్తుంది. ఇండ్రియానా జోన్స్..లారా క్రాఫ్ట్ తరహా అడ్వెంచర్ ఎలిమెంట్స్‌కు మన సనాతన పురాణ నేపథ్యాన్ని జోడించి ఒక ప్రపంచ స్థాయి దృశ్యకావ్యంగా రాజమౌళి ఈ ప్రాజెక్ట్‌ను డిజైన్ చేసి తెర‌కెక్కిస్తున్నారు. శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ పూర్త‌వుతోంది.

హాలీవుడ్ స్థాయి స్టంట్ కొరియోగ్రాఫర్లు.. అగ్రశ్రేణి సాంకేతిక నిపుణుల భాగస్వామ్యంతో అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద‌ సరికొత్త బెంచ్‌మార్క్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. సాంప్రదాయ పౌరాణిక కథనాలకు భిన్నంగా సైన్స్ & మైథాలజీని క్లబ్ చేస్తూ జక్కన్న డిజైన్ చేసిన ఈ `వారణాసి` కాన్సెప్ట్ భారతీయ సినిమా స్థాయిని ప్రపంచ వేదికపై సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే కర్ణ పాత్ర విష‌యంలో `క‌ల్కి 2898 ఏడి` డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ పై విన‌వ‌చ్చిన విమ‌ర్శ‌లు ఎదుర‌వ్వ‌కుండా వార‌ణాసి డైరెక్ట‌ర్ రాజ‌మౌళి ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు? అన్న‌ది కూడా చాలా ముఖ్యమ‌ని విశ్లేషిస్తున్నారు.

Tags:    

Similar News