లార్జర్ దాన్ లైఫ్ కాన్సెప్ట్‌లతో బ‌న్నీ మాస్టర్ ప్లాన్!

వీటితో పాటు మలయాళ టాలెంటెడ్ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ దర్శకత్వంలో విజువల్ వండర్ సూపర్ హీరో కాన్సెప్ట్ చిత్రాన్ని కూడా అర్జున్ లైన్‌లో పెడుతున్నారు.

Update: 2026-08-08 12:30 GMT

`పుష్ప` చిత్రంతో పాన్-ఇండియా సరిహద్దులను చెరిపేసి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తదుపరి సినిమాల విషయంలో సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. రొటీన్ కమర్షియల్ ఫార్ములా జోలికి వెళ్లకుండా ..గ్లోబల్ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునేలా లార్జర్ దాన్ లైఫ్ కాన్సెప్ట్‌లను ఎంచు కుంటున్నారు. ఇమేజ్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లేలా బ‌న్నీ ప్రణాళికలు టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. భారీ లైనప్‌లో భాగంగా బ‌న్నీ మాస్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో `రాకా` చిత్రంలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

వినూత్నమైన సైన్స్ ఫిక్షన్ చిత్ర‌మిది. టైమ్ ట్రావెల్ వంటి సరికొత్త కాన్సెప్ట్‌ను జోడించి తెర‌కె క్కిస్తున్నారు. హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ తో భారీ బడ్జెట్‌తో తెర‌కెక్కుతున్న‌ ప్రాజెక్ట్ స‌రికొత్త రికార్డుల‌ను సృష్టిస్తుంద‌నే అంచ‌నాలు బ‌లంగా ఉన్నాయి. ఈ సినిమా అనంత‌రం కోలీవుడ్ ట్రెండింగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో అడ్వెంచరస్ త్రిల్లర్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. లోకేష్ తనదైన శైలిలో నడిపించే డార్క్ అండ్ రా యాక్షన్ జోనర్‌కు, బన్నీ మాస్ ఇమేజ్ తోడైతే స్క్రీన్ మీద ఎలాంటి విజువల్ వండర్ ఉంటుందో? న‌ని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమా కథాంశం పూర్తిగా కొత్త ప్రపంచంలో సాగే సాహసాలతో కూడుకుని ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

వీటితో పాటు మలయాళ టాలెంటెడ్ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ దర్శకత్వంలో విజువల్ వండర్ సూపర్ హీరో కాన్సెప్ట్ చిత్రాన్ని కూడా అర్జున్ లైన్‌లో పెడుతున్నారు. ఇండియన్ సినిమా పరిశ్రమలో సూపర్‌హీరో జానర్‌కు ఇప్పటివరకు ఉన్న పరిమితులను దాటి అత్యున్నత సాంకేతిక విలువలతో సినిమాను రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. విభిన్నమైన జోనర్లను టచ్ చేస్తూనే కమర్షియల్ హంగులతో కూడిన కథలను ఎంచుకోవడంలో బన్నీ ఎప్పుడూ ముందుంటారనేది ఈ లైనప్‌తో మరోసారి క్లారిటీ దొరుకుతుంది.

ఒకే రకమైన మాస్ కథలతోనే సినిమాలు చేయకుండా ప్రతీ ప్రాజెక్ట్‌కు కొత్తదనాన్ని తీసుకురావాలనే అర్జున్ తపన అతని ప్రణాళికల్లో స్ప‌ష్టంగా కనిపిస్తోంది. పాన్-ఇండియా మార్కెట్ పరిధులను దాటి గ్లోబల్ ఆడియన్స్‌ను టార్గెట్ చేసేలా భారీ చిత్రాలు రూపుదిద్దుకుంటున్నాయి. దర్శకుల ఎంపికలోనూ విభిన్న శైలులు కలిగిన మేకర్స్‌ను నమ్ముతున్నారు. తన ప్రతి సినిమాను ఒక విజువల్ గ్రాండ్‌గా మలచాలనేది బ‌న్నీ మాస్టర్ ప్లాన్‌గా క‌నిపిస్తోంది

మొత్తానికి బ‌న్నీ ఇమేజ్‌ను మరింత ఎత్తుకు తీసుకెళ్లేలా జ‌ర‌గుతోన్న‌ ప్రయోగాత్మక ప్రయత్నాలు ఇండియన్ సినిమా రూపురేఖలను మార్చే అవ‌కాశం లేక‌పోలేదు. రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ వద్ద ఐకాన్ స్టార్ సృష్టించబోయే సునామీ కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Tags:    

Similar News