‘ఉస్తాద్ భగత్ సింగ్’.. ఓ పనైపోయింది
ఇక ఫైనల్ గా మేకర్స్ ఒక్కో అప్డేట్ ఇస్తుండడంతో సోషల్ మీడియాలో ఉస్తాద్ భగత్ సింగ్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది.;
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రం విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. గత ఏడాది OG, హరిహర వీరమల్లు సినిమాలతో వచ్చిన పవర్ స్టార్ ఈసారి పక్కా మాస్ ఎంటర్టైనర్ తో రాబోతున్నాడు. ఈ సినిమా రిలీజ్ సమయం దగ్గరపడుతున్నా ప్రమోషన్ సౌండ్ ఇంకా పెంచకపోవడంతో ఫ్యాన్స్ కొంచెం అప్సెట్ లో ఉన్నారు.
ఇక ఫైనల్ గా మేకర్స్ ఒక్కో అప్డేట్ ఇస్తుండడంతో సోషల్ మీడియాలో ఉస్తాద్ భగత్ సింగ్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఇక అసలైన పని కూడా ఫినిష్ అయ్యింది. సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకుని యు/ఎ (U/A) సర్టిఫికెట్ దక్కించుకుంది. ఎటువంటి కట్స్ లేకుండా ఈ సర్టిఫికెట్ లభించడం విశేషం. ఉగాది కానుకగా మార్చి 19 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుంది. ఫ్యామిలీ ఆడియెన్స్ కు పూర్తిస్థాయిలో కిక్ ఇచ్చేలా ఈ సినిమాను రూపొందించినట్లు చిత్ర బృందం స్పష్టం చేసింది.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండగా, శ్రీలీల రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. వీరితో పాటు సీనియర్ నటుడు పార్థిబన్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు.
ఇక దేవిశ్రీ ప్రసాద్ పాటలు అందించగా, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సమకూరుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ సినిమాపై హైప్‌ను పెంచాయి. నార్త్ అమెరికాలో ఒక రోజు ముందే ప్రీమియర్లు ప్లాన్ చేయగా, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మార్చి 19నే నేరుగా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిస్ట్రిబ్యూటర్ల సూచనల మేరకు తెలుగు రాష్ట్రాల్లో ముందస్తు ప్రీమియర్లు ఉండకపోవచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది.
సినిమా నిడివి కంటెంట్ విషయంలో సెన్సార్ బోర్డ్ సంతృప్తి వ్యక్తం చేయడంతో మేకర్స్ ఇప్పుడు ప్రమోషన్లపై పూర్తి దృష్టి సారించారు. సమ్మర్ సీజన్‌ను క్యాష్ చేసుకునేలా ఉగాది టైమ్ లో సినిమాను తీసుకురావడం చిత్రానికి ప్లస్ పాయింట్‌గా మారనుంది. అయానక బోస్ సినిమాటోగ్రఫీ, ఆనంద్ సాయి ఆర్ట్ డైరెక్షన్ ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలవనున్నాయి. నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ చిత్ర డిజిటల్ హక్కులను భారీ ధరకు దక్కించుకున్నట్లు సమాచారం.
ఇక పవన్ కళ్యాణ్ తనదైన స్టైల్ మాస్ డైలాగ్స్‌తో థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ఉపముఖ్యమంత్రి అయిన తర్వాత పవన్ నుండి వస్తున్న పూర్తిస్థాయి కమర్షియల్ ఎంటర్‌టైనర్ కావడంతో మెగా అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక మార్చి 19న బాక్సాఫీస్ వద్ద భగత్ సింగ్ ఎటువంటి సంచలనాలు సృష్టిస్తాడో వేచి చూడాలి.