అడివి శేష్ 'డెకాయిట్'.. ఇది పక్కా మాస్ స్ట్రాటజీ!
టాలీవుడ్ ఇండస్ట్రీలో డిఫరెంట్ కంటెంట్ తో ఆడియెన్స్ కు థ్రిల్ ఇచ్చే అతికొద్ది మంది యువ హీరోలలో అడివి శేష్ ఒకరు.;
టాలీవుడ్ ఇండస్ట్రీలో డిఫరెంట్ కంటెంట్ తో ఆడియెన్స్ కు థ్రిల్ ఇచ్చే అతికొద్ది మంది యువ హీరోలలో అడివి శేష్ ఒకరు. ఎలాంటి సినిమా చేసినా అందులో తన మార్క్ ట్విస్టులు ఉండేలా ఉండేలా చూసుకుంటాడు. ఇక నెక్స్ట్ కూడా అలాంటి ప్రయోగంతోనే రానున్నాడు. షానియల్ డియో దర్శకత్వంలో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న 'డెకాయిట్' చిత్రంపై అంచనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.
లేటెస్ట్ గా విడుదలైన పోస్టర్ చూస్తుంటే ఈ సినిమాలో కేవలం ప్రేమ మాత్రమే కాదు, అంతకుమించిన మాస్ యాక్షన్ కంటెంట్ ఉండబోతోందని స్పష్టమవుతోంది. ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న తరుణంలో, సినిమాలోని ఇంటెన్సిటీని ఈ పోస్టర్ హైలెట్ చేస్తోంది. ఈ కొత్త పోస్టర్ లో అడివి శేష్ లుక్ గమనిస్తే, అతని పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతోందో అర్థమవుతుంది.
చేతులకు బేడీలు ఉన్నప్పటికీ, ఎంతో ధీమాగా కూర్చుని సిగరెట్ వెలిగిస్తున్న ఆయన స్టైల్ మాస్ ఆడియన్స్‌కు ఫుల్ కిక్ ఇస్తోంది. తెల్లటి దుస్తులపై రక్తపు మరకలు, వెనుక నుంచి గన్ పట్టుకున్న పోలీస్ అధికారి.. ఈ విజువల్స్ అన్నీ సినిమాలో హీరో హీరోయిజం ఏ స్థాయిలో ఉండబోతోందో హింట్ ఇస్తున్నాయి. 'ఒక ప్రేమ కథ' అనే క్లాస్ ట్యాగ్‌లైన్ ఉన్నప్పటికీ, టీజర్ నుండి ఇప్పటివరకు వచ్చిన ప్రతి పోస్టర్ లోనూ శేష్ మాస్ కంటెంట్, హీరోయిజంనే ఎక్కువగా హైలెట్ చేస్తున్నారు.
సినిమా కథాంశం విషయానికి వస్తే, ప్రేమ, నమ్మకద్రోహం ప్రతీకారం అనే మూడు ప్రధాన అంశాల చుట్టూ ఈ యాక్షన్ డ్రామా తిరగనుంది. అడివి శేష్ గత చిత్రాల కంటే ఇది భిన్నమైన, రగ్గడ్ లుక్‌లో ఉండటంతో అభిమానులు శేష్ మేకోవర్‌కు ఫిదా అవుతున్నారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తుండటం, అనురాగ్ కశ్యప్ వంటి వెర్సటైల్ నటుడు విలన్‌గా ఉండటం సినిమాకు మరింత బలాన్ని ఇస్తోంది.
హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఈ చిత్రానికి మెయిన్ హైలెట్ గా నిలవనున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం పాన్ ఇండియా రేంజ్ లో తెలుగు, హిందీ భాషల్లో విడుదల కాబోతోంది. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఒకవైపు క్లాస్ మెలోడీలు వినిపిస్తూనే, మరోవైపు పోస్టర్ల ద్వారా ఊరమాస్ ఎలిమెంట్స్‌ను ప్రమోట్ చేస్తూ మేకర్స్ సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేస్తున్నారు. శేష్ కు యూత్ లో క్లాస్ ఆడియెన్స్ నుంచి సపోర్ట్ గట్టిగానే ఉంది. ఇక మాస్ యూత్ ని కూడా గట్టిగానే ఎట్రాక్ట్ చేస్తున్న స్ట్రాటజీ కనిపిస్తోంది. మరి ఏప్రిల్ 10న థియేటర్లలో ఈ 'డెకాయిట్' సృష్టించే విధ్వంసం ఎలా ఉంటుందో చూడాలి.