ఉస్తాద్ 'కాలరే ఎత్తరా'.. మాస్ ప్రోమో ఎలా ఉందంటే?
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్ ప్రమోషన్స్ ఫుల్ జోష్ లో జరుగుతున్నాయి.;
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్ ప్రమోషన్స్ ఫుల్ జోష్ లో జరుగుతున్నాయి. విడుదల తేదీ దగ్గర పడుతున్న వేళ.. వరుస అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. తాజాగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న థర్డ్ సింగిల్ 'కాలరే ఎత్తరా' కు సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.
పవన్ ఎనర్జీ, దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన పవర్ ఫుల్ బీట్, మాస్ స్టెప్స్ తో ఆ ప్రోమో అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. పూర్తి లిరికల్ సాంగ్ ను మార్చి 12 సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. డాషింగ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
పవన్ కల్యాణ్ అభిమానులను దృష్టిలో పెట్టుకుని దర్శకుడు ప్రత్యేకంగా మాస్ ఎలిమెంట్స్ ను యాడ్ చేసినట్లు తాజాగా విడుదలైన సాంగ్ ప్రోమో చూస్తే స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా థియేటర్లలో అభిమానులు కోరుకునే ఎలివేషన్ సీన్స్, స్టైలిష్ డ్యాన్స్ మూమెంట్స్ ఉండనున్నాయని క్లియర్ గా అర్థమవుతుంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన ఎనర్జిటిక్ ట్యూన్ కు గాయకుడు రామ్ మిర్యాల తన వాయిస్ తో మరింత జోష్ తెచ్చారు.
ప్రముఖ లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా..
మాస్ ప్రేక్షకులను అలరించేలా పాట ఉండనున్నట్లు ప్రోమో ద్వారా తెలుస్తోంది. సౌండ్ పెంచండి.. డ్యాన్స్ మొదలుపెట్టండి.. ఎత్తర ఎత్తర కాలరే ఎత్తర అనే ట్యాగ్ లైన్ తో మేకర్స్ ప్రోమోను విడుదల చేశారు. అయితే ప్రోమో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారగా.. పాట కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక సినిమా విషయానికొస్తే.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఆ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆర్. పార్తిబన్, అశుతోష్ రాణా, గౌతమి, నాగ మహేష్, టెంపర్ వంశీ, అవినాష్ వంటి పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇక సినిమాను మొదటగా 2026 మార్చి 27న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. అయితే తాజాగా విడుదల తేదీలో మార్పు చేసి మార్చి 19న థియేటర్లలోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఉగాది పండుగ కానుకగా సినిమాను అందించేందుకు మేకర్స్ ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్లు, పాటలు మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇప్పుడు థర్డ్ సింగిల్ ప్రోమోతో సినిమా మీద హైప్ మరింత పెరిగింది. మరి మూవీ ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.