#నెట్ ఫ్లిక్స్.. శివగామి కత్తి ఫైట్ శిక్షణ చూశారా?
ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ సూపర్ హిట్ మూవీ ఫ్రాంచైజీ బాహుబలికి ప్రీక్వెల్ సిరీస్ ను ప్రకటించిన విషయం తెలిసినదే. ఈ సిరీస్ `ది రైజ్ ఆఫ్ శివగామి` పుస్తకం ఆధారంగా రూపొందించనున్నారు. బాహుబలి: ప్రారంభానికి ముందు శివగామి ఇలాకాలో ఏం జరిగింది? అన్నది ఈ సిరీస్ థీమ్. ఇంతకుముందు కొంత చిత్రీకరణ సాగినా రషెస్ తో నెట్ ఫ్లిక్స్ యాజమాన్యం సంతృప్తి చెందలేదు.
అనంతరం ఆ ప్రాజెక్ట్ ని రద్దు చేసి ఇప్పుడు మొత్తం సిరీస్ ని వేరే తారాగణం సిబ్బందితో రీషూట్ చేస్తోంది. వామిక గబ్బి కొత్త వెర్షన్ లో ప్రధాన పాత్ర పోషిస్తోంది. రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. తాజా సమాచారం మేరకు.. ఈ సిరీస్ లో శివగామికి సంబంధించిన చాలా యాక్షన్ సీక్వెన్స్ లు ఆద్యంతం గగుర్పాటుకు గురి చేస్తాయని తెలిసింది. వామిక దాని కోసం రకరకాల పోరాట నైపుణ్యాలపై శిక్షణ పొందుతోంది. ఈ ప్రాజెక్ట్ కోసం ఆమె కత్తి యుద్ధాన్ని కూడా నేర్చుకుంటోంది.
అలాగే ఈ సిరీస్ లో సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార కీలక పాత్ర పోషిస్తుందని సమాచారం. మరిన్ని వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. నెట్ ఫ్లిక్స్ రూపొందిస్తున్న అత్యంత ఖరీదైన భారతీయ ప్రాజెక్టులలో ఇది ఒకటి. ఇక ఇటీవలే మొఘలుల చరిత్ర నేపథ్యంలో భారీ వెబ్ సిరీస్ కి సంబంధించిన ట్రైలర్ రిలీజై ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. శివగామి కథాంశంలోనూ అంతటి ఎమోషన్స్ పోరాటాలను ఊహిస్తున్నారు.
కోట్లు గంగలో పోసిన నెట్ ఫ్లిక్స్
ఒకసారి మొత్తం సినిమాని చిత్రీకరించి తిరిగి దానిని స్క్రాప్ లో వేసి మొత్తం మళ్లీ రీషూట్ చేయడం అంటే ఆషామాషీనా? దానికోసం కోట్లాది రూపాయల బడ్జెట్ ని ఖర్చు చేసాక అదంతా నేలపాలు చేయడమే. ఎంతో విలువైన సమయం వృధా అవుతుంది. ఇలాంటి పరిస్థితి ఇంతకుముందు చియాన్ విక్రమ్ వారసుడి సినిమాకి వచ్చింది. ధృవ్ విక్రమ్ తొలి చిత్ర కథానాయకుడిగా నటించిన అర్జున్ రెడ్డి రీమేక్ కి వెటరన్ దర్శకుడు బాలా దర్శకత్వం వహించగా ఆ సినిమాని స్క్రాప్ లో వేసి వేరొక యువ దర్శకుడితో మొత్తం ఫ్రెష్ గా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇంచుమించు అదే తీరుగా 80శాతం చిత్రీకరణ పూర్తయి మధ్యలో వదిలేసిన ప్రతిష్ఠాత్మక వెబ్ సిరీస్ ని తిరిగి రీషూట్ చేసేందుకు నెట్ ఫ్లిక్స్ వర్గాలు రెడీ అవుతుండడం సంచలనంగా మారింది.
2018 లో `బాహుబలి: బిఫోర్ ది బిగినింగ్ ` అనే తొమ్మిది భాగాల వెబ్ సిరీస్ ను నిర్మిస్తున్నట్లు కార్పొరెట్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. బాహుబలి సక్సెస్ నేపథ్యంలో రాజమౌళి మానియాను విశ్వసించి ఈ సిరీస్ ని ప్రారంభించగా దేవాకట్టా- ప్రవీణ్ సత్తారు సహా పలువురు అసిస్టెంట్ దర్శకులు రచయితల బృందం ఈ సిరీస్ కోసం అహోరాత్రులు పని చేశారు. ప్రతిదీ నమ్మి నెట్ ఫ్లిక్స్ భారీ బడ్జెట్ ను కేటాయించింది. కానీ ఇంతలోనే ఏమైందో 80 శాతం చిత్రీకరణ పూర్తయిన తర్వాత OTT దిగ్గజం ఈ ప్రాజెక్టును ఆకస్మికంగా నిలిపివేయడం సంచలనమే అయ్యింది. నెట్ ఫ్లిక్స్ బృందం అవుట్ పుట్ తో పూర్తిగా నిరాశకు గురైందని ఇది ప్రపంచ ప్రేక్షకులను నిరాశపరచడమే కాకుండా రాజమౌళి మేకింగ్ స్థాయిలో లేదని నిరాశను వ్యక్తపరిచారని ప్రచారమైంది.
అంతేకాదు.. ఈ సిరీస్ వల్ల రాజమౌళి తెరకెక్కించిన మాస్టర్ క్లాస్ చిత్రాలు బాహుబలి 1- 2 లకు బ్యాడ్ నేమ్ వస్తుందని నెట్ ఫ్లిక్స్ భావించినట్టు టాక్ కూడా స్ప్రెడ్ అయ్యింది. అయితే అప్పటికి ఆ ప్రాజెక్ట్ ను నిలిపివేసినా మళ్లీ ఇప్పుడు కొత్త దర్శకులతో కొత్త టీమ్ తో తిరిగి నిర్మించేందుకు నెట్ ఫ్లిక్స్ సిద్ధం కావడం మరో సెన్సేషన్ అనే చెప్పాలి. సిరీస్ ఆద్యంతం మొదటి నుండి పునర్నిర్మించే ఆలోచనలో ఇప్పుడు ఉన్నారు. ఇప్పటికే రచయితల బృందం స్క్రిప్టుపై పని చేశారు. ఇటీవల స్క్రిప్టింగ్ ను పూర్తి చేశారు. జన్నత్ ఫేమ్ కునాల్ దేశ్ ముఖ్ .. ది గర్ల్ ఆన్ ది ట్రైన్ ఫేం రిభు గుప్తా దర్శకత్వ పగ్గాలు చేపట్టడానికి సంతకం చేశారు. ఆ ఇద్దరి నేతృత్వంలో చిత్రీకరణ ప్రారంభమవుతుంది.
ఈసారి నెట్ ఫ్లిక్స్ మరింత జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. ఎపిసోడ్ల నిర్మాణంలో నాణ్యతను పర్యవేక్షించే టీమ్ ని కేటాయించారట. వై కట్టప్ప కిల్డ్ బాహుబలి? అన్న ప్రశ్నతో జక్కన్న టీమ్ క్యూరియాసిటీని పెంచడంలో ఎంతగా సఫలమయ్యారో అంతే రేంజులో కథను గ్రిప్పింగ్ గా సిద్ధం చేశారని ఇకపై సిరీస్ నిర్మాణం ఎలాంటి సందేహాలకు తావు లేకుండా పూర్తవుతుందని చెబుతున్నారు. ఆసక్తికరంగా ఈ సిరీస్ లో నయనతార-శివగామి ప్రధాన పాత్రల్లో నటించడానికి సంతకం చేశారు. ఇతర వివరాల్ని నెట్ ఫ్లిక్స్ వర్గాలు వెల్లడించాల్సి ఉంది.