'ది బేకర్ & ది బ్యూటీ' ట్రైలర్: ప్రేమలో పడిన ఇద్దరు భిన్న మనస్కుల మధ్య భావోద్వేగాలు
'ఆహా' ఓటీటీ తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సూపర్ హిట్ సినిమాలతో పాటుగా ఒరిజినల్ సిరీస్ లను అందుబాటులోకి తీసుకొస్తోంది. వినాయక చవితి సంధర్భంగా ''ది బేకర్ అండ్ ది బ్యూటీ'' అనే ఆసక్తికరమైన వెబ్ సిరీస్ ని విడుదల చేయడానికి సన్నద్ధం అవుతోంది. 'ఏక్ మినీ కథ' ఫేమ్ సంతోష్ శోభన్ - టీనా శిల్పరాజ్ లీడ్ రోల్స్ లో ఈ రొమాంటిక్ డ్రామా రూపొందింది. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ - టీజర్ ఈ సిరీస్ పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ట్రైలర్ విషయానికొస్తే.. బేకరీ నిర్వహించే మిడిల్ క్లాస్ యువకుడు విజయ్ (సంతోష్ శోభన్).. మహి (విష్ణు ప్రియ) అనే అమ్మాయిని కాదని ఫిల్మ్ స్టార్ ఐరా వాసిరెడ్డి (టీనా) ప్రేమలో పడ్డాడు. ఇద్దరు భిన్న మనస్కులైన బేకర్ అండ్ ఫిలిం స్టార్ మధ్య జరిగే ప్రేమ - గొడవలు - భావోద్వేగాలతో ఈ సిరీస్ రూపొందించారని తెలుస్తోంది. 'జిందగీలో ఒకటి యాద్ పెట్టుకో తమ్ముడు.. పోరి ఎంత కర్రాక్ ఉంటే అన్ని కష్టాలొస్తాయి' అనే డైలాగ్ సినిమా నేపథ్యాన్ని తెలియజేస్తోంది.
'ది బేకర్ & ది బ్యూటీ' సిరీస్ లో వెంకట్ - సాయి శ్వేత - సంగీత్ శోభన్ - శ్రీకాంత్ అయ్యంగార్ - ఝాన్సీ లక్ష్మి ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ నిర్మాణ విలువలు బాగున్నాయి. విజువల్స్ - బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదనపు ఆకర్షణగా నిలిచాయి.సాయి శ్వేత - సంగీత్ శోభన్ - శ్రీకాంత్ అయ్యంగార్ - ఝాన్సీ లక్ష్మి ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ నిర్మాణ విలువలు బాగున్నాయి. విజువల్స్ - బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదనపు ఆకర్షణగా నిలిచాయి.
జొనాథన్ ఎడ్వర్డ్స్ 'ది బేకర్ & ది బ్యూటీ' వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందింది. నిర్మాత సుప్రియా యార్లగడ్డ దీనికి స్క్రిప్ట్ సూపర్ వైజర్ గా.. మహేశ్వర్ రెడ్డి షో రన్నర్ గా వ్యవహరించారు. ప్రశాంత్ ఆర్. విహారి సంగీతం సమకూర్చారు. సురేశ్ రగుతు సినిమాటోగ్రఫీ అందించగా.. నాగేశ్వర్ రెడ్డి ఎడిటింగ్ వర్క్ చేశారు. పది ఎపిసోడ్స్ గా అందుబాటులోకి రానున్న ఈ సిరీస్ ఎలాంటి ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి.
Full View