సినిమా వచ్చి వారం దాటినా సినీ ప్రముఖుల ట్వీట్స్ ఆగడం లేదే..!
ప్రముఖ నిర్మాత ఎం.ఎస్.రాజు దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ 'డర్టీ హరి' డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం మంచి రివ్యూస్ రాబట్టింది. శ్రవణ్ రెడ్డి - రుహానీ శర్మ - సిమ్రత్ కౌర్ ప్రధాన పాత్రల్లో గూడూరు శివ రామకృష్ణ సమర్పణలో సతీష్ బాబు - సాయి పునీత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ముందుగా 'ఫ్రైడే మూవీస్' అనే కొత్త ఏటీటీ వేదికగా విడుదలైన ఈ చిత్రాన్ని క్రిష్మస్ కానుకగా 'ఆహా' యాప్ లో కూడా స్ట్రీమింగ్ కి పెట్టారు. సీనియర్ ప్రొడ్యూసర్ డైరెక్ట్ చేసిన 'డర్టీ హరి' సినిమాకి మొదటి నుంచి కూడా ఇండస్ట్రీ ప్రముఖుల సపోర్ట్ ఉంది. సినిమా విడుదలై వారం దాటినా ఇంకా ఈ సినిమా గురించి పాజిటివ్ ట్వీట్స్ పెడుతున్నారు.
తాజాగా సీనియర్ నటుడు నరేష్ ఈ సినిమా గురించి ట్వీట్ చేస్తూ..ఎమ్మెస్ రాజు దర్శకత్వ వెంచర్ డర్టీ హరి తరువాతి తరానికి చేరుకుందని.. నా ఫ్రెండ్స్ మరియు ఫాలోవర్స్ అందరూ ఈ సినిమాని చూడాలని కోరుకుంటున్నానని పేర్కొన్నాడు. అలానే ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ట్వీట్ చేస్తూ 'మా హనీ మీ ఎమ్ ఎస్ రాజు డర్టీ హరి చూసాను. మా నిర్మాత ఇంతమంచి రచయితా దర్శకుడు అయినందుకు చాలా ఆనందంగా ఉంది. పోస్టర్ చూసి ఏదో అనుకుంటారు. క్లైమాక్స్ యూత్ కి కనువిప్పు' అని చెప్పారు. ఇంతకముందు రచయిత సాయి మాధవ్ బుర్రా - సునీల్ వంటి వారు 'డర్టీ హరి' ని పొడుగుతూ ట్వీట్స్ చేశారు.