పిక్ టాక్ : తెలుగందాలు ఒకచోట చేరి వర్కౌట్స్ చేస్తే...!
తెలుగు సినిమాల్లో తెలుగు అమ్మాయిలు నటించడం లేదు అనే మాట ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. క్యారక్టర్ ఆర్టిస్టులుగా నటిస్తున్నప్పటికీ హీరోయిన్స్ గా నటించడానికి ముందుకొచ్చేవారు చాలా తక్కువ మందే ఉన్నారు. అయితే తెలుగు హీరోయిన్స్ కి ఆఫర్స్ కూడా అంతంత మాత్రంగానే వస్తుంటాయనే కామెంట్స్ కూడా వినిపిస్తుంటాయి. ఒకప్పుడు తెలుగు అమ్మయిలు స్టార్ హీరోయిన్స్ గా ఎదిగి పక్క ఇండస్ట్రీలలో కూడా ప్రూవ్ చేసుకున్నవారు చాలా మందే ఉన్నారు. అయితే రాను రాను తెలుగు హీరోయిన్స్ తగ్గుతూ వస్తున్నారనే చెప్పవచ్చు. దీంతో తెలుగు సినిమా అయినప్పటికీ పక్క ఇండస్ట్రీల నుండి హీరోయిన్స్ ని దిగుమతి చేసుకుంటున్నారు. వాస్తవానికి ముంబై హీరోయిన్స్ కి డ్రస్ కోడ్ విషయంలో పెద్దగా పట్టింపులు ఉండవు.. ఎక్స్ పోజింగ్ కి కూడా పరిమితులు ఉండదు. అదే మన తెలుగు అమ్మాయిలైతే అభ్యంతరాలు చెప్తుంటారనే టాక్ ఉంది. అందులోనూ తెలుగు హీరోయిన్స్ డబుల్ మీనింగ్ డైలాగ్స్ చెప్పడానికి కూడా ఇబ్బంది పడతారు. ఈ కారణంగా తెలుగు అమ్మాయిలకు అవకాశాలు తగ్గుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. తెలుగు అమ్మాయిలు ఎవరికీ తక్కువ కాదని నిరూపిస్తున్నారు. తెలుగు సినిమాల్లో నటిస్తూ సత్తా చాటుతున్నారు. యాక్టింగ్ పరంగానే కాకుండా గ్లామర్ పరంగా కూడా ఎవరికీ తీసిపోమని ప్రూవ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఫిట్నెస్ మీద ఫోకస్ పెట్టి వర్కౌట్స్ చేస్తూ స్లిమ్ గా తయారవుతున్నారు.
ఈ నేపథ్యంలో తెలుగమ్మాయిలు ఇషా రెబ్బా - శివాని - శివాత్మిక లు జిమ్ లో వర్కౌట్స్ చేసే ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. వీరిలో ముందుగా ఈషా 'అంతకు ముందు ఆ తర్వాత' సినిమాతో హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ క్రమంలో 'బందిపోటు' 'అమీ తుమీ' 'మాయా మాల్' 'దర్శకుడు' 'సుబ్రహ్మణ్యపురం' 'బ్రాండ్ బాబు' వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. నాని నిర్మాణంలో తెరకెక్కిన 'అ!'.. ఎన్టీఆర్ 'అరవింద సమేత వీరరాఘవ' సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల 'రాగల 24 గంటల్లో' అనే క్రైమ్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఇక రాజశేఖర్ - జీవిత దంపతుల కుమార్తెలు శివాని, శివాత్మిక సైతం హీరోయిన్లుగా పరిచయం అయ్యారు. శివాత్మిక 'దొరసాని' అనే సినిమాలో హీరోయిన్ గా నటించి ప్రశంసలు దక్కించుకుంది. ఈ క్రమంలో శివాని రాజశేఖర్ తేజతో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది. మొత్తం మీద ఒకప్పుడు జయసుధ జయప్రద విజయశాంతి శ్రీదేవి వంటి హీరోయిన్స్ రాణించినట్లే నేటితరం తెలుగు అమ్మాయిలు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు.