తెలుగ‌మ్మాయ్ నెవ్వ‌ర్ బిఫోర్ హాటెస్ట్ అవ‌తార్

Update: 2020-12-29 09:20 GMT
ఐస్ క్రీమ్ చిత్రంతో క‌థానాయిక‌గా ఆఫర్ ద‌క్కిన‌ప్పుడు తెలుగ‌మ్మాయి తేజ‌స్వి మాదివాడ‌ ఎంతో ఉబ్బి త‌బ్బిబ్బ‌య్యింది. మ‌హేష్‌- వెంక‌టేష్ మ‌ల్టీస్టార‌ర్  సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టులో న‌టించినా అది క్యారెక్ట‌ర్ మాత్ర‌మే. కానీ ఆర్జీవీ ఏకంగా త‌న‌నే మెయిన్ లీడ్ గా మార్చి ఐస్ క్రీమ్ తెర‌కెక్కించ‌డం అందులో బోల్డ్ బ్యూటీగా ఆవిష్క‌రించ‌డంతో ఒక్క‌సారిగా సీన్ అంతా మారిపోయింది.

ప్ర‌స్తుతం ఈ భామ‌కు ఓవైపు క‌థానాయిక‌గా అవ‌కాశాలొస్తున్నాయి. క్యారెక్ట‌ర్ల‌లో ఆఫ‌ర్ల‌కు కొదవే లేదు. బిగ్ బాస్ -తెలుగు సీజ‌న్ లో క‌నిపించాక పెరిగిన పాపులారిటీని తేజ‌స్విని ఎంతో తెలివిగా స‌ద్వినియోగం చేసుకుంటోంది. టాలీవుడ్ లో బిజీ ఎర్న‌ర్ గా తేజ‌స్విని పేరు మార్మోగుతోంది.

ప్ర‌స్తుతం ఈ బ్యూటీ `క‌మిట్ మెంట్` అనే చిత్రంలో న‌టిస్తోంది. సినీప‌రిశ్ర‌మ‌లో క‌మిట్ మెంట్లు వేధింపుల నేప‌థ్యంలో చిత్ర‌మిది. ఇదివ‌ర‌కూ రిలీజ్ చేసిన తేజ‌స్వి హాట్ పోస్ట‌ర్ కి అభిమానుల నుంచి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. ఇందులో క‌మిట్ మెంట్ కి మొహ‌మాట‌ప‌డ‌ని అమ్మాయిగా తేజస్వి వేడెక్కిస్తుంద‌న్న ప్ర‌చారం సాగింది. ఈపాటికే రిలీజ్ కావాల్సిన సినిమా ఆల‌స్య‌మైంది.

ఇక సోష‌ల్ మీడియాల్లోనూ వైల్డ్ గా దూకుడు పెంచిన‌ బోల్డ్ తెలుగ‌మ్మాయ్ గా తేజ‌స్వి ఫోటోషూట్లు వైర‌ల్ గా మారుతున్నాయి. తాజాగా బ్లాక్ అండ్ డార్క్ షేడెడ్ ఫోటోషూట్ తో గుబులు పెంచేసింది ఈ బ్యూటీ. ఎద అందాల్ని థై సొగ‌సుల్ని ఇంచి ఇంచీ ఎలివేట్ చేస్తున్న ఈ ఫోటో కుర్రకారులో వైర‌ల్ గా దూసుకెళుతోంది.
Tags:    

Similar News