లవ్ ఫేడవుట్ అవుతుంది..బంధంలో స్నేహమే శాశ్వతం: ట్రిప్తి దిమ్రీ
యానిమల్ చిత్రంతో దేశవ్యాప్తంగా ఫేమస్ అయింది ట్రిప్తి దిమ్రీ. ఓవర్ నైట్ లో క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న ట్రిప్తి దిమ్రి తన మనసులోని మాటను చాలా సూటిగా చెప్పడంలోను స్పీడ్ గానే ఉంది.
యానిమల్ చిత్రంతో దేశవ్యాప్తంగా ఫేమస్ అయింది ట్రిప్తి దిమ్రీ. ఓవర్ నైట్ లో క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న ట్రిప్తి దిమ్రి తన మనసులోని మాటను చాలా సూటిగా చెప్పడంలోను స్పీడ్ గానే ఉంది. తాజాగా ప్రేమ, బంధాలపై తన స్పష్ఠమైన అభిప్రాయాలను షేర్ చేసింది. ఒక నిలకడైన.. విజయవంతమైన వైవాహిక బంధం లేదా ప్రేమ బంధంలో భాగస్వాముల మధ్య `స్నేహం` అనేది అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుందని ట్రిప్తి బలంగా నమ్మతోంది. తాజా ఇంటర్వ్యూలో ట్రిప్తి మాట్లాడుతూ... కాలక్రమేణా ఇద్దరి మధ్య ప్రేమ - ఆకర్షణ తగ్గినప్పటికీ, ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే బలమైన స్నేహబంధం మాత్రమే వారిని జీవితాంతం కలిసి ఉంచుతుందని అభిప్రాయపడ్డారు.
ట్రిప్తి దిమ్రి అభిప్రాయం ప్రకారం... ఏ బంధంలోనైనా ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవడానికి, గౌరవించుకోవడానికి స్నేహమే పునాదిగా మారుతుంది. ఒకానొక దశ తర్వాత కేవలం ప్రేమ మాత్రమే బంధాన్ని ముందుకు నడపలేదు... ఎందుకంటే కాలంతో పాటు ఆ ఫీలింగ్స్ మారవచ్చు లేదా తగ్గిపోవచ్చు.. కానీ ఒకరికొకరు మంచి స్నేహితులుగా మారినప్పుడు ఆ బంధం ఎప్పటికీ చెరిగిపోదు అని పేర్కొన్నారు. భాగస్వామితో ఎలాంటి భయం, మొహమాటం లేకుండా మనసు విప్పి మాట్లాడుకునే స్వేచ్ఛ స్నేహం వల్లే లభిస్తుందని ట్రిప్తి స్పష్టం చేశారు.
కెరీర్ పరంగా బ్యాక్-టు-బ్యాక్ హిట్లతో బిజీగా ఉన్న ఈ నటి తన వ్యక్తిగత ఆలోచనలను ఎంతో పరిణతితో వ్యక్తపరచడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆధునిక కాలంలో బంధాలు త్వరగా విచ్ఛిన్నం కావడానికి భాగస్వాముల మధ్య సరైన కమ్యూనికేషన్ .. స్నేహపూర్వక వాతావరణం లేకపోవడమే కారణమని చాలా మంది భావిస్తున్న తరుణంలో ట్రిప్తి చేసిన వ్యాఖ్యలు నేటి యువత ఆలోచనలకు అద్దం పడుతున్నాయి. కేవలం పైపైన కనిపించే ఆకర్షణల కంటే అంతర్గత బంధానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ట్రిప్తి సూచిస్తున్నారు.
నటిగా విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ పద్ధతిగా కెరీర్‌ను మలచుకుంటున్న ట్రిప్తి.... నిజ జీవితంలోనూ అంతే స్పష్టమైన భావాలు కలిగి ఉండటం విశేషం. భాగస్వామిని ఎంచుకునేటప్పుడు కేవలం తన బాహ్య రూపం లేదా హోదా కంటే.. వారితో మన మనసుకు ఎంతవరకు స్నేహపూర్వక అనుబంధం కుదురుతుంది అనేదే ముఖ్యం అని నమ్ముతున్నారు. ఈ విధమైన ఆలోచనా విధానమే ట్రిప్తీని వ్యక్తిగతంగా కూడా ఎంతో ప్రత్యేకంగా నిలుపుతోంది.
వెండితెరపై గ్లామరస్ పాత్రలతో అలరిస్తున్న ఈ భామ... నిజ జీవిత బంధాల విషయంలో మాత్రం ఎంతో సాంప్రదాయబద్ధంగా, పరిణతి చెందిన ఆలోచనలను షేర్ చేసారు. ప్రేమ అనే భావన కంటే స్నేహం అనే అనుబంధమే ఎక్కువ కాలం మనుగడ సాగిస్తుందని తృప్తి దిమ్రి చెప్పిన మాటలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ప్రభాస్ సరసన ఈ బ్యూటీ స్పిరిట్ అనే భారీ పాన్ ఇండియా చిత్రంలో నటిస్తోంది. దీపిక పదుకొనే ఎగ్జిట్ అవ్వగానే ఈ సినిమా కోసం ట్రిప్తీని సందీప్ వంగా ఎంపిక చేసుకున్నారు.