జాన్వీ ప్లాన్ ఎక్కడ మిస్సవుతోంది?

బాలీవుడ్‌ లో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న జాన్వీ కపూర్ టాలీవుడ్‌ లో మాత్రం ఇంకా స్ట్రాంగ్ ప్లేస్ సొంతం చేసుకోలేకపోతోంది.

Update: 2026-06-05 18:30 GMT

బాలీవుడ్‌ లో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న జాన్వీ కపూర్ టాలీవుడ్‌ లో మాత్రం ఇంకా స్ట్రాంగ్ ప్లేస్ సొంతం చేసుకోలేకపోతోంది. వరుసగా రెండు భారీ పాన్ ఇండియా సినిమాల్లో అవకాశం దక్కినా, ఆ ఛాన్సులు తన కెరీర్‌ కు ఉపయోగపడే విధంగా మార్చుకోవడంలో ఆమె వెనుకబడుతున్నట్లు కనిపిస్తోంది. దీంతో అసలు జాన్వీ ప్లాన్ ఎక్కడ మిస్సవుతోందనే చర్చ సోషల్ మీడియాలో సాగుతోంది.

జాన్వీ కపూర్ కెరీర్‌ ను చూసుకుంటే.. హిందీలో ఆమె చేసిన సినిమాల్లో చాలావరకు యాక్టింగ్ కు ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలే కనిపిస్తాయి. గుంజన్ సక్సేనా, మిలి, గుడ్ లక్ జెర్రీ, ఉలజ్ వంటి చిత్రాల్లో ఆమె పాత్రల చుట్టూనే కథ తిరిగింది. రిజల్ట్ ఎలా ఉన్నా నటిగా తన టాలెంట్ ను చూపించే అవకాశాలు మాత్రం ఆమెకు దక్కాయి. అందుకే బాలీవుడ్‌ లో జాన్వీని అంతా మంచి పెర్ఫార్మింగ్ హీరోయిన్‌ గా ట్రీట్ చేస్తున్నారు.

అయితే తెలుగు సినిమాల విషయంలో ఆమె తీసుకుంటున్న నిర్ణయాలే ఇప్పుడు క్వశ్చన్ మార్క్ గా మారుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర వంటి భారీ చిత్రంలో నటించినా, అందులో తన రోల్ స్కోప్ ఎంత అనే విషయాన్ని ముందుగానే అంచనా వేయలేకపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సినిమా విజయం సాధించినప్పటికీ ఆమె పాత్ర గురించి పెద్దగా చర్చ జరగలేదు. స్టార్ హీరో సినిమా కావడం ఒక ఎత్తయితే, అందులో గుర్తుండిపోయే పాత్ర దక్కడం మరో ఎత్తు.

ఇక తాజాగా విడుదలైన పెద్ది విషయంలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. రామ్ చరణ్ వంటి స్టార్ హీరోతో నటించే అవకాశం దక్కడం కెరీర్‌ కు ప్లస్ అయినప్పటికీ, పాత్రకు ఉన్న ప్రాధాన్యం విషయంలో మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సినిమా విడుదల తర్వాత సోషల్ మీడియాలో వస్తున్న రెస్పాన్స్ చూస్తే ప్రేక్షకులు ఎక్కువగా కథ, రామ్ చరణ్ నటన, భావోద్వేగాల గురించి మాట్లాడుతున్నారు. కానీ జాన్వీ పాత్ర మాత్రం ప్రత్యేక చర్చకు కారణం కాలేకపోయింది. జాన్వీ గురించి మాట్లాడుతున్నా.. అది పాజిటివ్ గా కాదు.

ఇక్కడే జాన్వీ తన కెరీర్ ప్లాన్ ను క్లియర్ గా మరోసారి అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉందని అనేక మంది సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. భారీ హీరోల సినిమాల్లో అవకాశం రావడం మాత్రమే కాకుండా, ఆ పాత్ర స్కోప్ ఎంత? ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? అనే అంశాలను ఆమె పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ప్రస్తుతం జాన్వీ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏమిటంటే, బడా సినిమాలు ఉన్నా పాత్రలు గుర్తింపు సంపాదించకపోవడం.

దీంతో సినిమా హిట్ అయినా ఆ విజయానికి ఆమెకు పెద్దగా క్రెడిట్ దక్కడం లేదు. మరోవైపు సినిమా విమర్శలు ఎదుర్కొంటే ఆ ప్రభావం మాత్రం ఆమెపై పడుతోంది. స్టార్ హీరోల సినిమాల్లో కనిపించడం ద్వారా మార్కెట్ పెరుగుతుంది. కానీ నటిగా గుర్తింపు రావాలంటే స్ట్రాంగ్ రోల్స్ అవసరం. ఇప్పటివరకు తెలుగులో జాన్వీ సెలక్షన్స్ ఆ దిశగా ప్రయోజనం చేకూర్చలేదనే అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది. ఫ్యూచర్ లో స్టోరీ, పాత్రకు ప్రాధాన్యం ఇచ్చే నిర్ణయాలు తీసుకుంటేనే టాలీవుడ్‌ లో ఆమె జర్నీ మరో రేంజ్ కు చేరుకునే అవకాశం ఉందని చెప్పాలి.

Tags:    

Similar News