రగులుతున్న కసిలో లెనిన్ లవ్.. దీంతో జోరు పెరిగేనా?

అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'లెనిన్' నుంచి 'సోల్ ఆఫ్ లెనిన్' అనే కొత్త సాంగ్ విడుదలైంది.

Update: 2026-06-05 19:07 GMT

అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'లెనిన్' నుంచి 'సోల్ ఆఫ్ లెనిన్' అనే కొత్త సాంగ్ విడుదలైంది. జూన్ 26న సినిమా రిలీజ్ కాబోతున్నా ఇప్పటివరకు పెద్దగా ప్రమోషన్ల హడావుడి లేకపోవడంతో ఈ పాటతోనైనా బజ్ క్రియేట్ అవుతుందా అని అక్కినేని ఫ్యాన్స్ చూస్తున్నారు. నార్మల్ గా సినిమా విడుదలకు నెల రోజుల ముందే ప్రమోషన్ల వేగం పెంచుతారు. కానీ ఈ మూవీ టీమ్ మాత్రం చాలా లేట్ గా తమ పబ్లిసిటీని ఈ పాటతో మొదలుపెట్టింది.

లేటెస్ట్ గా వచ్చిన ఈ సాంగ్ ఒక రొటీన్ లవ్ సాంగ్ లా కాకుండా, కథలోని ఇంటెన్సిటీని హైలెట్ చేస్తోంది. నిజమైన ప్రేమలో ఉండే పెయిన్, స్ట్రగుల్స్ ను విజువల్ గా బాగానే ప్రెజెంట్ చేశారు. అఖిల్ తో పాటు హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకునేలా ఉంది. రగులుతున్న కసిలో ఇద్దరి ప్రేమ ఏదో ఛాలెంజ్ ను ఫేస్ చేయనున్నట్లు తెలుస్తోంది. తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, వాగ్దేవి వాయిస్ ఈ ఎమోషనల్ మెలోడీకి బాగా సెట్ అయ్యాయి. కళ్యాణ్ చక్రవర్తి రాసిన లిరిక్స్ కూడా డెప్త్ తో ఉన్నాయి.

కెరీర్ స్టార్ట్ చేసి పదేళ్లు కావస్తున్నా అఖిల్ కు ఇప్పటివరకు సరైన కమర్షియల్ బ్రేక్ రాలేదు. ఏజెంట్ డిజాస్టర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమా కావడంతో లెనిన్ పై అతని కెరీర్ డిపెండ్ అయి ఉంది. మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ను అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్నాయి. నాగార్జున, నాగవంశీ లాంటి పెద్ద నిర్మాతలు వెనకుండటం ఈ ప్రాజెక్ట్ కు ఉన్న మెయిన్ అడ్వాంటేజ్.

మొదట్లో ఈ సినిమాను మే 1న రిలీజ్ చేయాలనుకున్నా, రామ్ చరణ్ పెద్ది సినిమాతో పోటీ వద్దని జూన్ 26కు మార్చారు. అయితే షూటింగ్ ఇంకా కొద్దిగా పెండింగ్ లో ఉండటం వల్లే ప్రమోషన్స్ ఆలస్యమయ్యాయనే ఒక టాక్ కూడా ఉంది. ప్రమోషన్ల పరంగా ఇప్పటివరకు సైలెంట్ గా ఉన్న మేకర్స్, ఇకపై నాన్ స్టాప్ గా కంటెంట్ ను వదిలితేనే బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఓపెనింగ్స్ రాబట్టడం సాధ్యమవుతుంది.

ఎందుకంటే మరికొన్ని పెద్ద సినిమాలు కూడా లైన్ లో ఉన్నాయి. ఈ కాంపిటీషన్ ను తట్టుకోవాలంటే కేవలం ఒక సాంగ్ తో సరిపెట్టకుండా టీజర్లు, ట్రైలర్లు, ప్రెస్ మీట్స్ తో జనాల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. అఖిల్ మాస్ లుక్ తో పాటు ఈ ఎమోషనల్ కంటెంట్ ఆడియన్స్ కు ఎంతవరకు రీచ్ అవుతుందో చూడాలి. మరి ఈ కొత్త సాంగ్ ఇచ్చిన బూస్ట్ తో లెనిన్ టీమ్ ప్రమోషన్ల సౌండ్ ఎంతవరకు పెంచుతుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.


Full View


Tags:    

Similar News