తమన్నాఉంటేనే హీరోగా చేస్తా

Update: 2021-05-14 08:30 GMT
కొన్ని పాత సంగతులు తెలుసుకుంటూంటే ఆశ్చర్యంగా ఉంటాయి. తెర వెనక ఇంత జరిగిందా అనిపిస్తుంది. అలాంటిదే ఒక పాత సంగతి ఒకటి బయిటకు వచ్చి,మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అప్పట్లో జీవా హీరోగా వచ్చిన చిత్రం 'రంగం'. కె.వి.ఆనంద్‌ దర్శకత్వం వహించిన 'కో' అనే తమిళచిత్రాన్ని తెలుగులో 'రంగం' పేరుతో విడుదల చేశారు. పొలిటికల్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా 2011లో విడుదలై సూపర్ హిట్టైంది. అయితే ఈ సినిమాలో మొదట శింబుని హీరోగా తీసుకున్నారు. ఇంకొన్ని రోజుల్లో షూట్‌ ప్రారంభం కానుందనగా శింబు తప్పుకున్నాడు. అయితే కారణాలు రకరకాలు వినపడ్డాయి. . దర్శకుడితో ఓ విషయంలో విభేదాలు రావడంతోనే శింబు ప్రాజెక్ట్‌ నుంచి వైదొలగారని చెప్పుకున్నారు.కానీ ఇన్నాళ్లకు అసలైన కారణం బయిటకు వచ్చింది.

'రంగం' నుంచి శింబు తప్పుకోవడానికి కారణం.. హీరోయిన్‌ కార్తిక తనకు సరైన జోడీ కాదని భావించారట శింబు. ఆమెను వద్దని ఆ స్థానంలో తమన్నాను హీరోయిన్ గా పెట్టమని చిత్ర టీమ్ ని కోరారట. తమన్నాకు భారీగా రెమ్యునేషన్ చెల్లించాలని.. అంత బడ్జెట్‌ తమవద్ద లేదని నిర్మాతలు చెప్పడంతో చేసేదిలేక శింబునే ఆ ప్రాజెక్ట్‌ వద్దనుకున్నట్లు ఇప్పుడు బయిటకు వచ్చింది.  

 ఇక 'రంగం' విడుదలై ఆనంద్‌ తమిళంలో స్టార్‌ డైరెక్టర్‌గా మారారు. రీసెంట్ గా శింబుతో ఏదైనా ప్రాజెక్ట్‌ చేయాలని ఆయన ఆశించారు. శింబు సైతం ఆయనతో సినిమా పట్టాలెక్కించాలని భావించారు. ఈక్రమంలోనే ఆనంద్‌ ఇటీవల శింబుకి ఓ కథ కూడా చెప్పారట. కథ నచ్చడంతో వెంటనే ప్రాజెక్ట్‌ని శింబు ఓకే చేసేశారు. మరికొన్ని రోజుల్లో అధికారికంగా ప్రకటిద్దామనుకున్న సమయంలో అనారోగ్యంతో ఆనంద్‌ కన్నుమూసారు.
Tags:    

Similar News