స్లమ్ డాగ్ ఏమైంది?..ఎందుకీ సైలెంట్?
వరుస ఫ్లాపుల తరువాత వెర్సటైల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కోలీవుడ్ క్రేజీ యాక్టర్ విజయ్ సేతుపతితో ఓ భారీ మూవీకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.;
వరుస ఫ్లాపుల తరువాత వెర్సటైల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కోలీవుడ్ క్రేజీ యాక్టర్ విజయ్ సేతుపతితో ఓ భారీ మూవీకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలోని కీలక క్యారెక్టర్‌లో టబు నటిస్తోంది. స్లమ్ డాగ్ టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ మూవీ షూటింగ్ మొదలైన దగ్గరి నుంచే ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. పూరి, విజయ్ సేతుపతిల రేర్ కాంబినేషన్‌లో సినిమా కావడంతో సర్వత్రా ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి ఏర్పడింది. దానికి తగ్గట్టే ఇందులో నటించే నటీనటుల గురించి ఒక్కో అప్ డేట్‌ని చక చకా అందించారు.
కన్నడ నటుడు దునియా విజయ్ విలన్‌గా నటించాడు. అప్ డేట్‌లు ఇస్తూనే పూరి, అండ్ కో ఈ మూవీ షూటింగ్‌ని రాకెట్ స్పీడుతో పూర్తి చేశారు. ఇక ఫస్ట్ లుక్, టైటిల్ అప్ డేట్‌లే తరువాయి. కానీ ఏదీ లేదు. సినిమా షూటింగ్ పూర్తయి నెల రోజులు పూర్తి కావస్తున్నా దీనికి సంబంధించిన ఎలాంటి అప్ డేట్‌లు లేవు. పూరి టీమ్ నుంచి ఎలాంటి సందడి లేదు. షూటింగ్‌కు ముందు వరుస అప్ డేట్‌లు, షూటింగ్ విషయాలతో సందడి చేసిన పూరి, విజయ్ సేతుపతి, చార్మీ ఉన్నట్టుండి సైలెంట్ అయిపోయారు.
షూటింగ్ పూర్తయిన సందర్భంగా విజయ్ సేతుపతి ఓ వీడియోని రిలీజ్ చేసి షూటింగ్ పూర్తయిందని ప్రకటించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నో సౌండ్. జనవరి 1 నూతన సంవత్సరం సందర్భంగా పవన్ కల్యాణ్, ప్రభాస్‌తో పాటు ఎన్నో పెద్దా, చిన్న సినిమాలకు సంబంధించిన అప్ డేట్‌లు వచ్చాయి. కానీ పూరి-సేతుపతి ప్రాజెక్ట్ ఫస్ట్ లుక్‌కు సంబంధించిన అప్‌డేట్ లేదు. షూట్‌కి ముందు..షూట్ టైమ్‌లో అంత హడావిడి చేసిన పూరి టీమ్ ఎందుకు సైలెంట్ అయినట్టు? అని అంతా ఆశ్చర్యపోతున్నారు.
టైటిల్‌ని 2025లోనే రివీల్ చేయాలని ప్లాన్ చేసిన పూరి కొన్ని అనివార్య కారణాల వల్ల విరమించుకున్నాడు. న్యూ ఇయర్‌కి కూడా రివీల్ చేయకపోవడానికి కారణం ఏంటా అని ఆరాతీస్తే బలమైన కారణమే ఉందని తెలిసింది. వరుస ఫ్లాపుల వల్ల పూరి పరిస్థితి ఇంతకు ముందులా లేదు. బిజినెస్ పరంగా కూడా భారీ ఒత్తిడే ఎదుర్కొంటున్నాడు. దీంతో ఈ మూవీ ఓటీటీ రైట్స్‌కు సంబంధించిన వ్యవహారం పూర్తి చేసిన తరువాతే ఫస్ట్ లుక్ టైటిల్‌ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. అంతే కాకుండా ఆ తరువాత నుంచే బిజినెస్ డీల్స్ కూడా క్లోజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా ఇన్ సైడ్ టాక్.
అయితే మిగతా సినిమాలు జనవరి నుంచి డిసెంబర్ వరకు డేట్ లు ఫిక్స్ చేసుకుని థియేటర్లు రిజర్వ్ చేసుకుంటుంటే పూరి ఇంకా మీనమేషాలు లెక్కిస్తే లాభం లేదని, మేకింగ్‌లో ఉన్న స్పీడుని బిజినెస్‌లోనూ చూపించకపోతే రేసులో వెనకబడాల్సి వస్తుందనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ విషయంలో పూరికున్న బిగ్గెస్ట్ ఎస్సెట్ విజయ్ సేతుపతి. `మహారాజా` మూవీ దాదాపు రూ.200 కోట్లు రాబట్టడంతో `స్లమ్ డాగ్`కు భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతుందని పూరి ఫుల్ కాన్ఫడెన్స్‌తో ఉన్నాడట. అదే జరిగి బాక్సాఫీస్ వద్ద సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే పూరి కెరీర్ మళ్లీ ఊపందుకోవడం ఖాయం అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.