ఓటీటీలను కంట్రోల్ చేయగల్గేది వాళ్లిద్దరే!
ప్రస్తుతం దర్శక, నిర్మాతలంతా ఓటీటీ అనే ఊబిలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. సినిమాను శాషించే స్థాయికి ఓటీటీలు ఎదిగాయి.;
ప్రస్తుతం దర్శక, నిర్మాతలంతా ఓటీటీ అనే ఊబిలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. సినిమాను శాషించే స్థాయికి ఓటీటీలు ఎదిగాయి. నిర్మాత తీసిన సినిమాకు అదే నిర్మాతకు అధికారం లేకుండా పెత్తనం చెలాయిస్తున్నాయి. సినిమా ఎప్పుడు థియేట్రికల్ గా రిలీజ్ చేయాలి? అన్నది ఓటీటీ డిసైడ్ చేస్తుంది. ముందుగా ఓటీటీ రిలీజ్ స్లాట్ ఇచ్చిన తర్వాత థియేట్రికల్ గా రిలీజ్ డేట్ ఫిక్స్ అవుతుంది. అందులోనూ శవాలక్ష కండీషన్లు ఉంటున్నాయి. తాము చెప్పినట్లు సినిమా రిలీజ్ చేస్తే ఓటీటీ డీల్ ఒకలా? లేకపోతే మరోలా అంటూ దర్శక, నిర్మాతలు కండీషన్లు విధించి డీల్ క్లోజ్ చేస్తున్నారు.
తప్పని పరిస్థితుల్లో వారు కట్టుబడి ముందుకెళ్తున్నారు.పెద్ద సినిమా అయినా? చిన్న సినిమా అయినా ఇదే పరిస్థితి. ప్రత్యేకించి చిన్న సినిమాల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. మరి ఓటీటీలను కంట్రోల్ చేయడం నిర్మాతలతో సాధ్యం కాదా? అంటే కాదనే చెప్పాలి. ఆ విషయంలో టాలీవుడ్ నుంచి ఇద్దరు స్టార్ డైరెక్టర్లు మాత్రమే ఓటీటీ దూకుడుకు బ్రేక్ వేయగలరు. వారే దర్శక శిఖరం రాజమౌళి, విలక్షణ దర్శకుడు సుకుమార్. వీళ్లిద్దరి సినిమాలకు పాన్ ఇండియాలో భారీ డిమాండ్ ఉంది. `బాహుబలి`, `ఆర్ ఆర్ ఆర్` లాంటి చిత్రాలు రాజమౌళికి, `పుష్ప` సినిమా సుకుమార్ కి ఆ స్థానాన్ని కట్టబెట్టాయి? అన్నది కాదనలేని నిజం.
ఈ రెండు సినిమాలు ఇండియా వైడ్ బాక్సాఫీస్ వద్ద వందల కోట్లు వసూళ్లు సాధించాయి. ప్రస్తుతం చేస్తోన్న సినిమాలు కూడా భారీ అంచనాల మద్య రిలీజ్ అవుతున్నవే. దీంతో ఓటీటీలు ఈ ఇద్దరి డైరెక్టర్ల విషయంలో గప్ చుప్ గా వ్యవహరిస్తున్నాయి. రాజమౌళి తెరకెక్కిస్తోన్న `వారణాసి` వచ్చే ఏడాది ఏప్రిల్ 7న రిలీజ్ అవుతుంది. కానీ ఈ సినిమా ఓటీటీ డీల్ ఇంకా కుదుర్చుకోలేదు. ఓటీటీలు వెంట పడుతున్నా రాజమౌళి మాత్రం లైట్ తీసుకుం టున్నాడు. నిర్మాత వైపు నుంచి ఓటీటీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా? నాదేం లేదు అంతా రాజమౌళి నే చూసుకుంటున్నారని నిర్మాత చేతులెత్తేసారు. బిజినెస్ డీల్ లేదా రిలీజ్ కి సంబంధించి ఎలాంటి వ్యవహారమైనా రాజమౌళితోనే మాట్లాడుకోండని వదిలేసారు.
`పుష్ప 2` తో సుకుమార్ 1800 కోట్ల థియేట్రికల్ వసూళ్ల సినిమా ఇవ్వడంతో? ఓటీటీలు ఈయన విషయంలో అంతే ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. టైమ్ చూసుకుని మాట్లాడుతున్నారు తప్ప కంగారు పడటం లేదు. వీరితో పాటు సందీప్ రెడ్డి వంగా, ప్రశాంత్ నీల్ లాంటి డైరెక్టర్ల సినిమా విషయంలోనూ ఓటీటీలు అదును కోసం ఎదురు చూస్తున్నాయి తప్ప డిమాండ్ చేసే పరిస్థితుల్లో లేరు.