యష్ టాక్సిక్..అదే నిజమైతే కష్టమే?
గోవా నేపథ్యంలో 1980లో సాగే డ్రగ్ మాఫియా కథగా దీన్ని గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తోంది.;
కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ `టాక్సిక్:ది ఫైరీ టేల్ ఆఫ్ గ్రోన్ అప్స్` పేరుతో పీరియడ్ గ్యాంగ్ స్టర్ డ్రామాని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. యష్, గీతూ మోహన్ దాస్ స్క్రిప్ట్ అందించారు. కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ అధినేత వెంకట్ కె. నాయారణతో కలిసి ఈ మూవీని భారీ స్థాయిలో హీరో యష్ నిర్మిస్తున్నాడు. లేడీ సూపర్ స్టార్ నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, హ్యూమ ఖురేషీ, రుక్మిణీ వాసంత్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు.
గోవా నేపథ్యంలో 1980లో సాగే డ్రగ్ మాఫియా కథగా దీన్ని గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తోంది. దీనికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. కన్నడతో పాటు ఇంగ్లీష్‌లోనూ రూపొందుతున్న ఈ మూవీని పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయబోతున్నారు. నదియాగా కియారా అద్వానీ, ఎలిజబెత్‌గా హ్యుమా ఖురేషీల ఫస్ట్ లుక్ పోస్టర్‌లని విడుదల చేసిన మేకర్స్ తాజాగా నయనతార లుక్‌ని విడుదల చేశారు. ఇందులో నయన్ గంగ అనే కీలక పాత్రలో కనిపించబోతోంది.
మోడ్రన్ డ్రెస్‌లో గన్ పట్టుకుని పవర్‌ఫుల్ లుక్‌లో నయనతార కనిపించి సినిమాసై అంచనాల్ని పెంచేసింది. ఇందులో మొత్తం ఐదుగురు క్రేజీ హీరోయిన్‌లు నటిస్తున్నారు. ఇప్పటి వరకు నదియాగా కియారా అద్వానీ, ఎలిజబెత్‌గా హ్యుమా ఖురేషీ, గంగగా నయనతార ఫస్ట్ లుక్‌లని పరిచయం చేశారు. ఈ ఏడాది మార్చి 19న భారీ స్థాయిలో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారి చర్చనీయాంశం అవుతోంది.
ఇందులో నయనతార మోడ్రన్ డ్రెస్‌లో కనిపిస్తూ ఓ వ్యక్తికి షేక్ హ్యాండ్ ఇస్తుండగా.. తనని అనుసరిస్తూ బ్లాక్ హ్యాట్, వైట్ సూట్ ధరించి యష్ కనిపించాడు. ఆ పక్కనే హ్యుమఖురేషీ రెడ్ డ్రెస్‌లో కనిసిస్తోంది. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్‌లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొంత మంది నయన, యష్ స్టైలిష్‌గా ఉన్నారని కామెంట్ చేయగా మరి కొంత మంది మాత్రం బాంబే వెల్వెట్‌ని గుర్తు చేస్తోందన్నారు. మరో నెటిజన్ `బాంబే వెల్వెట్ మళ్లీనా? అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు.
దీంతో టాక్సిక్‌పై అనుమానాలు మొదలయ్యాయి. నయనతార స్టైలిష్ లుక్‌ని రిలీజ్ చేసినప్పుడు పెరిగిన అంచనాలు ఇది మరో బాంబే వెల్వెట్ అనే కామెంట్‌లు రావడంతో నీరుగారి పోతున్నాయి. ఇదే నిజమైతే టాక్సిక్ యష్‌కు భారీ పరాజయాన్ని అందించడం ఖాయం అని, తెలిసి తెలిసి ఇలాంటి పొరపాటుని యష్ చేయడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. గ్యాన్ ప్రకాష్ రాసిన బుక్ ఆధారంగా అనురాగ్ కశ్యప్ రూపొందిచిన మూవీ బాంబే వెల్వెట్. రణ్‌బీర్ కపూర్, అనుష్క శర్మ, కరణ్ జోహార్, కెకె మీనన్ ప్రధాన పాత్రల్లో నటించారు. భారీ అంచనాల మధ్య విడుదలై ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచి షాక్ ఇచ్చింది.