హోలీ కలెక్షన్స్.. టీ20 వరల్డ్ కప్ దెబ్బేసిందా?

హోలీ సందర్భంగా కుటుంబాలతో బయటకు వెళ్లే వారి సంఖ్య పెరగడంతో ఉదయం, మధ్యాహ్నం షోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.;

Update: 2026-03-05 08:31 GMT

హోలీ పండుగ థియేటర్లకు కొంత ఊరట ఇచ్చినా.. క్రికెట్ మ్యాచ్‌ లు మాత్రం కొత్త సినిమాల కలెక్షన్లకు దెబ్బకొట్టడం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు సెలవు రోజు కావడంతో ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని భావించిన నిర్మాతలు, ఎగ్జిబిటర్లు ఆశలు పెట్టుకోగా.. మరోవైపు కీలక క్రికెట్ మ్యాచ్‌ ల ప్రభావం స్పష్టంగా కనిపించింది.

హోలీ సందర్భంగా కుటుంబాలతో బయటకు వెళ్లే వారి సంఖ్య పెరగడంతో ఉదయం, మధ్యాహ్నం షోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా చిన్న, మీడియం రేంజ్ చిత్రాలకు ఇది కొంత వరకూ ప్లస్ అయ్యింది. ఎగ్జాంపుల్ తీసుకుంటే.. శ్రీ విష్ణు నటించిన విష్ణు విన్యాసం సినిమాకు సాయంత్రం వరకూ దాదాపు 8 వేల టికెట్లు బుక్ అయినట్టు తెలుస్తోంది.

పండుగ రోజు కావడంతో మల్టీప్లెక్సులు, సింగిల్ స్క్రీన్లలో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఊపందుకున్నాయి. అయితే ఆ జోష్ ఎక్కువ సేపు నిలవలేదు. సాయంత్రం నుంచి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కారణం.. టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్. దక్షిణాఫ్రికా- న్యూజిలాండ్ మధ్య జరిగిన హై టెన్షన్ మ్యాచ్ ను చూసేందుకు చాలామంది ప్రేక్షకులు ఇళ్లకే పరిమితమయ్యారు.

దంతో ఈవెనింగ్, నైట్ షోల ఆక్యుపెన్సీ గణనీయంగా పడిపోయినట్లు సమాచారం. థియేటర్ల కంటే టీవీల ముందు, మొబైల్ స్క్రీన్ల ముందు కూర్చోవడానికే ప్రేక్షకులు ఆసక్తి చూపారు. ముఖ్యంగా యూత్, క్రికెట్ అభిమానులు పెద్ద సంఖ్యలో మ్యాచ్‌ కు ఇంపార్టెన్స్ ఇవ్వడంతో, సినిమా హాళ్లు ఖాళీగా కనిపించాయి. కొన్ని చోట్ల షోలు హాఫ్ ఫిల్‌ తోనే నడవగా, మరికొన్ని థియేటర్లలో పెద్దగా రద్దీ కనిపించలేదు.

మ్యాచ్ ల వల్ల కలెక్షన్లు దాదాపు 30 నుంచి 40 శాతం వరకూ పడిపోయినట్లు అంచనా. ఇక్కడితో సమస్య క్లోజ్ అవ్వలేదు. గురువారం కూడా పరిస్థితి అంత పాజిటివ్ గా కనిపించడం లేదు. ఎందుకంటే మరో కీలక సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. భారత్ – ఇంగ్లాండ్ మధ్య జరిగే మ్యాచ్ ప్రేక్షకుల దృష్టిని మరింతగా ఆకర్షించే అవకాశం ఉంది.

ఆ మ్యాచ్ కూడా ప్రైమ్ టైమ్‌ లో ఉండటంతో, థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య మరింత తగ్గే అవకాశముందని ఎగ్జిబిటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా పండుగల సమయంలో కొత్త సినిమాలకు మంచి ఓపెనింగ్స్ వస్తాయి. కానీ ఈసారి క్రికెట్ సీజన్, ముఖ్యంగా నాకౌట్ మ్యాచ్‌ లు ఉండటంతో సినిమా బిజినెస్ పై ప్రభావం పడుతోంది.

పెద్ద స్టార్ సినిమాలు కాకుండా చిన్న, మీడియం రేంజ్ చిత్రాలే ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాయి. వీటికి ప్రతి షో కలెక్షన్ కీలకం కావడంతో, ఒక్కరోజు డ్రాప్ కూడా పెద్ద నష్టంగా మారుతోంది. మొత్తానికి హోలీ పండుగ థియేటర్లకు ఊరటనిచ్చినా.. సెమీఫైనల్ మ్యాచ్‌ ల జోరు కొత్త విడుదలల జోష్‌ తగ్గించింది. ఇక వీకెండ్‌ లో పరిస్థితి ఎలా ఉంటుందో వేచి చూడాలి.

Tags:    

Similar News