కొత్త కథతో బాలయ్య మూవీ.. గోపీచంద్ కు ఆ ఛాన్స్ కూడా వస్తుందా?
నందమూరి బాలకృష్ణ ఈ మధ్య మంచి జోష్ లో ఉన్నారు. వరుస హిట్లతో దూసుకెళ్తున్న బాలయ్య ఫామ్ కు అఖండ2 అడ్డుకట్ట వేసింది.;
నందమూరి బాలకృష్ణ ఈ మధ్య మంచి జోష్ లో ఉన్నారు. వరుస హిట్లతో దూసుకెళ్తున్న బాలయ్య ఫామ్ కు అఖండ2 అడ్డుకట్ట వేసింది. అఖండ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన అఖండ2 మూవీ భారీ అంచనాలతో రిలీజై ఆశించిన ఫలితాల్ని అందుకోలేకపోయింది. దీంతో బాలయ్య సక్సెస్ ఫామ్ కు ఓ రకంగా చెప్పాలంటే అడ్డు కట్ట పడినట్టే.
హిస్టారికల్ కథతో..
ఇదిలా ఉంటే అఖండ2 తర్వాత బాలయ్య, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ దీనికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ కూడా వచ్చింది. బాలయ్యతో సినిమా చేయడం కోసం గోపీచంద్ ఓ అద్భుతమైన కథను రెడీ చేసుకున్నారని, అది కూడా హిస్టారికల్ స్టోరీ అని, ఆల్రెడీ సినిమా కోసం అంతా రెడీ అయిందని, లొకేషన్ల కోసం విదేశాలు వెళ్లి మరీ రెక్కీ కూడా చేసొచ్చారని తెలిసిందే.
కానీ ఉన్నట్టుండి దర్శకనిర్మాతలు, హీరో మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. అందరూ కలిసి ఆ హిస్టారికల్ కథను పక్కనపెట్టి మరో కొత్త కథతో సినిమాను చేయాలని డిసైడ్ అయ్యారని టాక్ వినిపిస్తోంది. అయితే ఉన్నట్టుండి కథను మార్చడానికి కారణాలు లేకపోలేదు. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ ఉన్న మూవీ చేయాలంటే చాలా టైమ్ పడుతుందని, పైగా బడ్జెట్ కూడా ఎక్కువవుతుందని ఈ డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది.
పైగా టాలీవుడ్ లో ఇప్పుడు సిట్యుయేషన్ కూడా పెద్దగా బాలేదు. డిజిటల్ రైట్స్, హిందీ రైట్స్ అన్నీ డల్ గా ఉన్నాయి. ఇలాంటి టైమ్ లో భారీ బడ్జెట్ సినిమా చేస్తే అనవసరంగా రిస్క్ తీసుకున్నట్టవుతుందని భావించి ఆ కథను పక్కన పెట్టి మరో ఫ్రెష్ స్టోరీతో ముందుకెళ్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే గోపీచంద్ మరో కొత్త లైన్ ను బాలయ్యకు వినిపించగా, బాలయ్య కూడా ఈ కథతోనే ముందుకెళ్లాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని తెలుస్తోంది. అయితే ఇప్పుడీ సినిమా చేశాక వీరసింహారెడ్డి లాగానే ఇది కూడా హిట్ అయితే ముందు అనుకున్న హిస్టారికల్ కథ కూడా బాలయ్య చేసే అవకాశముంది. అదే జరిగితే గోపీచంద్ కు కూడా తన ఫేవరెట్ హీరోతో ముచ్చటగా మూడు సినిమాలు తీసినట్టు అవుతుంది.