బాలీవుడ్ లో బిజీగా ఉన్న సాయి పల్లవి.. మరో క్రేజీ ప్రాజెక్టులో ఛాన్స్!

సౌత్ ఇండియా నేచురల్ బ్యూటీ సాయి పల్లవి సిని పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ఇప్పుడు బాలీవుడ్‌ను ఏలేందుకు సిద్ధమవుతోంది.;

Update: 2026-03-14 06:40 GMT

సౌత్ ఇండియా నేచురల్ బ్యూటీ సాయి పల్లవి సిని పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ఇప్పుడు బాలీవుడ్‌ను ఏలేందుకు సిద్ధమవుతోంది. అసలు తన తొలి హిందీ సినిమా విడుదల కాకముందే అక్కడ వరుస ఆఫర్లతో వార్తల్లో నిలుస్తోంది. అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్‌తో 'ఏక్ దిన్', రణబీర్ కపూర్‌తో ప్రతిష్టాత్మక 'రామాయణం' వంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ, ఇప్పుడు మరో ఐకానిక్ రోల్ కోసం చర్చల్లో ఉంది. బాలీవుడ్ అగ్ర దర్శకుల కళ్ళు ఇప్పుడు ఈ టాలెంటెడ్ బ్యూటీపైనే ఉన్నాయి. ఆ వివరాలు ఇలా వున్నాయి..

లెజెండరీ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ :

సాయి పల్లవి కేవలం కమర్షియల్ సినిమాలే కాకుండా, నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకోవడంలో దిట్ట అని మనకు తెలిసిందే. తాజాగా ఆమెకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. దిగ్గజ కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎం.ఎస్. సుబ్బులక్ష్మి గారి బయోపిక్‌లో సాయి పల్లవి నటించబోతున్నట్లు సమాచారం. 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం ఆమెను ఫైనలైజ్ చేశారని టాక్. అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ, సాయి పల్లవి వంటి అద్భుతమైన నటి ఈ పాత్రకు సరిగ్గా సరిపోతుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. 'అమరన్' చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న సాయి పల్లవికి ఇదొక గొప్ప మైలురాయి కానుంది.

సంజయ్ లీలా భన్సాలీ చూపు:

ఇక ఎం.ఎస్. సుబ్బులక్ష్మి పాత్రే కాకుండా, మరో క్రేజీ ఆఫర్ కూడా ఆమె తలుపు తట్టినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ లెజెండరీ బ్యూటీ మధుబాల బయోపిక్‌ను అగ్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ప్లాన్ చేస్తున్నారు. ఈ పాత్ర కోసం కియారా అద్వానీ వంటి స్టార్ల పేర్లు వినిపించినా, భన్సాలీ మాత్రం సాయి పల్లవి వైపే మొగ్గు చూపుతున్నట్లు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఇక సాయి పల్లవికి ఉన్న నేచురల్ లుక్, అద్భుతమైన నటన మరియు దేశవ్యాప్తంగా ఉన్న పాపులారిటీ ఈ పాత్రకు ప్లస్ అవుతాయని మేకర్స్ భావిస్తున్నారు. ఇక భన్సాలీ సినిమాల్లో నటించడం అంటేనే ఒక పెద్ద గౌరవం, అలాంటిది మధుబాల లాంటి ఐకానిక్ పాత్రలో సాయి పల్లవి కనిపిస్తే అంతకంటే కావాల్సింది ఏముంది ఇంకా అంటున్నారు ఫాన్స్.

బాలీవుడ్ లో సాయి పల్లవి హవా:

ఏ హీరో పక్కన నటించాం అనేదాని కంటే, తన పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉంది అనేదే సాయి పల్లవికి ముఖ్యం. అందుకే కేవలం రెమ్యూనరేషన్ కోసం కాకుండా, సబ్జెక్ట్ నచ్చితేనే ఆమె సంతకం చేస్తుంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న ప్రాజెక్టులు చూస్తుంటే, త్వరలోనే బాలీవుడ్ టాప్ హీరోయిన్ల జాబితాలో ఆమె చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక రామాయణంలో సీతగా, బయోపిక్స్‌లో లెజెండరీ మహిళలుగా ఆమె చేస్తున్న ఈ ప్రయాణం అద్భుతం. సాయి పల్లవి ఎంచుకుంటున్న ఈ విభిన్నమైన పాత్రలు ఆమెను ఇతర హీరోయిన్ల కంటే ఎంతో ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి.

Tags:    

Similar News