'జైల‌ర్ 2' విజ‌య్ సేతుప‌తి ఎందుకు చేశాడంటే..!

ఈ నేప‌థ్యంలో ఈ సినిమాపై విజ‌య్ సేతుప‌తి చేసిన కామెంట్స్ మ‌రింత ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ సినిమాలో నేను పోషించిన క్యారెక్టర్‌కు సంబంధించిన షూటింగ్ ఒక రోజులో పూర్తియింది.;

Update: 2026-03-14 06:40 GMT

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ క‌థానాయకుడిగా న‌టిస్తున్న భారీ యాక్ష‌న్ డ్రామా `జైల‌ర్ 2`. నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌కుడు. స‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై స్టార్ ప్రొడ్యూస‌ర్ క‌ళాన‌ధి మార‌న్ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. రిటైర్డ్ జైల‌ర్ టైగ‌ర్ ముత్తువేళ్ పాండ్య‌న్ నేప‌థ్యంలో సాగే ప‌వ‌ర్ ఫుల్ స్టోరీగా 2023లో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనిపించుకున్న‌`జైల‌ర్‌` మూవీకి సీక్వెల్‌గా దీన్ని తెర‌కెక్కిస్తున్నారు.

కేర‌ళ‌తో పాటు ప‌లు కీల‌క ప్ర‌దేశాల్లో ఈ మూవీకి సంబంధించిన ప్రధాన ఘ‌ట్టాల‌ని చిత్రీక‌రించారు. మోహ‌న్‌లాల్‌, శివ‌రాజ్‌కుమార్ కీల‌క అతిథి పాత్ర‌ల్లో న‌టిస్తుండ‌గా ర‌మ్య‌కృష్ణ‌, మిర్నా, యోగిబాబు, అన్న రాజ‌న్‌, జ‌తిన్ స‌ర్న ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ మూవీలోని అత్యంత కీల‌క‌మైన క్యారెక్ట‌ర్‌లో విల‌క్ష‌ణ ద‌ర్శకుడు, న‌టుడు ఎస్‌.జె. సూర్య క‌నిపించ‌నున్నారు. వీరిలో పాటు స్పెష‌ల్ గెస్ట్ క్యారెక్ట‌ర్ల‌లో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్‌, మిథున్ చ‌క్ర‌వ‌ర్తి, విల‌క్షణ హీరో విజ‌య్ సేతుప‌తి న‌టిస్తున్నారు.

నంద‌మూరి బాల‌కృష్ణ కూడా ఓ కీల‌క అతిథి పాత్ర‌లో మెరుస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. కేర‌ళలోని అతిర‌పిల్లి జ‌ల‌పాతం వ‌ద్ద చిత్రీక‌రించిన హైఓల్టేజ్ యాక్ష‌న్ స‌న్నివేశాలు సినిమాకు ప్ర‌ధాన హైలైట్‌గా నిలుస్తాయ‌ని ఇన్ సైడ్ టాక్‌. ఫ‌స్ట్ పార్ట్ సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకుని రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన నేప‌థ్యంలో ఈ సీక్వెల్‌పై అంచ‌నాలు తారా స్థాయికి చేరుకున్నాయి. కీల‌క అతిథి పాత్ర‌ల్లో షారుక్‌ఖాన్, మిథున్ చ‌క్ర‌వ‌ర్తి, విజ‌య్ సేతుప‌తి కూడా న‌టిస్తుండ‌టంతో ఆ అంచ‌నాలు మ‌రింత హైరి చేరుకున్నాయి.

ఈ నేప‌థ్యంలో ఈ సినిమాపై విజ‌య్ సేతుప‌తి చేసిన కామెంట్స్ మ‌రింత ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ సినిమాలో నేను పోషించిన క్యారెక్టర్‌కు సంబంధించిన షూటింగ్ ఒక రోజులో పూర్తియింది. అయితే ఇంత చిన్న క్యారెక్ట‌ర్‌ని చేయ‌డానికి కార‌ణం నా స్వార్థం. నా స్వార్థం వ‌ల్లే ఈ సినిమాలో న‌టించాను. ఎందుకంటే నేను ర‌జ‌నీ సార్‌తో క‌లిసి న‌టించాల‌నుకున్నా కాబ‌ట్టి. ఆ ఒక్క కార‌ణం కోస‌మే ఇందులో క‌నిపించాను.

ర‌జ‌నీ స‌ర్ వ‌య‌సు 70 ప్ల‌స్‌. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న‌కు ఆరేళ్ల వ‌య‌సున్న అభిమానులు కూడా ఉన్నారు. `ఉన్ మావ‌నుమ్ పేర‌నుమ్ ఆటం పోడా వేచ‌న‌వ‌న్‌..`ఈ అద్భుత‌మైన సాహిత్యం ఆయ‌న‌కు క‌రెక్ట్‌గా స‌రిపోతుంది. ఆయ‌న వ‌ర్క్ త‌ర‌త‌రాలుగా చెప్పుకుంటారు. నేను ఆరాధించే సూప‌ర్ స్టార్ న‌న్ను ఇప్ప‌టికీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తాడు. నేను ఆయ‌న‌తో ద‌గ్గ‌ర‌గా పనిచేసిన‌ప్పుడు ఆయ‌న కృషి, బాధ్య‌తాయుత‌మైన భావ‌న‌ని చూడ‌గ‌లిగాను` అంటూ ర‌జ‌నీపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. దీనికి సంబంధించిన పోస్ట్ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది. భారీ అంచ‌నాలు నెల‌కొన్న `జైల‌ర్ 2`ని జూన్‌లో భారీ స్థాయిలో రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Tags:    

Similar News