అనిల్ కపూర్ పక్కా జెంటిల్ అండ్ ప్రొఫెషనల్!
డేరింగ్ డైరెక్టర్ ఆదిత్యధర్ అత్యంత భారీ స్థాయిలో రూపొందించిన స్పై యాక్షన్ డ్రామా `ధురంధర్ :ది రివేంజ్`.;
డేరింగ్ డైరెక్టర్ ఆదిత్యధర్ అత్యంత భారీ స్థాయిలో రూపొందించిన స్పై యాక్షన్ డ్రామా `ధురంధర్ :ది రివేంజ్`. రణ్‌వీర్ సింగ్ కథానాయకుడిగా నటించిన ఈ మూవీ మార్చి 19న అత్యంత భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతోంది. గత ఏడాది విడుదలైన పార్ట్ 1 బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో సీక్వెల్‌పై అంచనాలు ఏర్పడ్డాయి. టీజర్, ట్రైలర్‌తో అంచనాల్ని పతాక స్థాయికి చేర్చిన ఆదిత్యధర్ ఈ పార్ట్ 2లో ఊహించని సర్‌ప్రైజ్‌లు ప్లాన్ చేశారట.
పెయిడ్ ప్రీమియర్స్‌తో పాటు అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా ఓవర్సీస్‌తో పాటు ఇండియాలోనూ ఈ సినిమా సంచలనం సృష్టిస్తూ అడ్వాన్స్ బుకింగ్స్‌లోనూ రికార్డులు సృష్టిస్తోంది. సినిమా ప్రీమియర్స్‌కి మరో నాలుగు రోజులే మిగిలి ఉండగా, రిలీజ్‌కు మరో ఐదు రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఫస్ట్ పార్ట్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించడంతో సీక్వెల్ బాక్సాఫీస్ వద్ద సింహగర్జన చేయడం ఖాయమని ఈ సారి రూ.2000 కోట్లు పక్కా అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇదిలా ఉంటే `ధురంధర్ ది రివేంజ్`పై బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన `ధురంధర్ ది రివేంజ్`కు సంబంధించిన ఓ ఇంపార్టెంట్ న్యూస్‌ని బయటపెట్టారు. సీక్వెల్‌లో సర్‌ప్రైజింగ్ క్యారెక్టర్లని ప్లాన్ చేసిన దర్శకుడు ఆదిత్యధర్ ఇందులోని ఓ ఇంపార్టెంట్ గెస్ట్ రోల్ కోసం బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్‌ని సంప్రదించాడట. అయితే తను ఇచ్చిన ఆఫర్‌ని అనిల్ సున్నితంగా తిరస్కరించానని చెప్పారు.
`ధురంధర్ ది రివేంజ్` కోసం ఆదిత్యధర్ నన్ను సంప్రదించడం నిజమే. సినిమాలోని ఓ చిన్న అతిథి పాత్ర కోసం తను నన్ను సంప్రదించాడు. గెస్ట్ క్యారెక్టర్ నాకెంతగానో నచ్చింది. అయితే నేను అప్పటికే కిమట్ అయిన సినిమాలు పూర్తి చేయాల్సి ఉంది. అందుకే తను ఇచ్చిన ఆఫర్‌ని కాదన్నాను. ఇప్పుడు సినిమా రిలీజ్ అవుతోంది. ఇదొక ఫెంటాస్టిక్ మూవీ. చెప్పాలంటే నేను మంచి సినిమాలో భాగం అయ్యే అవకాశాన్ని కోల్పోయాను. అయినా ఏం ఫరవాలేదు. ఒక ఆర్టిస్ట్‌గా నేను ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నానంటే నా కమిట్మెంట్, డెడికేషన్. ఒక ఆర్టిస్ట్‌కి టాలెంట్ ఉంటే సరిపోదు. అందుకు తగ్గ కమిట్‌మెంట్ కూడా ఉండాలి. ప్రొషనలిజం ఉండాలి` అంటూ పక్కా జెంటిల్ అండ్ ప్రొఫెషనలిజాన్ని ప్రదర్శించి శభాష్ అనిపించుకుంటున్నారు.
తనకు లభించిన క్రేజీ ఆఫర్‌ని ఓకే చేసి మిగతా సినిమాలని పక్కన పెట్టేస్తే అది కరెక్ట్ కాదని అనిల్ కపూర్ పక్కా ప్రొఫెషనల్‌గా వ్యవహరించాడని అంతా ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే సీక్వెల్‌లో నటించే అవకాశం కోల్పోయిన మీరు పార్ట్ 3లో నటిస్తారా? అని అడిగితే నేను కొత్తగా చేయడానికి ప్యత్నిస్తా` అన్నారు. అంటే `ధురంధర్` పార్ట్ 3 కూడా ఉంటుందన్నమాట. అనిల్ కపూర్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.