'రాకాసా' నుంచి 'పదే పదే' మెలోడీ.. అందరినీ ఫిదా చేస్తుందిగా!
టాలీవుడ్ యంగ్ క్యాస్టింగ్ సంగీత్ శోభన్, నయన్ సారిక లీడ్ రోల్స్ లో నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ రాకాసా మూవీ రిలీజ్ కు సిద్ధమవుతోంది.;
టాలీవుడ్ యంగ్ క్యాస్టింగ్ సంగీత్ శోభన్, నయన్ సారిక లీడ్ రోల్స్ లో నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ రాకాసా మూవీ రిలీజ్ కు సిద్ధమవుతోంది. మానసా శర్మ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను మెగా డాటర్ నిహారిక కొణిదెల తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ ఆ సినిమాను సమర్పిస్తుండడం విశేషం.
మరికొద్ది రోజుల్లో మూవీ రిలీజ్ కానుండగా.. మేకర్స్ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కు సూపర్ రెస్పాన్స్ రాగా.. సినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయని చెప్పాలి. ఇప్పటికే మ్యూజిక్ ప్రమోషన్స్ లో భాగంగా ఫస్ట్ సింగిల్ ను విడుదల చేసిన మేకర్స్.. తాజాగా రెండో సింగిల్ పదే పదే అనే మెలోడీ పాటను తీసుకొచ్చారు.
పదే పదే ప్రాణం నిన్నే కోరగా.. అంటూ సాగుతున్న ఆ పాటలో ప్రేమలో ఉండే స్మూత్ ఫీలింగ్స్ ను క్లియర్ గా చూపించారని చెప్పాలి. ప్రేమ మొదలయ్యే సమయంలో మనసులో కలిగే భావాలను పాటలో అందంగా ఆవిష్కరించారు. సాంగ్ కు కిట్టూ విస్సాప్రగడ సాహిత్యం అందించగా.. ఆయన ప్రేమలోని చిన్న చిన్న ఎమోషన్స్ ఈజీగా వ్యక్తం చేసేలా పదాలు రాశారు.
సంగీత దర్శకుడు అనుదీప్ దేవ్ సాంగ్ కు సాఫ్ట్ మెలోడీ ట్యూన్ అందించారు. ముఖ్యంగా వీణ స్వరాలు ఆధారంగా తీసుకుని కంపోజ్ చేయగా.. అది పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మోడ్రన్ మ్యూజిక్ కు సంప్రదాయ వాద్యాన్ని యాడ్ చేసి కంపోజ్ చేయడం వినడానికి ఎంతో ఆహ్లాదకరంగా మారింది. సాంగ్ ను సింగర్ సింధుజా శ్రీనివాసన్ ఆలపించగా.. ఆమె వాయిస్ పాటలోని ఎమోషన్స్ ను అందంగా వ్యక్తం చేస్తూ ఆకట్టుకుంటోంది.
ఏదేమైనా సాఫ్ట్ మెలోడీగా రూపొందిన ఆ పాట సినిమా కథలోని ప్రేమ భావాలను ప్రేక్షకులకు పరిచయం చేస్తుందని చిత్ర బృందం చెబుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న పదే పదే సాంగ్.. ఇప్పుడు మంచి వ్యూస్ సంపాదించుకుంటోంది. సినిమా టైటిల్ గ్లింప్స్ కు దాదాపు 19 లక్షల వ్యూస్ రాగా, టీజర్ 28 లక్షలకు పైగా వ్యూస్ సాధించింది. మొదటి సింగిల్ రపప్పా 11 లక్షలకుపైగా వ్యూస్ సాధించింది.
ఇక సినిమా విషయానికొస్తే.. సంగీత్ శోభన్, నయన్ సారికతోపాటు వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఏప్రిల్ 3వ తేదీన రాకాసా మూవీ థియేటర్లలోకి వచ్చేందుకు
సిద్ధమవుతుండగా.. అమెరికా, యునైటెడ్ కింగ్ డమ్, యూరప్, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో 350కి పైగా థియేటర్లలో సినిమాను గ్రాండ్ గా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మరి వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న రాకాసా మూవీ ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.