శంభాల: క్రిస్మస్ విన్నర్ ఇప్పుడు బాలీవుడ్ వేటలో..
యంగ్ హీరో ఆది సాయికుమార్ ఖాతాలో చాలా కాలం తరువాత ఒక సాలిడ్ హిట్ పడింది. క్రిస్మస్ కానుకగా వచ్చిన 'శంభాల' మూవీ సైలెంట్ గా వచ్చి బాక్సాఫీస్ దగ్గర సౌండ్ చేసింది.;
యంగ్ హీరో ఆది సాయికుమార్ ఖాతాలో చాలా కాలం తరువాత ఒక సాలిడ్ హిట్ పడింది. క్రిస్మస్ కానుకగా వచ్చిన 'శంభాల' మూవీ సైలెంట్ గా వచ్చి బాక్సాఫీస్ దగ్గర సౌండ్ చేసింది. ఎలాంటి హడావిడి లేకుండా వచ్చినా, కంటెంట్ బాగుండటంతో ఆడియెన్స్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు. తెలుగులో వచ్చిన ఈ క్రేజీ రెస్పాన్స్ చూశాక, ఇప్పుడు ఈ సినిమాను బాలీవుడ్ లో కూడా దించడానికి రెడీ అయ్యారు.
తెలుగులో వర్కౌట్ అయిన ఈ మిస్టిక్ థ్రిల్లర్ ను నార్త్ ఆడియెన్స్ కు కూడా చూపించాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. అందుకే డబ్బింగ్ పనులు పూర్తి చేసి, జనవరి 9న హిందీలో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే హిందీ వెర్షన్ కు సంబంధించిన సెన్సార్ పనులు కూడా పూర్తయ్యాయి. అంటే ఎలాంటి అడ్డంకులు లేకుండా సినిమా రిలీజ్ కు లైన్ క్లియర్ అయ్యిందన్నమాట.
ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ అంతా డైరెక్టర్ యుగంధర్ మునికే దక్కుతుంది. రొటీన్ మాస్ మసాలా కథలు కాకుండా, ఒక డివోషనల్ మిస్టిక్ పాయింట్ ని తీసుకొని దాన్ని ఎంతో గ్రిప్పింగ్ గా తెరకెక్కించారు. ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్స్ కు లాంగ్వేజ్ తో పనిలేదు, ఆ ఎమోషన్ ఎవరికైనా కనెక్ట్ అవుతుంది. అందుకే హిందీలో కూడా ఈ సినిమా ఈజీగా క్లిక్ అవుతుందని టీమ్ నమ్ముతోంది.
గతంలో సౌత్ నుంచి వెళ్లిన కార్తికేయ 2, కాంతార లాంటి సినిమాలు నార్త్ లో ఎలాంటి మ్యాజిక్ చేశాయో చూశాం. అక్కడ ఆడియెన్స్ డివోషనల్ టచ్ ఉన్న థ్రిల్లర్స్ ను బాగా ఓన్ చేసుకుంటున్నారు. సరిగ్గా 'శంభాల' కూడా అదే జోనర్ కాబట్టి, అక్కడ కూడా వర్కౌట్ అయ్యే ఛాన్స్ గట్టిగానే ఉంది. ఆది సాయికుమార్ కు అక్కడ ఇదే ఫస్ట్ ఎంట్రీ కాబట్టి, ఇది అతనికి చాలా కీలకం.
నిర్మాతలు మహిధర్ రెడ్డి, రాజశేఖర్ ఈ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. షైనింగ్ పిక్చర్స్ పై వచ్చిన ఈ సినిమా విజువల్స్, గ్రాఫిక్స్ స్క్రీన్ మీద చాలా రిచ్ గా కనిపిస్తున్నాయి. ఆ క్వాలిటీనే ఇప్పుడు సినిమాను పాన్ ఇండియా లెవెల్ కు తీసుకెళ్లింది. ప్రమోషన్స్ కూడా ప్లాన్ చేసుకుని నార్త్ లో గట్టిగానే సౌండ్ చేయాలని చూస్తున్నారు.
ఏదేమైనా ఆది సాయికుమార్ 'శంభాల'తో నేషనల్ లెవెల్ లో లక్ టెస్ట్ చేసుకోబోతున్నాడు. జనవరి 9న రిలీజ్ అవుతున్న ఈ సినిమాతో ఆదికి బాలీవుడ్ లో ఎలాంటి వెల్కమ్ దొరుకుతుందో చూడాలి. కంటెంట్ లో దమ్ముంటే బాక్సాఫీస్ దగ్గర తిరుగుండదు, మరి ఈ సినిమా అక్కడ ఎన్ని కోట్లు కొల్లగొడుతుందో వేచి చూడాలి.