వైట్ డ్రెస్​లో ఫారియా మాయ

'జాతిరత్నాలు' సినిమాతో 'చిట్టి'గా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకున్న పొడుగు కాళ్ళ సుందరి ఫారియా అబ్దుల్లా.;

Update: 2026-01-02 18:08 GMT

'జాతిరత్నాలు' సినిమాతో 'చిట్టి'గా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకున్న పొడుగు కాళ్ళ సుందరి ఫారియా అబ్దుల్లా. తన హైట్, గ్లామర్​తో ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ, వెండితెరపై కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువ యాక్టివ్​గా ఉంటారు. 2026 న్యూ ఇయర్ సందర్భంగా ఈ బ్యూటీ షేర్ చేసిన లేటెస్ట్ ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.




ఈ లేటెస్ట్ ఫొటోషూట్​లో ఫారియా క్రీమ్ వైట్ కలర్ ఆఫ్ షోల్డర్ డిజైనర్ డ్రెస్​లో మెరిసిపోతున్నారు. ఈ డ్రెస్ కింది భాగంలో నలుపు రంగుతో వేసిన స్కెచ్ ఆర్ట్ డిజైన్ చాలా కొత్తగా, ఆర్టిస్టిక్​గా ఉంది. మోకాళ్ళ వరకు ఉండే ఈ ట్రెండీ అవుట్​ఫిట్​లో ఆమె లుక్ చాలా క్లాసీగా, అంతే స్టైలిష్​గా కనిపిస్తోంది. స్టైలింగ్ విషయంలో ఫారియా ఎప్పుడూ కొత్తదనం చూపిస్తారు.




ఈ లుక్​లో చెవులకు పెద్ద సైజు ముత్యాల కమ్మలు ధరించి రాయల్ లుక్​ను సొంతం చేసుకున్నారు. జుట్టును సగం పైకి కట్టి మిగిలిన కురులను భుజాలపైకి వదిలేసి ఆమె ఇచ్చిన ఫోజులు కుర్రాళ్ళను కట్టిపడేస్తున్నాయి. డ్రెస్​పై ఉన్న బ్లాక్ ప్రింట్​కు మ్యాచింగ్​గా నల్లటి పాయింటెడ్ హీల్స్ ధరించి పర్ఫెక్ట్​గా రెడీ అయ్యారు. ఫారియా కెరీర్ విషయానికి వస్తే, 2025 ఆమెకు అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. 'మత్తు వదలరా 2', 'గుర్రం పాపిరెడ్డి' వంటి సినిమాల్లో నటించినా, అవి ఆమె కెరీర్ గ్రాఫ్​ను పెంచలేకపోయాయి.

సినిమాలైతే వచ్చాయి కానీ, స్టార్ హీరోయిన్ రేంజ్​ను మాత్రం అందుకోలేకపోయారు. ప్రస్తుతం ఆమె చేతిలో చెప్పుకోదగ్గ భారీ ప్రాజెక్టులేవీ లేవు. అయితే, 2026లో మాత్రం గట్టిగా కొట్టాలనే కసి ఆమెలో కనిపిస్తోంది. "హ్యాపీ న్యూ ఇయర్ మై ఫ్యామిలీ.. 2026లో దుమ్మురేపుదాం" అంటూ ఆమె పెట్టిన క్యాప్షన్ ఆమె ఆత్మవిశ్వాసాన్ని చూపిస్తోంది. హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా తన గ్లామర్, టాలెంట్​తో ఫారియా ఈ ఏడాదైనా సాలిడ్ బ్రేక్ అందుకుంటుందేమో చూడాలి. ఆమెలోని ఈ కొత్త ఎనర్జీ చూస్తుంటే కచ్చితంగా బౌన్స్ బ్యాక్ అవుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

Tags:    

Similar News