ఫోటో స్టోరి: `మత్తు`గా గమ్మత్తుగా సన్నీలియోన్
శృంగార తార సన్నీలియోన్ పరిచయం అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఉన్న నటి. బాలీవుడ్ సహా దక్షిణాది చిత్రసీమకు కూడా సుపరిచితమైన పేరు.;
శృంగార తార సన్నీలియోన్ పరిచయం అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఉన్న నటి. బాలీవుడ్ సహా దక్షిణాది చిత్రసీమకు కూడా సుపరిచితమైన పేరు. అయితే ఇటీవలి కాలంలో సన్నీ సందడి అంతంత మాత్రంగానే ఉంది. దత్తత వారసులతో పాటు, డేనియల్ వెబర్ తో తన లవ్ లైఫ్‌ని అందంగా మలుచుకునేందుకు సన్నీ చేస్తున్న ప్రతి ప్రయత్నం హృదయాలను గెలుచుకుంది.
సన్నీ ఇటీవల సోషల్ మీడియాల్లో తన అభిమానులకు నిరంతరం టచ్ లో ఉంటోంది. సన్నీ తన సౌందర్య ఉత్పత్తుల కంపెనీని ప్రమోట్ చేసుకుంటూనే, అప్పుడప్పుడు కొన్ని స్పెషల్ ఫోటోషూట్లను షేర్ చేస్తోంది. అదే కోవలో ఒక అందమైన చేతి అల్లికతో డిజైన్ చేసిన కోట్ ని ధరించి అందంగా ఫోజులిచ్చింది. ప్రత్యేకించి ఆ చేతికి ధరించిన బటర్ ఫ్లై రింగ్ ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. సన్నీ పెరిగే వయసుతో పాటు షైనింగ్ క్వీన్ లా మెరిసిపోతోంది. ఈ లుక్ చూడగానే మత్తుగా గమ్మత్తుగా సన్నీలియోన్ సంథింగ్ స్పెషల్ గా కనిపిస్తోందంటూ అభిమానులు కితాబిచ్చేస్తున్నారు. ప్రస్తుతం ఈ యూనిక్ ఫోటోషూట్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది.
తెలుగులో మనోజ్ సరసన...
ఒక విభిన్నమైన, కఠినమైన బోల్డ్ ప్రపంచం నుంచి తనను తాను మరల్చుకుని, ఒక అందమైన జీవితం వైపు వెళ్లాలనే సన్నీ తపన, జిజ్ఞాస అందరినీ ఆకట్టుకుంటున్నాయి. చాలా బాలీవుడ్ చిత్రాలలో కీలక పాత్రలు పోషించిన సన్నీలియోన్ మంచు మనోజ్ కరెంట్ తీగ చిత్రంలోను తనదైన అద్భుత నటన, అందంతో మైమరిపించిన సంగతి తెలిసిందే.
ద్విభాషా చిత్రంతో బిజీ..
సన్నీ ఇటీవలే దక్షిణాదిన ఓ ద్విభాషా చిత్రంలోను నటించింది. WM మూవీస్ ప్రొడక్షన్ నెం. 2 షూటింగ్ పూర్తి చేసానని సన్నీలియోన్ ప్రకటించింది. తన చివరి షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న తర్వాత నటీనటులు, సిబ్బంది సెట్‌లో కేక్ కటింగ్ వేడుకలో పాల్గొన్న ఫోటోలను షేర్ చేసింది. తమిళం - తెలుగు రెండు భాషలలో చిత్రీకరించిన ఈ చిత్రం పోస్ట్-ప్రొడక్షన్ దశలో ఉంది. రిలీజ్ గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
హాలీవుడ్ లోను ప్రవేశం..
మరోవైపు సన్నీ లియోన్ హాలీవుడ్‌లో అరంగేట్రం చేయడానికి సిద్ధమవుతోంది. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ స్వతంత్ర చిత్రంలో ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక సైనికురాలి పాత్రలో సన్నీలియోన్ కనిపించనుంది. సినిమా సెట్ నుండి లీకైన ఫోటోలు ఆన్‌లైన్‌లో ఇంతకుముందు వైరల్ అయ్యాయి. పోరాటంలో నిమగ్నమైన ఉన్న సన్నీ లియోన్ ఫోటోలు ఆశ్చర్యపరిచాయి. సైనిక దుస్తులు ధరించి, చేతిలో ఆయుధం పట్టుకుని, ధ్వంసమైన యుద్ధ వాతావరణంలో కనిపించింది.
షోలతోను బిజీ బిజీ
44 ఏళ్ల సన్నీలియోన్ ఇప్పటికీ ఎంతో ఎనర్జిటిక్ గా కనిపిస్తోంది. ఈ భామ చివరిగా `ఎంటీవీ స్ప్లిట్స్‌విల్లా X5`కి హోస్ట్‌గా కనిపించింది. షోలో మెంటార్ గా, యాంకర్‌గా డ్యూయల్ రోల్ పోషించింది. తదుపరి నెట్‌ఫ్లిక్స్ ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతోంది.