శ్రీలీల ఎదురు చూపు!

ఎలాంటి పాత్ర‌లోనైనా ఒదిగిపోయే న‌టి కాబ‌ట్టి ఇచ్చిన పాత్ర‌కు న్యాయం చేస్తుంది. సినిమా స‌క్సెస్ అయితే మంచి గుర్తింపు ద‌క్కుతుంది.;

Update: 2026-01-02 19:30 GMT

తెలుగు హీరోయిన్ శ్రీలీల లైన‌ప్ ఎలా ఉంద‌న్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. టాలీవుడ్ సినిమాల‌కంటే బాలీవుడ్ కీల‌కంగా భావించి అక్క‌డే క‌మిట్ అవుతోంది. ప్ర‌స్తుతం హిందీలో రెండు సినిమాలు.. తెలుగులో ఒక చిత్రం... త‌మిళ్లో మ‌రో చిత్రంలోనూ న‌టిస్తోంది. తెలుగులో వ‌చ్చిన కొన్ని అవ‌కాశాల‌ను కాద‌నుకున్న మాట వాస్త‌వం. అందుకు కార‌ణాలు అనేకం. కానీ తాజాగా అమ్మ‌డు మ‌న‌సు మారిన‌ట్లు తెలిసింది. భాష‌తో సంబంధం లేకుండా స్ట్రాంగ్ కంబ్యాక్ అవ్వ‌డ‌మే టార్గెట్ గా ప‌ని చేస్తుంద‌ని ఆమె స‌న్నిహితుల నుంచి లీక్ అందింది.

మ‌రి తెలుగులో కంబ్యాక్ సాధ్య‌మేనా? అంటే చేతిలో ఉన్న‌ది ఒకే ఒక్క చిత్రం. అందే `ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్`. ఇందులో అమ్మ‌డు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి జోడీగా న‌టిస్తోంది. ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ శ్రీలీల‌ను ఎంపిక చేసాడంటే? ఊరికే తీసుకోడు. ఆమెలో చ‌ల‌కీత‌నం..ప్ర‌తిభ గుర్తించే ఛాన్స్ ఇచ్చాడు. హ‌రీష్ సినిమాల్లో హీరోయిన్లు కూడా కేవ‌లం గ్లామ‌ర్ కే ప‌రిమితం కారు. న‌ట‌న‌కు ఆస్కారం ఉంటుంది. హీరోతో కాంబినేష‌న్ స‌న్నివేశాలు ఎక్కువ‌గా పెడ‌తాడు. ఆ రకంగా శ్రీలీల పాత్ర ప‌రంగా టెన్ష‌న్ ప‌డాల్సిన ప‌నిలేదు.

ఎలాంటి పాత్ర‌లోనైనా ఒదిగిపోయే న‌టి కాబ‌ట్టి ఇచ్చిన పాత్ర‌కు న్యాయం చేస్తుంది. సినిమా స‌క్సెస్ అయితే మంచి గుర్తింపు ద‌క్కుతుంది. కానీ ఇక్క‌డ ఓ బ్యాడ్ సెంటిమెంట్ కూడా ఉంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర‌స‌న న‌టించిన భామ‌లు ఫాంలోకి వ‌చ్చిన సంద‌ర్భాలు చాలా త‌క్కువ‌. అతి కొద్ది మంది మాత్ర‌మే ప‌రిశ్ర‌మ‌లో స‌క్సెస్ పుల్ కెరీర్ ని చూస్తున్నారు. ఇంకొంత మంది సినిమాల నుంచి రిటైర్మెంట్ తీసుకుని వెళ్లిపోయారు. ఈ నేప‌థ్యంలో శ్రీలీల‌కు `ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్` వ‌ర‌కూ ఫేవ‌ర్ గా నిలుస్తుందా? లేదా? అన్న‌ది చూడాలి.

బాలీవుడ్ లో అనురాగ్ బ‌స్ చిత్రంతో లాంచ్ అవుతుంది. `ఆషీకీ` ప్రాంచైజీ నుంచి రిలీజ్ అవుతోన్న థ‌ర్డ్ ఇన్ స్టాల్ మెంట్ ఇది. సినిమాపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. కానీ ఇది డెబ్యూ. స‌క్సస్ అనంత‌రం బిజీ అవుతుందా? లేదా? అన్న‌ది స‌క్సెస్ స‌హా అమ్మ‌డు పెర్పార్మెన్స్ పైనే ఆధార‌ప‌డి ఉంది. అలాగే కోలీవుడ్ లో `ప‌రాశ‌క్తి`లో న‌టిస్తోంది. త‌మిళ్ లో కూడా ఇదే తొలి చిత్రం. స‌క్సెస్ అయితే అక్క‌డ అవ‌కాశాలు బాగానే వ‌స్తాయి. హీరోయిన్ల విష‌యంలో త‌మిళ ప్రేక్ష‌కులు వివ‌క్ష చూపించ‌రు. ట్యాలెంట్ ఉన్న తెలుగు భామ‌ల్నిఎంచ‌క్కా ఎంక‌రేజ్ చేస్తారు. శ్రీలీల‌లో చ‌లాకీత‌నం అక్క‌డ క‌లిసొస్తుంది. అలాగే ఈ మ‌ధ్య కాలంలో అమ్మ‌డు సోష‌ల్ మీడియాకు దూరంగానూ కనిపిస్తోంది. ఎప్పుడూ యాక్టివ్ గా ఫ‌న్నీ వీడియోలు పోస్ట్ చేసే బ్యూటీ వాటికీ దూరంగా ఉంటున్న‌ట్లుంది.

Tags:    

Similar News