తెలుగోళ్లు వదిలేసినా..వాళ్ళు ఆదుకుంటున్నారు

Update: 2017-02-07 05:46 GMT
‘బాహుబలి’ తర్వాత తమన్నా దశ తిరిగిపోతుందని అంతా అనుకున్నారు. కానీ అంత పెద్ద బ్లాక్ బస్టర్ లో నటించినా.. ఆ తర్వాత ‘బెంగాల్ టైగర్’.. ‘ఊపిరి’ లాంటి సక్సెస్ ఫుల్ సినిమాల్లో నటించినా తెలుగులో ఆమె కెరీర్ ఊపందుకోలేదు సరి కదా.. ఇంకా డల్ అయింది. ‘ఊపిరి’ తర్వాత తెలుగులో తమన్నా ఒక్కటంటే ఒక్క డైరెక్ట్ మూవీ కూడా చేయకపోవడం విడ్డూరమే. టాలీవుడ్ స్టార్ హీరోలందరూ ఆమెకు టాటా చెప్పేశారు. మీడియం రేంజి సినిమాలకు కూడా ఆమె పనికి రాకుండా పోయింది. ఐతే అదే సమయంలో తమిళ ఇండస్ట్రీ మాత్రం ఆమెను బాగానే ఆదరిస్తోంది. కెరీర్ ఆరంభంలో తెలుగు ప్రేక్షకులు తిరస్కరించాక తమిళ జనాలే ఆమెను నెత్తిన పెట్టుకున్నారు. ఇప్పుడు తెలుగులో మరోసారి అవకాశాల్లేక ఇబ్బంది పడుతున్న సమయంలో మళ్లీ కోలీవుడ్ ఆమెను ఆదుకుంటోంది.

గత ఏడాది కోలీవుడ్లో ధర్మదురై.. దేవి (అభినేత్రి).. కత్తి సెండై లాంటి సినిమాల్లో నటించింది తమన్నా. ఈ ఏడాది కూడా వరుసగా అవకాశాలు తమ్మూ తలుపు తడుతున్నాయి. ఆల్రెడీ శింబు సరసన ‘అన్బనవన్ అసరదవన్ అంగవదవన్’ అనే సినిమా చేస్తున్న మిల్కీ బ్యూటీ.. ఇటీవలే గౌతమ్ మీనన్ నిర్మాణంలో ‘పెళ్లి చూపులు’ రీమేక్ లో ఛాన్స్ పట్టేసింది. అది కాక ‘క్వీన్’ రీమేక్ కు కూడా ఆమే కథానాయికగా ఎంపికైంది. వీటన్నింటినీ మించి పెద్ద ఆఫర్ ఒకటి తాజాగా ఆమె తలుపు తట్టింది. స్టార్ హీరో విక్రమ్ నటించబోయే కొత్త సినిమాలో తమన్నానే కథానాయికగా ఎంపికైంది. విజయ్ చందర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడు. విక్రమ్ తో తమన్నా నటించబోయే తొలి సినిమా ఇదే. మొత్తానికి ఇప్పుడున్న అవకాశాలతో ఇంకో రెండేళ్ల పాటు కోలీవుడ్లో తమన్నాకు ఢోకా లేనట్లే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News