పిల్లల కోసం కోర్టుకు ఎక్కిన ట్యాలెంటెడ్‌ నటుడు

Update: 2020-12-13 04:49 GMT
బాలీవుడ్‌ ప్రముఖ నటుడు నవాజుద్దీన్‌ సిద్దికి ఫ్యామిలీ విషయంలో కొన్ని ఇబ్బందులు పడుతున్న విషయం తెల్సిందే. ఆయన భార్య ఆలియాతో విడాకులు తీసుకున్నాడు. విడాకుల ముందు ఆలియా నవాజుద్దీన్‌ కుటుంబ సభ్యులపై సంచలన ఆరోపణలు చేసింది. ఆయన సోదరుడు ఇతర కుటుంబ సభ్యులు తనను వేదించారంటూ ఫిర్యాదు వరకు వెళ్లింది. ఆ కేసులతో సతమతం అవుతూ వచ్చిన నవాజుద్దీన్‌ సిద్దికి ఇటీవలే కాస్త రిలాక్స్ అయ్యారు. ఆలియాతో విడాకుల సమయంలో ఇద్దరు పిల్లలను కూడా కోర్టు ఆమెకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లలను తనకు అప్పగించాలంటూ నవాజుద్దీన్‌ కోర్టును ఆశ్రయించాడు. ఆమె వద్ద పిల్లలకు భద్రత లేదు మరియు వారు అభ్యున్నతికి తాను అయితేనే బెటర్‌ అన్నట్లుగా వాదిస్తున్నాడు. తాను వారికి సరైన సంరక్షకుడిగా ఉంటాను అంటూ నవాజుద్దీన్‌ పేర్కొన్నాడు. కోర్టు ఆయన పిటీషన్‌ ను విచారణకు స్వీకరించి ఆలియాను కౌంటర్‌ దాఖలు చేయాల్సిందిగా ఆదేశించింది. పిల్లలను ఎందుకు ఆయనకు అప్పగించకూడదు అనే విషయాన్ని ఆలియా తన కౌంటర్‌ పిటీషన్‌ లో పేర్కొనాల్సి ఉంది.
Tags:    

Similar News