సూర్య బాగా 'ఇబ్బంది' పెట్టేశాడుగా!

Update: 2019-02-28 04:06 GMT
తమిళ హీరో సూర్య! ఈ హీరోకి తమిళ్ తో పాటుగా మన తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది...ముఖ్యంగా సూర్య గజిని సినిమా తర్వాత తెలుగు ప్రేక్షకుల్లో మంచి స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత వచ్చిన సినిమాలు అరా - కొరా ఆడినా...యముడు సీరీస్ మాత్రం అతన్ని తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది..అయితే ఆ తర్వాత సూర్య చేసిన కొన్ని ప్రయోగాత్మక చిత్రాలు విమర్శకుల ప్రశంసలు అయితే పొందాయి కానీ - కమర్షియల్ గా మాత్రం పెద్దగా విజయం సాధించలేదు అనే చెప్పాలి. ఇదిలా ఉంటే సూర్య ఇప్పుడు  తమిళంలో 'కాప్పాన్' అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాను రాబోయే ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం నాడు విడుదల చేసే దిశగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ లో జరిగిన ఒక అరుదైన విషయంపై ఇప్పుడు సోషల్ మీడియా అంతా చర్చించుకోవడమే కాకుండా - సూర్యను తెగ పొగిడేస్తున్నారు..ఇంతకీ అసలు ఆ విషయం ఏంటి అంటే - ఈ సినిమా షూటింగ్ లో భాగంగా భోజనాల సమయానికి వచ్చే సరికి సూర్య తానే అందరికీ స్వయంగా బిర్యానీ వడ్డించాడట..."చాలు-చాలు" అని అందరూ అంటున్నా వదలకుండా..."ఇంకొంచెం...ఇంకొంచెం" అంటూ తెగ ఇబ్బంది పెట్టేశాడట. ఒకటి రెండు హిట్స్ వస్తే చాలు - ఎక్కడా తగ్గకుండా హడావిడి చేసే హీరోలు ఉన్న మన సినిమా ఇండస్ట్రీలో అంత పెద్ద హీరో అసలు అలాంటి ఆలోచన ఏమీ లేకుండా సినిమా సెట్ లో వాళ్ళని కూడా సొంత కుటుంభంలా ఫీల్ అవుతూ భోజనం వడ్డించడం నిజంగా మెచ్చుకుని తీరాల్సిందే..

ఏది ఏమైనా సూర్యా ఫాన్స్ అందరూ చాలా ఆనందంగా ఫీల్ అవుతూ...గర్వంగా అందరికీ చెప్పుకునే విషయమే ఇది...ఇక ఈ 'కాప్పాన్' సినిమా విషయమే తీసుకుంటే ఈ సినిమాలో మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్...తమిళ హీరో ఆర్య సైతం నటిస్తున్నారు. ఇక హీరోయిన్ గా మన 'అఖిల్' సినిమా హీరోయిన్ సయ్యేషా చేస్తుంది. నటి పూర్ణ సైతం ఈ చిత్రంలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది అని తెలుస్తుంది. ఇక కేవీ ఆనంద్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
Tags:    

Similar News