టాప్ యాంగిల్ లో అందాల జాతర..
అలా ఈ మధ్యకాలంలో మంచి కథా ఓరియంటెడ్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా మారింది.;
అమీర్ ఖాన్ హీరోగా వచ్చిన దంగల్ సినిమాతో ఓవర్ నైట్ లోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది బాలీవుడ్ బ్యూటీ ఫాతిమా సనా షేక్. అలాంటి ఈమె ఈమధ్య కాలంలో తమన్న మాజీ బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో ప్రేమలో ఉందని, వివాహం కూడా చేసుకోబోతోంది అంటూ వార్తలు జోరుగా వినిపించాయి. అయితే ఇవన్నీ అవాస్తమని.. ఒక సినిమాలో భాగంగానే వీరిద్దరూ కలిసి నటిస్తున్న నేపథ్యంలో ఇలా కలిసి మీడియా కంట పడుతున్నారనే వార్తలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే ఇందులో ఏది నిజమో తెలియదు కానీ ఫాతిమా సనా షేక్ మాత్రం ఇలాంటి రూమర్స్ ఎదుర్కోవడం నిజంగా ఆశ్చర్యకరం అనే చెప్పాలి.
భారతీయ నటిగా హిందీ చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె 1997లో వచ్చిన షేక్ చాచి 420 అనే సినిమాలో బాలనటిగా నటించి తన కెరీర్ ను ఆరంభించింది. అయితే ఈమెకు గుర్తింపును అందించింది మాత్రం దంగల్ చిత్రం అనే చెప్పాలి. 2016లో వచ్చిన ఈ సినిమాలో రెజ్లర్ గీత ఫోగట్ పాత్రను పోషించింది. 2000 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ఈ సినిమా రికార్డ్స్ ను ఇప్పటివరకు మరే సినిమా కూడా సాధించలేకపోవడం గమనార్హం. గత పది సంవత్సరాలుగా ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తన రికార్డ్స్ ను పదిలం చేసుకుంది..
ఇటీవల ఈమె ఆర్. మాధవన్ తో కలిసి ఆప్ జైసా కోయి అనే సినిమాలో నటించింది. ఈ సినిమా ప్రేక్షకుల చేత పరవాలేదు అనిపించుకుంది. తర్వాత విజయ్ వర్మ తో కలిసి బాలీవుడ్ రొమాంటిక్ డ్రామా గుస్తాఖ్ ఇష్క్ లో నటించింది. ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్ర ఈ చిత్రం ద్వారా నిర్మాతగా సినీ రంగ ప్రవేశం చేశారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా నటీనటుల కెమిస్ట్రీకి విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి.
అలా ఈ మధ్యకాలంలో మంచి కథా ఓరియంటెడ్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా మారింది. అలా తాజాగా టాప్ యాంగిల్ లో అందాలు కనిపించేలా ఫోటోలకు ఫోజులిస్తూ ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంది ఫాతిమా సనా షేక్ . ఇక చాలా రోజుల తర్వాత ఇలా ఫోటోషూట్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఈమె అందానికి ముగ్ధులు అవుతూ గ్లామర్ బ్యూటీ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఫాతిమా సనా షేక్ 1992 జనవరి 11న జన్మించింది . ముంబైలో పెరిగిన ఈమె తండ్రి విపిన్ శర్మ జమ్మూకు చెందిన హిందూ.. ఈమె తల్లి రాజ్ తబుస్సమ్ శ్రీనగర్ కు చెందిన ముస్లిం. చైల్డ్ ఆర్టిస్ట్ గానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె.. ఆ తర్వాత హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.