అఖిల్ 'లెనిన్'.. నాగవంశీ మ్యాసివ్ అప్డేట్

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్.. ఇప్పుడు లెనిన్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు కెరీర్ లో సరైన హిట్ అందుకోని ఆయన.. లెనిన్ పై భారీ ఆశలు పెట్టుకున్నారు.;

Update: 2025-12-26 14:45 GMT

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్.. ఇప్పుడు లెనిన్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు కెరీర్ లో సరైన హిట్ అందుకోని ఆయన.. లెనిన్ పై భారీ ఆశలు పెట్టుకున్నారు. కచ్చితంగా పెద్ద హిట్ సొంతం చేసుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే తన రోల్ కు సంబంధించిన షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసుకున్నారు.

అఖిల్ మునుపెన్నడూ చూసిన విధంగా మాస్ అండ్ రగ్గడ్ లుక్‌ లో సినిమాలో కనిపించనున్నారు. గుబురు గడ్డం, కోర మీసాలు, పొడవాటి జుట్టుతో సందడి చేయనున్నారు. రాయలసీమ యాసలో అలరించనున్నారు. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ ద్వారా అఖిల్ విషయంలో క్లారిటీ వచ్చేసింది.

అయితే చిత్తూరు బ్యాక్‌ డ్రాప్‌ లో రూరల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న లెనిన్ మూవీకి నందు (మురళీ కిషోర్ అబ్బూరి) దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. తాజాగా నాగవంశీ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు.

రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. లెనిన్ మూవీ గురించి మాట్లాడారు. మార్చిలో లెనిన్ మూవీ రానుందని నాగవంశీ తెలిపారు. ఇప్పటికే వచ్చిన అవుట్ పుట్ అదిరిపోయిందని చెప్పారు. రెండు మూడు రోజుల్లో ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేస్తామని తెలిపారు. దీంతో న్యూ ఇయర్ కానుకగా లెనిన్ సాంగ్ ను విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది.

దీంతో ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లెనిన్ మూవీ ఫస్ట్ సాంగ్ కోసం వెయిట్ చేస్తున్నామని అక్కినేని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. అయితే లెనిన్ షూటింగ్ ఇప్పటికే చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో మేకర్స్ గుమ్మడి కాయ కొట్టనున్నారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ఇక సినిమా విషయానికొస్తే.. అఖిల్ సరసన యంగ్ సెన్సేషన్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌ గా నటిస్తున్నారు. ముందు ఫిమేల్ లీడ్ రోల్ కోసం శ్రీలీలను తీసుకున్నా.. ఆ తర్వాత ఆమె తప్పుకున్నారు. దీంతో భాగ్యశ్రీ మంచి ఛాన్స్ అందుకున్నారు. అయితే వారిద్దరి మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు సినిమాలో హైలైట్‌ గా నిలుస్తాయని వినికిడి.

లెనిన్ మూవీకి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వర్క్ చేస్తున్నారు. సాంగ్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ బాధ్యతలను నవీన్ కుమార్ చేపట్టారు. ఎడిటర్ గా నవీన్ నూలి.. అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. మరి వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్ కానున్న లెనిన్ మూవీ ఎలా ఉంటుందో వేచి చూడాలి.

Tags:    

Similar News