• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తంబీలైతే గుడి క‌ట్టేయ‌డం...

తంబీలైతే గుడి క‌ట్టేయ‌డం ఖాయం!

| బొద్దుగా క‌నిపిస్తే చాలు తంబీలు గుడి క‌ట్టేస్తారు. ఖుష్బూ, న‌మిత లాంటి భామ‌ల‌కు గుడులు క‌ట్టిన చ‌రిత్ర అర‌వ తంబీల‌ది.

By - Sivaji Kontham
Update: 2025-12-26 17:50 GMT

బొద్దుగా క‌నిపిస్తే చాలు తంబీలు గుడి క‌ట్టేస్తారు. ఖుష్బూ, న‌మిత లాంటి భామ‌ల‌కు గుడులు క‌ట్టిన చ‌రిత్ర అర‌వ తంబీల‌ది. అందుకే ఇప్పుడు మ‌న్నారాను ఇలా చూడ‌గానే త‌మిళ తంబీలు క‌చ్చితంగా గుడి క‌ట్టేస్తారు! అంటూ గుస‌గుస మొద‌లైపోయింది.

ఇంత‌కీ ఈ లుక్ ఎక్క‌డిది? ఎవ‌రి కోసం? అంటే... మ‌న్నారా కొంత‌కాలంగా హైద‌రాబాద్ కి దూరంగా ముంబైలోనే ఉంటోంది. ఇటీవ‌ల కొన్నిసార్లు ప‌బ్లిక్ ఔటింగుల్లో క‌నిపించింది. ఇప్పుడు క్రిస్మస్ వేడుకలలో భాగంగా మ‌న్నారా ఇలా బోల్డ్ గా ముస్తాబై వ‌చ్చింది. ఆ స‌మ‌యంలో కెమెరాలు ఈ భామ‌ను చుట్టు ముట్టాయి. అలా కార్ నుంచి దిగుతూనే కెమెరాల ముందు హొయ‌లు పోయింది మ‌న్నారా.

ఇక మ‌న్నారా రాక కోసం ఎంత‌గానో వేచి చూసిన ఫోటోగ్రాఫ‌ర్ల‌ను ఏమాత్రం నిరాశ‌ప‌ర‌చ‌కుండా అవ‌స‌ర‌మైన ఫోజులు ఇచ్చింది ఈ బ్యూటీ. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్స్ ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతున్నాయి. అయితే త‌న కోసం ఇంత‌మంది కెమెరామెన్ లు వేచి చూస్తున్నార‌ని `ఊహించ‌లేదు` అని చెప్పింది మ‌న్నారా!

ఈ క్రిస్మస్ మన్నారా ఐకానిక్ క్రిస్మస్ అని పేర్కొంది. ఎరుపు మినీ డ్రెస్ ధరించి అందమైన క్రిస్మస్ చెట్టు నేపథ్యంతో పాటను పాడుతూ కనిపించిన వీడియోను కూడా మ‌న్నారా షేర్ చేసింది ``గత క్రిస్మస్ సందర్భంగా నేను మీకు నా హృదయాన్ని ఇచ్చాను... కానీ ఈ క్రిస్మస్ సందర్భంగా, నేను మీకు మరింత వ్యక్తిగతమైనదాన్ని ఇస్తున్నాను - నా స్వరం. నా హృదయం నుండి మీ వరకు నా వైబ్``అని క్యాప్షన్‌లో రాసింది. ఇక మ‌న్నారా బొద్దందం చూశాక యూత్ చ‌లించిపోతున్నారు. తంబీలైతే గుడి క‌ట్టేయ‌డం ఖాయం! అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ సంవత్సరం ప్రారంభంలో మన్నారా.. అజీబ్ దస్తాన్ ఆత్మీయ ప్రదర్శనతో గాయ‌కురాలిగా అరంగేట్రం చేసింది. సంగీతం ఎల్లప్పుడూ నా హృదయానికి దగ్గరగా ఉంటుంది. ఈ పాట ప్రత్యేకమైనది.. ఎందుకంటే ఇది క్లాసిక్‌లపై నాకున్న ప్రేమను నా కళాత్మక స్పర్శతో మిళ‌తం అవుతుంద‌ని చెప్పింది.

మ‌న్నారా ఇటీవ‌ల‌ బిగ్ బాస్ 17లో కనిపించింది. ఈ సీజన్ స్టాండ్-అప్ కమెడియన్ మునావర్ ఫరూఖీ ట్రోఫీని గెలుచుకున్నాడు. అభిషేక్ కుమార్ మొదటి రన్నరప్ స్థానాన్ని దక్కించుకున్నాడు. మన్నారా చోప్రా ఈ సీజన్‌ను రెండవ రన్నరప్‌గా మిగిలిపోయింది. కానీ త‌న‌కంటూ భారీగా అభిమానుల‌ను సంపాదించుకుంది. మన్నారా చివరిగా సెలబ్రిటీ కామెడీ వంట షో `లాఫ్టర్ చెఫ్స్ సీజన్ 2`లో కనిపించింది. సుదేశ్ లెహ్రీతో కలిసి షోలో పాల్గొంది.



Tags:    
  • mannarachopra 
  • christmaslook 
  • mannara 
  • bollywood 
  • celebritystyle 

Similar News

రూట్ మార్చిన నితిన్.. ఈసారి తన స్ట్రెంగ్త్ మీదే నమ్మకం!

2026-11-22 11:36 GMT

భారీ అంచనాలతో వచ్చి.. నెలలోనే ఓటీటీ బాట!

2026-11-22 11:35 GMT

సాయి అభ్యంకర్.. బన్నీ సినిమాకు ఇదే అసలు టెన్షన్!

2026-11-22 11:28 GMT

నాగచైతన్య లైఫ్ ఫిలాసఫీ.. సమస్యలపై అక్కినేని హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

2026-11-22 11:26 GMT

శ్రీ విష్ణు సేఫ్ గేమ్ వెనుక అసలు లెక్క ఇదే!

2026-11-22 11:25 GMT

రెండు ఔట్.. శర్వాకు ఇదే బెస్ట్ చాన్స్

2026-11-22 11:21 GMT

శృంగారం బెస్ట్ వ‌ర్క‌వుట్ కాదంటారా? స్టార్ హీరో ప్ర‌శ్న‌!

2026-11-22 10:58 GMT

మ‌రో క్రేజీ మ్యూజిక‌ల్ బ‌యోపిక్ కి రంగం సిద్ధం

2026-11-22 10:58 GMT

US మిలియ‌న్ డాల‌ర్ క్ల‌బ్‌లో టాప్-10 మిడ్‌రేంజ్ హీరోలు

2026-11-22 10:57 GMT

భార‌తీయ సినిమాలో 'క‌మ‌ల్ ది గ్రేట్'.. ఎందుకో తెలుసా?

2026-11-22 10:48 GMT

అనిరుధ్ పెళ్లి రిసెప్షన్‌లో విజయ్, సంగీత.. కానీ చిన్న ట్విస్ట్!

2026-11-22 10:48 GMT

ఈ వారం బాక్సాఫీస్.. సినిమాల పరిస్థితి ఎలా ఉందంటే..

2026-11-22 10:46 GMT

Copyright @2026

Powered by Blink CMS