క్యూట్ లుక్స్ తో కట్టిపడేస్తున్న శ్రీ లీల!
భాషతో సంబంధం లేకుండా వరుస చిత్రాలలో నటిస్తూ.. తన నటనతోనే కాకుండా అందంతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న అతి కొద్దిమంది హీరోయిన్స్ లలో శ్రీ లీల మొదటి స్థానంలో ఉంటుంది.;
భాషతో సంబంధం లేకుండా వరుస చిత్రాలలో నటిస్తూ.. తన నటనతోనే కాకుండా అందంతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న అతి కొద్దిమంది హీరోయిన్స్ లలో శ్రీ లీల మొదటి స్థానంలో ఉంటుంది. అందంతో, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేస్తున్న ఈ ముద్దుగుమ్మ అటు ఫ్యాషన్ సెన్స్ లో కూడా సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో కూడా ముందుండే శ్రీలీల తాజాగా మరో ఫోటోషూట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అందులో భాగంగానే తాజాగా ఎల్లో కలర్ ఆఫ్ షోల్డర్ ఫ్రాక్ లో ప్లెజెంట్ గా కనిపిస్తూ తన లుక్స్ తో కుర్రాళ్ల మతులు పోగోడుతోంది. ఇక తాజాగా శ్రీలీలా షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో అమ్మడి అందానికి అభిమానులు ఫిదా అవుతున్నారు.
చైల్డ్ ఆర్టిస్టుగా కెరియర్ మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ 2019లో విడుదలైన కిస్ అనే చిత్రం ద్వారా హీరోయిన్ గా వెండి తెరకు పరిచయమయ్యింది. తెలుగులో 2021 లో వచ్చిన పెళ్లి సందD అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఆ తర్వాత 2022లో రవితేజ హీరోగా వచ్చిన ధమాకా సినిమాతో భారీ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంది. తర్వాత భగవంత్ కేసరి, గుంటూరు కారం, మాస్ జాతర అంటూ పలు చిత్రాలలో నటించి ప్రేక్షకులను అలరించింది. తన నటనతో ఏకంగా మూడు సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ను కూడా దక్కించుకుంది శ్రీలీల.
నిజానికి మాస్ జాతర సినిమాతో సక్సెస్ అందుకోవాలని ఎన్నో కలలుకంది శ్రీ లీల. కానీ ఈ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం శివకార్తికేయన్ తో కలిసి పరాశక్తి అనే సినిమాలో నటిస్తోంది. గురు, ఆకాశమే నీ హద్దురా వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు దర్శకత్వం వహించిన లేడీ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి డాన్ పిక్చర్స్ బ్యానర్ పై ఆకాష్ భాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 1960ల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాల్లో దేవ్ రామ్నాథ్, పృథ్వీ రాజన్ , అధర్వ, రవి మోహన్ , గురు, సోమ సుందరం, బాసిల్ జోసెఫ్, పాప్రి ఘోష్ , రానా దగ్గుబాటి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు అంతేకాదు ఈ చిత్రం ద్వారా శ్రీ లీల తొలి తమిళ సినీ రంగ ప్రవేశం చేస్తోంది.
అలాగే బాలీవుడ్లో కార్తీక్ ఆర్యన్ తో ఒక సినిమా చేస్తున్న ఈమె.. మరొకవైపు సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ తో కలిసి హారర్ కామెడీ సినిమా కూడా చేస్తోంది. ఒకవైపు సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా మరొకవైపు ఇద్దరు పిల్లలను దత్తత తీసుకొని తల్లిగా కూడా మారింది. అలాగే డాక్టర్ కోర్స్ పూర్తి చేసే పనిలో పడింది ఈ ముద్దుగుమ్మ.