వాలెంటైన్స్ డే కాదు గ్యాలంటైన్స్ డే.. మిస్ ఇండియాకి బాయ్ ఫ్రెండే లేడా?

వాలెంటైన్స్ డే.. ప్రేమికుల కోసం ప్రత్యేకంగా ఒక రోజున కేటాయించడం జరిగింది.;

Update: 2026-02-10 19:30 GMT

వాలెంటైన్స్ డే.. ప్రేమికుల కోసం ప్రత్యేకంగా ఒక రోజున కేటాయించడం జరిగింది. ముఖ్యంగా ప్రేమించుకున్న వారు లేదా కొత్తగా ప్రేమలో పడేవారు తమ భాగస్వామికి ప్రత్యేకంగా తమ అభిప్రాయాన్ని చెప్పే రోజు ఇది. అందుకే వారం రోజులపాటు జరిగే ఈ వాలెంటైన్స్ వీక్ లో తమ ప్రేయసిని లేదా ప్రియుడిని మెప్పించడానికి ఎదుటివారు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. రోజ్ డే, టెడ్డీ డే , చాక్లెట్ డే ఇలా ఎన్నో.. అయితే ఇలాంటి వాలెంటైన్స్ డేని కాస్త గ్యాలంటైన్స్ డే అంటూ కామెంట్లు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది మిస్ ఇండియా మానస వారణాసి.

ఇకపోతే ప్రేమ ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది.. కానీ కొంతమంది ధైర్యంగా బయటికి తమ అభిప్రాయాలను చెప్పుకుంటే.. మరికొంతమంది వన్ సైడ్ లవర్స్ గానే మిగిలిపోతున్నారు. అయితే ఇంకొంతమంది స్కూల్ డేస్ లోనే కాదు కాలేజ్ డేస్ లో కూడా అసలు తమ లైఫ్ లో ప్రేమ అనేదే లేదు అని చెప్పి అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఇకపోతే సామాన్యుల సంగతి పక్కన పెడితే.. సెలబ్రిటీలు అందులోను తమ అందంతో ఏకంగా మిస్ ఇండియాగా కిరీటాన్ని సొంతం చేసుకున్న మానస వారణాసి.. తన లైఫ్ లో ప్రేమ అనే పదానికి చోటే లేదు.. తనకు అసలు బాయ్ ఫ్రెండ్ లేడు అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది.

అసలు విషయంలోకి వెళ్తే సంతోష్ శోభన్ హీరోగా.. మానస వారణాసి హీరోయిన్గా తెరకెక్కుతున్న చిత్రం కపుల్ ఫ్రెండ్లీ. ఫిబ్రవరి 14వ తేదీన వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం ఒక ప్రెస్ మీట్ నిర్వహించింది. వాలెంటైన్స్ వీక్ అటు తమ సినిమా వాలెంటైన్స్ డే రోజున విడుదల కాబోతుండడంతో మీ లైఫ్ లో బాయ్ఫ్రెండ్ ఉన్నాడా అంటూ మీడియా మిత్రులు మానస వారణాసిని ప్రశ్నించారు. అయితే అక్కడ ఆమె సమాధానం విని అందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఇక ప్రేమ, బాయ్ ఫ్రెండ్ వంటి విషయాలపై మానస వారణాసి మాట్లాడుతూ.. "నాకు స్కూల్, కాలేజ్ రోజుల్లో కూడా బాయ్‌ఫ్రెండ్స్ లేరు. నేను మా గర్ల్స్ గ్యాంగ్‌తోనే ఉండేదాన్ని.

మేము వాలెంటైన్స్ కాకుండా గ్యాలంటైన్స్‌ను మాత్రమే సెలెబ్రేట్ చేసేవాళ్లం. ఇప్పటికీ ఈ గ్యాలంటైన్స్‌ మెమోరీస్ అన్నీ నా గర్ల్ గ్యాంగ్ తోనే " అంటూ చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది.. వెంటనే పక్కనే ఉన్న సంతోష్ శోభన్ మైక్ తీసుకొని.. మాకు మాత్రం బ్యాలంటైన్స్ డే తెలుసు అంటూ ఆటపట్టించారు.

Tags:    

Similar News