ప‌వ‌ర్‌స్టార్ కోసం క్రేజీ ప్లాన్‌..ఫ్యాన్స్‌కు పూన‌కాలే?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ `ఓజీ` బ్లాక్ బ‌స్ట‌ర్‌తో మ‌ళ్లీ ట్రాక్‌లోకి వ‌చ్చేశారు. సుజీత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ప‌వ‌న్ ఫ్యాన్స్‌ని ఫుల్ ఖుషీ చేసింది.;

Update: 2026-02-10 18:30 GMT

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ `ఓజీ` బ్లాక్ బ‌స్ట‌ర్‌తో మ‌ళ్లీ ట్రాక్‌లోకి వ‌చ్చేశారు. సుజీత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ప‌వ‌న్ ఫ్యాన్స్‌ని ఫుల్ ఖుషీ చేసింది. బాక్సాఫీస్ వ‌ద్ద భానీ విజ‌యాన్ని సాధించి వ‌సూళ్ల ప‌రంగానూ రికార్డులు సృష్టించింది. గ‌త ఏడాది విడుద‌లైన సౌత్ సినిమాల్లో అత్య‌ధిక వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన మూవీగా నిలిచింది. ప‌వ‌న్ యుఫోరియా కార‌ణంగా ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద రూ.300 కోట్ల‌మేర క‌లెక్ష‌న్స్‌ని రాబ‌ట్టిన విష‌యం తెలిసిందే. ఈ మూవీ అందించిన జోష్‌తో ప‌వ‌న్ ఇప్పుడు `ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌`లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

`గ‌బ్బ‌ర్‌సింగ్‌` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ మూవీ త‌రువాత హ‌రీష్ శంక‌ర్‌, ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌లిసి చేస్తున్న సినిమా కావ‌డంతో ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో, సినీ ల‌వ‌ర్స్‌లో భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఇందులో ప‌వ‌న్ ప‌వర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్నాడు. శ్రీ‌లీల‌, రాశీఖ‌న్నా హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు. ద‌ర్శ‌కుడు ద‌శ‌ర‌థ్ స్క్రీన్‌ప్లే అందిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇప్ప‌టికే పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టికే అంచ‌నాలు పెంచేసిన ఈ క్రేజీ యాక్ష‌న్ డ్రామాని మార్చి 26న భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు.

స‌త్య‌దేవ్‌, అశుతోష్ రాణా, న‌వాబ్ షా, గౌత‌మి కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ద‌ళ‌ప‌తి విజ‌య్ హిట్ మూవీ `థేరీ` దీనికి ఆధార‌మ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. కానీ హ‌రీష్ శంక‌ర్ మాత్రం ఇది రీమేక్ కాద‌ని వాదిస్తున్నాడు. ఇదిలా ఉంటే దీని త‌రువాత ప‌వ‌న్ క‌ల్యాణ్ స్టైలిస్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్‌రెడ్డితో ఓ భారీ యాక్ష‌న్ డ్రామాని చేయ‌నున్న విష‌యం తెలిసిందే. వ‌క్కంతం వంశీ స్టోరీ అందిస్తున్న ఈ మూవీని రామ్ తాళ్లూరి నిర్మించ‌నున్నారు. ఇది అన్నా ద‌మ్ముల నేప‌థ్యంలో సాగే ప‌వ‌ర్ ఫుల్ స్టోరీ అని తెలుస్తోంది.

అంతా ఓకే మ‌రి త‌మ్ముడిగా ప‌వ‌న్‌కు ఎవ‌రు న‌టిస్తారు? అన్న‌ది ఇప్పుడు అంద‌రిలో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. తాజా స‌మాచారం ప్ర‌కారం ఓ క్రేజీ హీరోని ప‌వ‌న్‌కు సోద‌రుడి క్యారెక్ట‌ర్ కోసం సురేంద‌ర్ రెడ్డి ట్రై చేస్తున్నార‌ట‌. త‌ను ఓకే అంటే థియేట‌ర్ల‌లో పూన‌కాలేన‌ని తెలుస్తోంది. ఇంత‌కీ ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు త‌మ్ముడిగా సురేంద‌ర్‌రెడ్డి ట్రై చేస్తున్న యంగ్ హీరో మ‌రెవ‌రో కాద‌ని, రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ అని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ `రౌడీ జ‌నార్థ‌న‌`, `ర‌ణ‌బాలి` వంటి పాన్ ఇండియా సినిమాల‌తో బిజీగా ఉన్నాడు.

ఈ రెండు కూడా త‌న‌కు చాలా ఇంపార్టెంట్‌. ఇలాంటి స‌మ‌యంలో విజ‌య్ దేవ‌ర‌కొండ...ప‌వ‌న్ కోసం త‌మ్ముడిగా న‌టిస్తాడంటే క‌ష్ట‌మే. ఆ అవ‌కాశం లేదు. కానీ సురేంద‌ర్‌రెడ్డి ట్రై చేస్తే అవుతుంద‌ని ఓ వ‌ర్గం అంటున్నారు. ఏది ఏమైనా వ‌రుస పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ల‌తో బిజీగా ఉన్న విజ‌య్ దేవ‌ర‌కొండ ..సురేంద‌ర్‌రెడ్డి ఆఫ‌ర్‌ని అంగీక‌రించే అవ‌కాశ‌మే లేద‌ని, ప‌వ‌న్‌కు త‌ను త‌మ్ముడి క‌నిపింక‌పోవ‌చ్చ‌ని రౌడీ ఫ్యాన్స్ అంటున్నారు.

Tags:    

Similar News