దేవర : మిడ్‌ నైట్ షో నిద్ర వల్ల తప్పు జరిగిందట!

ఈ మధ్య కాలంలో పెద్ద హీరోల సినిమాలు, భారీ బడ్జెట్‌ సినిమాలు రెండో వారం వసూళ్లు రాబట్టలేక పోతున్నాయి.

Update: 2026-07-26 06:46 GMT

ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబోలో రూపొందిన 'దేవర' సినిమా వచ్చి రెండేళ్లు కావస్తుంది. అయినా కూడా ఇప్పటికీ ఆ సినిమా గురించి చర్చ జరుగుతూనే ఉంది. దేవర ఫస్ట్‌ పార్ట్‌లో కథను సగంలో వదిలేసిన విషయం తెల్సిందే. సెకండ్‌ పార్ట్‌ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటి వరకు సెకండ్‌ పార్ట్‌ విషయమై ఎలాంటి క్లారిటీ లేదు. సోషల్‌ మీడియాలో అసలు సెకండ్‌ పార్ట్‌ అనేది ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. దేవర విడుదలైనప్పటి నుంచి కలెక్షన్స్ విషయమై ఫ్యాన్స్‌, యాంటీ ఫ్యాన్స్ మధ్య రచ్చ కొనసాగుతూనే ఉంది. విడుదల సమయంలో దేవర రూ.500 కోట్ల వసూళ్లు అంటూ వేసిన పోస్టర్‌ను యాంటీ ఫ్యాన్స్ ఏ స్థాయిలో ట్రోల్‌ చేశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హిందీ వర్షన్‌ భారీ వసూళ్లు రాబట్టిందని చేసిన ప్రకటన సైతం విమర్శల పాలు కావడం అందరికీ తెలిసిందే.

ఎన్టీఆర్ దేవర వసూళ్లు...

దేవర సినిమా వసూళ్ల విషయంలో జరుగుతున్న చర్చ నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్‌ కమ్‌ ప్రొడ్యూసర్ అయిన ధీరజ్‌ మొగిలినేని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దేవర సినిమాను తెలుగు రాష్ట్రాల్లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో నాగ వంశీ విడుదల చేయడం జరిగింది. అయితే కొన్ని ఏరియాలను నాగవంశీ నుంచి ధీరజ్‌ తీసుకున్నాడు. ఆయన డిస్ట్రిబ్యూట్‌ చేసిన మూడు ఏరియాల్లో మంచి వసూళ్లు నమోదు అయ్యాయట. ముఖ్యంగా మొదటి వారం రోజుల పాటు ఊహించిన దాని కంటే ఎక్కువ వసూళ్లు వచ్చినట్లు ఆయన పేర్కొన్నాడు. అంచనా వేసుకున్న వసూళ్లతో పోల్చితే వచ్చిన వసూళ్లు చాలా ఎక్కువ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కాస్త విడ్డూరంగా అనిపించినా, ఒక డిస్ట్రిబ్యూటర్‌ కనుక ఆయన మాటలు నమ్మదగినవి అంటూ సోషల్‌ మీడియాలో కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దేవర సినిమా విషయంలో తమకు ఎలాంటి అసంతృప్తి లేదని ఆయన అన్నారు.

నిర్మాత ధీరజ్‌ మాట్లాడుతూ...

ఈ మధ్య కాలంలో పెద్ద హీరోల సినిమాలు, భారీ బడ్జెట్‌ సినిమాలు రెండో వారం వసూళ్లు రాబట్టలేక పోతున్నాయి. కానీ దేవర సినిమా నాల్గవ వారం సైతం డీసెంట్‌ షేర్‌ను రాబట్టిందని ధీరజ్ చెప్పుకొచ్చాడు. తమకు దేవర సినిమాతో భారీ లాభాలు రాకపోయినప్పటికీ కచ్చితంగా ఒక మంచి ప్రాజెక్ట్‌ చేశాము అనే తృప్తి ఉందని చెప్పుకొచ్చాడు. సినిమాను విడుదలకు ముందు రోజు సెకండ్‌ షో వేయాలి లేదంటే విడుదల రోజు తెల్లవారు జామున షో తో అయినా రిలీజ్ చేయాలి. కానీ మిట్‌ నైట్‌ షో లతో సినిమాను విడుదల చేయవద్దని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు. దేవర సినిమా ను అర్ధ రాత్రి 1 సమయంలో విడుదల చేయడం ద్వారా అంతా నిద్రలో ఉండి సినిమాను చూడలేక పోయారు. దాంతో సినిమాకు నెగటివ్‌ టాక్‌ స్ప్రెడ్‌ అయింది. సినిమాను నిద్ర మత్తులో చూసిన వారు నెగటివ్‌గా ప్రచారం చేసినట్లుగా ధీరజ్‌ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

ఎన్టీఆర్‌, కొరటాల శివ, జాన్వీ కపూర్‌ల దేవర..

మిడ్‌ నైట్‌ షో లు వేయడం మంచిది కాదనే అభిప్రాయం వ్యక్తం చేశాడు. నిజమే సినిమా బాగుంటే పర్వాలేదు కానీ, ఏమాత్రం తేడా కొట్టినా, అటు ఇటుగా ఉన్నా కచ్చితంగా నిద్ర మత్తులో నెగటివ్‌ ప్రచారం ఎక్కువగా జరుగుతుందని దేవర సినిమా విషయంలో నిరూపితం అయ్యింది. సినిమా ఫలితం తో పోల్చితే జరిగిన ప్రచారం కు ఏమాత్రం సంబంధం లేదు. మిట్ నైట్‌ షో లు వేయడం వల్ల తప్పు జరుగుతుందని చాలా మంది ఆ సమయంలోనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పుడు ధీరజ్‌ మాటలతో ఇకపై టాలీవుడ్‌లో కచ్చితంగా మిడ్‌ నైట్‌ షో రిలీజ్‌ లు ఉండక పోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. దేవర సినిమాకు డీసెంట్‌ వసూళ్లు నమోదు అయ్యాయని మరోసారి ధీరజ్ మాటలతో నిరూపితం అయింది కనుక దేవర పార్ట్‌ 2 ను తీసుకు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఎన్టీఆర్‌, కొరటాల శివ దేవర పార్ట్‌ 2 కి ఎప్పుడు రెడీ అవుతారు అనేది చూడాలి.

Tags:    

Similar News